వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్.
యువతకు నూతన అవకాశాల్ని సృజించడంలో నిబద్దతతో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. పౌరులందరి సంక్షేమంకోసం అవిశ్రాంత కృషి: శ్రీ గోయల్
Posted On:
11 JUN 2024 6:31PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యకమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాదతోపాటు వాణిజ్య కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్, వ్యాపార ప్రోత్సాహక విభాగం మరియు అంతర్గత వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ (డిపిఐఐటి) , ఇంకా పలువురు సీనియర్ అధకారులు పాల్గొన్నారు.
దేశానికి సేవ చేసే భాగ్యాన్ని మరోసారి కలిగించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ పీయూష్ గోయల్ కృతజ్ఞతలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధికర పాలన అనేది దేశవ్యాప్తంగా ప్రగతికి కారణమైందని అన్నారు. ఆయన వేసిన పునాదిమీద నిర్మాణం కొనసాగాల్సిన ఆవశ్యకత వుందని అన్నారు.
అమృతకాలంలో శ్రద్ధగా అంకితభావంతో చేయాల్సిన కృషికి గల ప్రాధాన్యతను శ్రీ గోయల్ గట్టిగా చెప్పారు. తద్వారా వాణిజ్యం మరియు పరిశ్రమల రంగాలలో వేగవంతమైన ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. యువతకు నూతన అవకాశాల్ని సృజించడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్దతతో పని చేస్తున్నదని, పౌరులందరి సంక్షేమంకోసం అవిశ్రాంత కృషి జరుగుతోందని అన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం కింద నూతన శిఖరాలను అందుకోవడానికి దేశం సిద్ధంగా వుందని అన్నారు. సబ్ కా సాత్, సబ్ కా ప్రయాస్ నినాదం వెనక వున్న తాత్వికతను ఆయన ప్రస్తావించారు. ప్రజల ఉమ్మడి కృషి, వారి విశ్వాసం అనేవి దేశాన్ని బంగారు భవిష్యత్తువైపు నడిపిస్తాయని స్పష్టం చేశారు.
***
(Release ID: 2024503)
Visitor Counter : 79