ప్రధాన మంత్రి కార్యాలయం

సోషల్ మీడియా హేండిల్స్ నుండి ‘మోదీ కా పరివార్’ ట్యాగ్ ను తొలగించాలనిప్రజల ను కోరిన ప్రధాన మంత్రి

Posted On: 11 JUN 2024 10:50PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ను సమర్థిస్తున్న వారిని వారి యొక్క సోషల్ మీడియా హేండిల్స్ లో ఉన్న మోదీ కా పరివార్అనే ట్యాగ్ లైను ను తొలగించవలసింది గా అభ్యర్థించారు.

 

భారతదేశం యొక్క ప్రజలు నిరంతరం సమర్థన ను ఇస్తున్నందుకు గాను శ్రీ నరేంద్ర మోదీ తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం కాలం లో చాలా మంది తన పట్ల ఆప్యాయత కు గుర్తు గా వారి యొక్క సోశల్ మీడియా ప్రొఫైల్స్ లో మోదీ కా పరివార్’ (‘మోదీ యొక్క కుటుంబం’) అనే పదాల ను జోడించారు అని ఆయన అన్నారు. డిస్‌ ప్లే లో వాక్యం మారితే మారవచ్చు గాక; అయితే, భారతదేశం యొక్క ప్రగతి కోసం పాటుపడుతున్న ఒక కుటుంబం గా మన బంధం బలమైంది గాను మరియు విడదీయలేనిది గాను ఉంటుంది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా ఒక సందేశాన్ని నమోదు చేశారు -

 

‘‘ఎన్నికల ప్రచారం కొనసాగిన కాలం లో, దేశం నలు మూలల ప్రజలు నేనంటే వారికి ఉన్న ఆప్యాయత కు గుర్తు గా వారి యొక్క సోశల్ మీడియా లో మోదీ కా పరివార్అనే మాటల ను జత పరచారు. దీని నుండి నాకు ఎంతో బలం లభించింది. భారతదేశం లో ప్రజలు ఎన్‌డిఎ కు వరుస గా మూడో పర్యాయం సంఖ్యాధిక్యాన్ని ఇచ్చారు; ఇది ఒక విధమైన రికార్డు వంటిది; ఇది మా దేశ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తూనే ఉండడాని కి ఇచ్చినటువంటి ప్రజల తీర్పు అని కూడా చెప్పాలి.

 

మనం అందరం ఒకే కుటుంబం అనేటటువంటి సందేశం ప్రభావ వంతం అయిన రీతి లో వ్యక్తం అయినందువల్ల, నేను మరొక్కసారి భారతదేశం యొక్క ప్రజల కు ధన్యవాదాల ను తెలియజేస్తున్నాను. ఇంకా, మీరు ఇకపై మీ మీ సోశల్ మీడియా ప్లాట్ ఫార్మ్ స్ లో నుండి మోదీ కా పరివార్అనే పదాల ను తీసివేయవచ్చును. డిస్‌ ప్లే లో పేరు మారవచ్చు గాక, కాని భారతదేశం యొక్క ప్రగతికై శ్రమిస్తున్న ఒక కుటుంబం గా మన మధ్య బంధం బలం గాను, విడదీయ లేనటువంటిది గాను ఉంటుంది.’’



(Release ID: 2024668) Visitor Counter : 39