రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, సహాయ మంత్రి అనిప్రియా పటేల్ అధ్యక్షతన ఫార్మాసూటికల్స్ విభాగం సమీక్షా సమావేశం


ఫార్మా, మెడిటెక్‌ రంగంపై పూర్తి వివరాలను అందించి, డిపార్ట్‌మెంట్ కార్యకలాపాలపై వివరణాత్మక ప్రజెంటేషన్ చేసిన డిపార్ట్‌మెంట్

Posted On: 15 JUN 2024 4:50PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, ఆ శాఖ సహాయ మంత్రిసహాయ మంత్రి అనుప్రియ పటేల్ అధ్యక్షతన ఈ రోజు ఫార్మాస్యూటికల్స్ విభాగం సమీక్షా సమావేశం జరిగింది.  ఫార్మా, మెడిటెక్ రంగానికి సంబంధించి పరిస్థితిని వివరంగా ఆ విభాగం అందించింది. రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, ఆ విభాగం  ద్వారా అమలవుతోన్న పథకాలతో సహా డిపార్ట్ మెంట్ కార్యకలాపాలపై వివరణాత్మక ప్రజంటేషన్ ఇచ్చింది.
 

 


ప్రధాన మంత్రి దార్శనికత అయిన వికసిత్ భారత్ @ 2047పై దృష్టి సారించాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కిచెప్పారు. పంచవర్ష ప్రణాళిక, 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమీక్షించారు.  ఔషధ భద్రత పెంపు, వైద్య పరికరాల్లో ఆత్మనిర్భరత, జన ఔషధి పథకాన్ని విస్తరించడం… ఔషధాలు, చికిత్సలను పౌరులకు అందుబాటు ధరల్లోకి తీసుకురావడంపై పంచవర్ష ప్రణాళిక దృష్టి సారిస్తుంది.

నాణ్యతపై దృష్టి సారించాలని… వచ్చే మూడేళ్లలో అన్ని ఔషధాలు, వైద్య పరికరాల తయారీ కేంద్రాలను  ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అప్ గ్రేడ్‌చేయాలని కేంద్ర మంత్రి ఆదేశించారు.

****


(Release ID: 2025832) Visitor Counter : 67