భారత పోటీ ప్రోత్సాహక సంఘం

బ్లాక్‌రాక్ సంస్థ పెట్టుబడులతో గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, ఎల్ఎల్‌సి కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం

Posted On: 11 JUN 2024 7:37PM by PIB Hyderabad

   బ్లాక్‌రాక్ ఇన్‌కార్పొరేష‌న్‌ (ఇంక్) పెట్టుబడులతో గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, ఎల్ఎల్‌సి కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదముద్ర వేసింది. ఈ ప్రతిపాదిత సమ్మేళనం బ్లాక్‌రాక్ ఫండింగ్, ఇంక్ (బిఎఫ్ఐ) పెట్టుబడులతో ‘గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, ఎల్ఎల్‌సి’ (జిఐఎం)లో 100 శాతం లిమిటెడ్ లయబిలిటీ ప్రయోజనాల కొనుగోలుకు ఉద్దేశించబడింది.

   ‘బిఎఫ్ఐ’ అనేది బ్లాక్‌రాక్ ఇంక్ సంస్థకు స్వతంత్ర కార్యకలాపాల్లేని ఒక పూర్తిస్థాయి కొత్త అనుబంధ సంస్థ. కాగా, బ్లాక్‌రాక్ అనేది ప్రపంచవ్యాప్తంగాగల సంస్థాగత-రిటైల్ ఖాతాదారులకు ప్రపంచ పెట్టుబడుల నిర్వహణ, ముప్పు నిర్వహణసహా సలహాదారు సేవలు అందించే అమెరికాలోని క్రియాశీల పబ్లిక్‌ ట్రేడెడ్ కంపెనీ. ఇది ప్రపంచంలోని సంస్థాగత-వ్యక్తిగత పెట్టుబడిదారుల తరఫున వారి ఆస్తులను నిర్వహణ బాధ్యతను చూస్తుంది.

   ఇక ‘జిఐఎం’ అనేది మౌలిక సదుపాయాల స్వతంత్ర నిర్వహణ సంస్థ కాగా, దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంటుంది. ‘జిఐఎం’తోపాటు దాని అనుబంధ సంస్థలు ‘గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్ట్‌నర్స్’ (జిఐపి ఫండ్స్) అనే వ్యాపార నామంతో నిర్దిష్ట పెట్టుబడి నిధుల నిర్వహణ బాధ్యతలు వహిస్తాయి.

ఈ లావాదేవీపై సమగ్ర ఉత్తర్వులను ‘సిసిఐ’ త్వరలో జారీచేయనుంది.

****



(Release ID: 2024526) Visitor Counter : 30


Read this release in: Khasi , English , Urdu , Hindi