బొగ్గు మంత్రిత్వ శాఖ

వాణిజ్య పరంగా బొగ్గు బ్లాక్ 10వ దఫా వేలాన్ని చేపట్టనున్న బోగు మంత్రిత్వ శాఖ


ఈ దఫా 62 బ్లాకులను వేలం వేసే అవకాశం

Posted On: 14 JUN 2024 4:46PM by PIB Hyderabad

ఇంధన రంగంలో 2047 కల్లా స్వతంత్రంగా అభివృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, "బొగ్గు రంగంలో ఆత్మ నిర్భర్ (స్వయం సమృద్ధి)" దిశగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా పది వాణిజ్యపరంగా బొగ్గు బ్లాకుల 10 వ దఫా వేలం కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి వచ్చే వారం ప్రారంభించనున్నారు. దీనిలో పూర్తి పారదర్శకత, అధిక మొత్తంలో ఆదాయం వచ్చేలా అధికారులు దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. 

10వ రౌండ్ వేలం సమయంలో, తుది వినియోగదారు పరిమితులు లేకుండా దాదాపు 62 బ్లాక్‌లు ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ వాణిజ్య బ్లాకుల నుండి ఉత్పత్తి చేసే బొగ్గును పొందే వారు స్వేచ్ఛా మార్కెట్‌లో విక్రయించడానికి అనుమతి ఉంటుంది.

జూన్, 2020లో కమర్షియల్ బొగ్గు బ్లాక్ వేలాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు.  అప్పటి నుండి, గత 9 రౌండ్లలో, బొగ్గు మంత్రిత్వ శాఖ 256 మెట్రిక్ టన్నుల గరిష్ట స్థాయి సామర్థ్యంతో 107 బొగ్గు బ్లాకులను విజయవంతంగా వేలం వేసింది.

ఇప్పటి వరకు 11 కమర్షియల్‌ బొగ్గు బ్లాక్‌లు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరంలో వాణిజ్య బ్లాకుల నుండి 17.5 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. బిడ్డర్లకు బొగ్గు బ్లాకుల భౌగోళిక లక్షణాల దృశ్యమానతను సులభతరం చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో బొగ్గు బ్లాక్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది.

***



(Release ID: 2025787) Visitor Counter : 42