రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
మంత్రిత్వశాఖ పనితీరును సమీక్షించిన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా. సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న
కేంద్రసహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్. మంత్రిత్వశాఖ వంద రోజుల అజెండాను విజయవంతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం
Posted On:
14 JUN 2024 6:58PM by PIB Hyderabad
కేంద్ర పహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్‌తో కలిసి కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ పనితీరును సమీక్షించారు కేంద్రమంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతైన వికసిత్ భారత్ 2047పైన దృష్టి పెట్టాలని గౌరవనీయులైన కేంద్రమంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా అధికారులను కోరారు. మంత్రిత్వశాఖ తయారు చేసిన వంద రోజుల అజెండాను విజయవంతం చేయడంపైన ఈ సమీక్షలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పరిశ్రమ బలోపేతమై ప్రగతిని సాధించాల్సిన ఆవశ్యకతపైనా, ఎగుమతులను ప్రోత్సహించడంపైనా, నైపుణ్య శిక్షణ పెంపుదలపైనా కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ఈ సమీక్షలో మాట్లాడారు.
రాబోయే ఐదు సంవత్సరాల్లో రసాయనాల రంగం స్థితిగతులపైనా, ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య వ్యాపార పరిస్థితులపైనా రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగ కార్యదర్శి సంక్షిప్తంగా వివరించారు. తమ శాఖ అమలు చేస్తున్న పథకాల గురించి, పిఎస్ యులతోపాటు, స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థల పని తీరును వివరించారు. మంత్రిత్వశాఖ ఆమోదించిన వంద రోజుల అజెండాపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు కేంద్రమంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరం లేని దిగుమతులను చేసుకోవద్దని, ఎగుమతులను పెంచేలాగా కృషి చేయాలని ఆదేశించారు. రసాయనాలు, పెట్రోకెమికల్ రంగ బలోపేతం చేయడం కోసం మంత్రిత్వశాఖలోకి వేగాన్ని, నైపుణ్యాన్ని, స్థాయిని తీసుకురావడంకోసం మంత్రిత్వశాఖ పని చేయాలని కోరారు. నైపుణ్యాభివృద్ధికి, శిక్షణ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయా కార్యక్రమాల్లో పరిశ్రమను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పరిశ్రమ ధృవీకరణలను అందించాలని ఆదేశించారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనకోసం అన్ని విధాలా కృషి చేయాలని కేంద్రమంత్రి శ్రీ జగత్ ప్రకాశ్‌నడ్డా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
***
(Release ID: 2025793)
Visitor Counter : 73