వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారతదేశం నుండియుఎఇ కి ఎమ్ డి 2 రకం అనాస పండు ల ఒకటో కన్ సైన్ మెంట్ ను పంపించడాన్ని సరళతరంచేసిన ఎపీడా

Posted On: 13 JUN 2024 11:54AM by PIB Hyderabad

భారతదేశం యొక్క తాజా ఫలాలను ఎగుమతి చేసే రంగం లో ఒక ముఖ్యమైనటువంటి ముందడుగు లో భాగం గా, ఎమ్‌డి 2 రకాని కి చెందిన అనాస పండ్ల ఒకటో కన్ సైన్ మెంట్ ను ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కి ఎగుమతి చేయడానికి వాణిజ్యం మరియు పరిశ్రమ ల మంత్రిత్వ శాఖ అధీనం లోని ఎగ్రీకల్చరల్ ఎండ్ ప్రాసెస్‌డ్ ఫూడ్ ప్రొడక్ట్‌స్ ఎక్స్‌పోర్ట్ డివెలప్‌మెంట్ ఆథారిటి (ఎపిఇడిఎ.. ‘ఎపీడా’) మార్గాన్ని సుగమం చేసింది.

 

విశిష్టమైన ఎమ్‌డి 2 రకం అనాస పండ్ల తో కూడిన 8.7 మెట్రిక్ టన్నుల (650 పెట్టెల) సరకు ను పంపడం కోసం సాంప్రదాయకం గా ఆకుపచ్చటి జెండా ను ఎపీడా చెయర్ మన్ శ్రీ అభిషేక్ దేవ్ ఎపీడా మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్రికల్చరల్ రిసర్చ్ - సెంట్రల్ కోస్టల్ ఎగ్రికల్చరల్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐసిఎఆర్ సిసిఎఆర్ఐ) కి చెందిన సీనియర్ అధికారుల సమక్షం లో చూపెట్టి ఆ సరకు రవాణా ను ప్రారంభించారు.

 

ఈ సందర్భం లో శ్రీ అభిషేక్ దేవ్ మాట్లాడుతూ, ‘‘ఇది భారతదేశం యొక్క వ్యవసాయ సంబంధి ఎగుమతుల చరిత్ర లో ఒక ముఖ్యమైన క్షణం ఒక్కటే కాకుండా మంచి నాణ్యత తో కూడిన అనాస పండ్ల ను పండించేందుకు మరియు ప్రపంచ బజారుల కు సరఫరా చేసేందుకు మనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని చాటిచెబుతోంది కూడాను’’ అన్నారు. ఎమ్‌డి 2 రకం తనదైన అసాధారణ తీపిదనానికి మరియు నాణ్యతకు ప్రసిద్ధిగన్నది; మరి ఈ సరకు ను ఇక యుఎఇ బజారు కు పరిచయం చేస్తున్నామన్న ఉద్వేగానికి మేము లోనవుతున్నాంఅని కూడా ఆయన అన్నారు.

 

ఎమ్‌డి 2 రకం అనాస కు ‘‘గోల్డెన్ రైప్’’ లేదా ‘‘సూపర్ స్వీట్’’ అని కూడా వ్యావహారిక నామాలు ఉన్నాయి. ఇది అనాస పరిశ్రమ లో సువర్ణ ప్రమాణం గా మారిపోయింది. ఈ రకం పంట ను కోస్టా రికా, పిలిపీన్స్ మరియు థాయీలాండ్ వంటి దేశాల లో బాగా ఎక్కువ గా పండిస్తున్నారు.

 

మహారాష్ట్ర లోని కొంకణ్ ప్రాంతం లో గల సింధుదుర్గ్ జిల్లా లో పండించిన ఎమ్‌డి 2 రకం అనాస పండు ల పంటకోత అనంతర నిర్వహణ పద్ధతుల కు మరియు వాటి ఎగుమతి కి అవసరమైన చర్యల ను చేపట్టడం లో అతి ముఖ్యమైన సాంకేతిక సమర్థన ను ఐసిఎఆర్ సిసిఎఆర్ఐ అందించింది. ప్రైవేటు రంగం లోని ఒక సంస్థ స్థానిక రైతుల తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొని 200 ఎకరాల లో ఈ రకం అనాస పంట ను ఫలవంతం గా పండించిది, దీనితో అత్యంత ప్రశస్తమైన నాణ్యత మరియు దిగుబడి సాధ్యపడింది.

 

పంటకోత అనంతరం అనాస పండుల ను ఎంతో శ్రద్ధ తో వర్గీకరించి, వేరు పరచి, రవాణా చేసి నవీ ముంబయి లోని పన్‌వేల్ లో నిలవ చేయడమైంది. అక్కడి నుండి, కన్ సైన్ మెంటు ను యుఎఇ కి పంపించడానికని జవాహర్ లాల్ నెహ్‌రూ పోర్ట్ ట్రస్ట్ (జెఎన్‌పిటి) కి తీసుకుపోవడమైంది.

 

భారతదేశం నుండి తాజా పండుల ను మరియు కాయగూరల ను ఎగుమతి చేయడాన్ని ప్రోత్సహించడం కోసం ఎపీడా చిత్తశుద్ధి తో కృషి చేస్తున్నది. ఎమ్‌డి 2 రకం అనాస పండుల ఈ ఒకటో ప్రయోగాత్మక ఓడరవాణా సరకు ఎపీడా యొక్క ఎగుమతి సరకుల జాబితా లో ఒక గణనీయమైన చేరిక ను సూచిస్తున్నది. ఇది ప్రపంచ బజారు లో భారతదేశం యొక్క ఉనికి ని వృద్ధి చెందింప చేసేదే.

 

***

 

 



(Release ID: 2025051) Visitor Counter : 68