కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
06 జూన్ 2024న జారీ చేయబడిన 'నేషనల్ నంబరింగ్ ప్లాన్ రివిజన్' పై కన్సల్టేషన్ పేపర్ కు సంబంధించి స్పష్టత
బహుళ సిమ్‌లు/నంబర్లు ఉన్నందుకు వినియోగదారులపై ఛార్జీలు విధించాలని ట్రాయ్ భావిస్తుందనే ఊహాగానాలు నిస్సందేహంగా అవాస్తవం.
Posted On:
14 JUN 2024 7:04PM by PIB Hyderabad
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) జూన్ 06, 2024న 'రివిజన్ ఆఫ్ నేషనల్ నంబరింగ్ ప్లాన్'పై ఒక కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. ఈ కన్సల్టేషన్ పేపర్‌పై రాతపూర్వక అభిప్రాయాలను, వ్యాఖ్యలను 04 జూలై 2024లోగా, కౌంటర్ కామెంట్‌లను 04 జూలై 2024లోగా పంపిచేందుకు అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించి పత్రికా ప్రకటన కూడా అదే రోజు విడుదల చేశారు.
పరిమిత వనరుల సమర్ధ వినియోగం, కేటాయింపు లక్ష్యంగా మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్‌లకు ఫీజులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినట్లు కొన్ని మీడియా సంస్థలు(ప్రింట్,ఎలక్ట్రానిక్,సోషల్) ట్రాయ్ దృష్టికి వచ్చింది. ఎక్కువ సిమ్‌లు/నంబర్లు కలిగి ఉన్నందుకు వినియోగదారులపై ఛార్జీలు విధించాలని ట్రాయ్ భావిస్తున్నట్లు ఉన్న ఈ ఊహాగానాలు నిస్సందేహంగా అవాస్తవం. ఇటువంటి వాదనలు నిరాధారమైనవి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఉపయోగపడతాయి.
టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్స్ (టీఐ) వనరుల సంరక్షణ బాధ్యతలను ఒంటరిగా నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డీఓటీ), దేశంలోని నంబరింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, న్యాయబద్ధంగా ఉపయోగించడం కోసం సవరించిన జాతీయ నంబరింగ్ ప్లాన్‌పై సిఫార్సులను కోరుతూ 29 సెప్టెంబర్ 2022 నాడు ట్రాయ్‌ను సంప్రదించింది. దీనికి అనుగుణంగా… ప్రస్తుతం టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ (టీఐ) వనరుల కేటాయింపు, వినియోగాన్ని ప్రభావితం చేసే అన్ని అంశాలను అంచనా వేసే లక్ష్యంతో నేషనల్ నంబరింగ్ ప్లాన్ (ఎన్ఎన్పీ) సవరణపై ట్రాయ్ కన్సల్టేషన్ పేపర్‌ను జారీ చేయబడింది. ప్రస్తుత, భవిష్యత్ అవసరాల కోసం టీఐ వనరులు తగినంత అందుబాటులో ఉండేందుకు… కేటాయింపు, వినియోగానికి సంబంధించి విధానాలను మెరుగుపరిచేందుకు సవరణలను ప్రతిపాదించటం దీని లక్ష్యం.
ట్రాయ్ కన్సల్టేషన్ ప్రక్రియ పారదర్శకత, సమ్మిళితం సూత్రాలపై ఆధారపడి ఉంది. కన్సల్టేషన్ పత్రాల ప్రచురణ, భాగస్వాములు కామెంట్స్ సేకరణ, కన్సల్టేషన్‌కు సంబంధించిన అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల అధ్యయనం, బహిరంగ సభల ద్వారా చర్చలు లాంటివి ఇందులో ఉన్నాయి. డొమైన్. డీఓటీకి ట్రాయ్ చేసిన తుది సిఫార్సులు తగిన జాగ్రత్త, సవివరాత్మక విశ్లేషణల ఫలితంగా, పైన పేర్కొన్న కార్యకలాపాల వాటి ద్వారా వచ్చిన లాజికల్ ఫలితాలకు అనుగుణంగా ఉంటాయి.
మార్కెట్ శక్తుల స్వీయనియంత్రణను ప్రోత్సహించే విధంగా కనీస నియంత్రణ, జోక్యాన్ని ట్రాయ్ సమర్ధిస్తూ వస్తోంది. ఇప్పటికే ప్రచురితం అయిన కన్సల్టేషన్ పత్రానికి సంబంధించి తప్పుదారి పట్టించే సమాచారం, ఏవైనా నకిలీ ఊహాగానాలు అవాస్తమే కాక… ముక్తకంఠంతో నిస్సందేహంగా గట్టిగా ఖండిస్తున్నాము.
ఖచ్చితమైన సమాచారం కోసం ప్రజలు, ఇతర సంబంధిత వ్యక్తులు.. వెబ్‌సైట్ (https://trai.gov.in/notifications/press-release/trai-issues-consultation-paper-revision-national-numbering-plan) లో జారీ చేయబడిన అధికారిక పత్రికా ప్రకటన, కన్సల్టేషన్ పత్రాన్ని సంప్రదించాలని కోరింది. వాస్తవాలకు సంబంధించి సమగ్రత, స్పష్టత కూడిన వాతావరణాన్ని పెంపొందించడానికి ట్రాయ్ కట్టుబడి ఉంది.
మరింత స్పష్టత/సమాచారం కోసం ట్రాయ్ సలహాదారు (బీబీ & పీఏ) అబ్దుల్ కయూమ్‌ని advbbpa@trai.gov.in ద్వారా సంప్రదించండి.
***
(Release ID: 2025790)
Visitor Counter : 69