గనుల మంత్రిత్వ శాఖ
బొగ్గు మరియుగనుల శాఖ కేంద్ర మంత్రి గా పదవీబాధ్యతల ను స్వీకరించిన శ్రీ జి. కిశన్ రెడ్డి
Posted On:
13 JUN 2024 5:45PM by PIB Hyderabad
బొగ్గు మరియు గనుల శాఖ కేంద్ర మంత్రి గా శ్రీ జి. కిషన్ రెడ్డి పదవీబాధ్యతల ను ఇక్కడ ఈ రోజు న స్వీకరించారు. బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దుబే సమక్షం లో బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పూర్వ కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి శ్రీ జి. కిషన్ రెడ్డి కి పదవీబాధ్యతల ను అప్పగించారు. బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దుబే పదవీబాధ్యతల ను 2024 జూన్ 11 వ తేదీ న ఆధికారికం గా స్వీకరించారు.


ఈ సందర్భం లో గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వి.ఎల్. కాంత రావు, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా, ఇంకా ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

పదవీ బాధ్యతల ను చేపట్టిన తరువాత ప్రసార మాధ్యమాల ప్రతినిధుల తో శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బొగ్గు మరియు గనుల శాఖ కేంద్ర మంత్రి గా సేవల ను అందించేటటువంటి ఈ యొక్క బాధ్యత ను మరియు భారతదేశ ప్రజల కు సేవ చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి తన యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. బొగ్గు, ఇంకా గనుల త్రవ్వకం రంగం లో భారతదేశాన్ని ‘ఆత్మనిర్భరత’ (‘స్వయం-సమృద్ధి’) కలిగిందిగా తీర్చిదిద్దే దిశలో బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ లు రెండూ కూడాను దృఢ సంకల్పం తోను, నిష్ఠ తోను, సమర్పణ భావం తోను, నిజాయతీ తోను మరియు పారదర్శకత్వం తోను శ్రమిస్తాయి అని ఆయన తెలిపారు.

***
(Release ID: 2025116)
Visitor Counter : 161