పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన శ్రీ రాజీవ్ రంజన్ సింగ్


సహాయ మంత్రులుగా శ్రీ జార్జ్ కురియన్, ప్రొఫెసర్ ఎస్ పి సింగ్ బఘేల్ కూడా బాధ్యతల స్వీకరణ

प्रविष्टि तिथि: 11 JUN 2024 5:24PM by PIB Hyderabad
శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికత, విధానాల అమలును కొనసాగిస్తామని అన్నారు. ఈ దార్శనికత అమలులో ఏవైనా అడ్డంకులు ఎదురైనా వాటిని తొలగించడం పై తన దృష్టి ఉంటుందని శ్రీ సింగ్ చెప్పారు. 

 

పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘెల్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ కూడా వారి సంబంధిత శాఖల బాధ్యతలు చేపట్టారు. మంత్రులకు శాఖల కార్యదర్శులు, మంత్రిత్వ శాఖల ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

 

***


(रिलीज़ आईडी: 2024515) आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Kannada