రక్షణ మంత్రిత్వ శాఖ
ఎయర్ ఫోర్స్అకాడమి (ఎఎఫ్ఎ), దుండిగల్ లో 2024 జూన్ 15 వ తేదీ నాడు కంబైన్డ్ గ్రాజుయేశన్ పరేడ్ (సిజిపి) ని సమీక్షించనున్నచీఫ్ ఆఫ్ ఎయర్ స్టాఫ్
Posted On:
10 JUN 2024 3:18PM by PIB Hyderabad
భారతీయ వాయు సేన (ఐఎఎఫ్) లోని ఫ్లయింగ్ ఎండ్ గ్రౌండ్ డ్యూటీ విభాగాల కు చెందిన ఫ్లైట్ కేడెట్స్ యొక్క ప్రి-కమిశనింగ్ ట్రైనింగ్ శిక్షణ విజయవంతం గా సమాప్తం అయిందని సూచించడం కోసం హైదరాబాద్ లోని దుండిగల్ లో గల ఇండియన్ ఎయర్ ఫోర్స్ అకాడమి (ఎఎఫ్ఎ) లో 213 మంది అధికారుల పాఠ్యక్రమం తాలూకు కంబైన్డ్ గ్రాజుయేశన్ పరేడ్ (సిజిపి) ని 2014 జూన్ 15 వ తేదీ నాడు సాంప్రదాయక సైన్య భవ్యత యుక్తం గా నిర్వహించడం జరుగుతుంది. ఈ పరేడ్ కు సమీక్ష అధికారి (ఆర్ఒ) గా వాయు సేన ప్రధాన అధికారి (చీఫ్ ఆఫ్ ఎయర్ స్టాఫ్- సిఎఎస్) ఎయర్ చీఫ్ మార్శల్ శ్రీ వి.ఆర్, చౌధరి ఉంటారు.
ఈ కార్యక్రమం లో సమీక్ష అధికారి (ఆర్ఒ) స్నాతక శిక్షణార్థుల కు రాష్ట్రపతి యొక్క కమిశన్ ను ప్రదానం చేయనున్నారు. ఇదే కార్యక్రమం లో విమానాన్ని నడపడం లో శిక్షణ ను సఫలతపూర్వకంగా ముగించిన ఫ్లైట్ కేడెట్స్ కు, భారతీయ నౌకాదళం, భారతీయ కోస్తా తీర రక్షక దళం ల అధికారుల కు మరియు మిత్ర దేశాల యొక్క అధికారుల కు ‘వింగ్స్’ ను ప్రదానం చేయడం భాగం గా ఉంటుంది. శిక్షణ తాలూకు ఒక కఠోరమైన గడువు ను ముగించినందుకు ప్రతీక గా ఉండేటటువంటి ఈ సందర్భం వైమానిక దళం లో ఉద్యోగాన్ని ఆశించిన అభ్యర్థుల యొక్క వృత్తి జీవితం లో అత్యంత ప్రధానమైన మైలురాయి వంటిది గా ఉంటుంది.
ఫ్లయింగ్ విభాగం లో ప్రతిభ క్రమం వారి గా ఒకటో స్థానం సంపాదించిన ఫ్లయింగ్ కేడెట్ కు మొత్తం మీద శిక్షణ లో ప్రావీణ్యాన్ని కనబరచినందుకు గాను చీఫ్ ఆఫ్ ద ఎయర్ స్టాఫ్ యొక్క ‘స్వార్డ్ ఆఫ్ ఆనర్’ ను మరియు రాష్ట్రపతి ఫలకాన్ని అందజేయడం జరుగుతుంది. అదే ఫ్లయిట్ కేడెట్ కు, పరేడ్ కు నాయకత్వాన్ని వహించే విశేష అధికారం కూడా దక్కుతుంది. గ్రౌండ్ డ్యూటీ విభాగాల లో మొత్తం మీద ప్రతిభ క్రమం వారి గా ప్రథమ స్థానం లో నిలచే శిక్షణార్థి కి రాష్ట్రపతి ప్రశంస ఫలకాన్ని కూడా సమీక్ష అధికారి (ఆర్ఒ) ప్రదానం చేస్తారు. పిలాటస్ పిసి -7 ఎమ్‌కె-lI, డోర్నియర్, హాఁక్, కిరణ్ మరియు చేతక్ విమానాల శ్రేణుల ద్వారా ఉత్తేజ భరితమైన ఫ్లయ్ ఫాస్ట్, మరి అలాగే పిలాటస్ పిసి -7 ఎమ్‌కె-lI, ఎస్ యు-30 ఎమ్ కెఐ, సూర్య కిరణ్ ఎరోబాటిక్ టీమ్ (ఎస్‌కెఎటి), ఇంకా సారంగ్ హెలికాప్టర్ డిస్ ప్లే టీమ్ ద్వారా ఎరోబాటిక్ శో కంబైన్డ్ గ్రేజుయేశన్ పరేడ్ (సిజిపి) విన్యాసాల తో పరేడ్ ముగింపు దశ కు చేరుకొంటుంది.
భారత వాయు సేన (ఐఎఎఫ్) లో ప్రముఖ శిక్షణ విభాగం అయిన ఎఎఫ్ఎ భారతీయ వాయు సేన యొక్క విమాన చోదకుల, గ్రౌండ్ డ్యూటీ మరియు సాంకేతిక అధికారుల కు శిక్షణ ను ఇస్తున్నది. ఈ అకాడమి 1967 వ సంవత్సరం అక్టోబరు 11 వ తేదీ నాడు అప్పటి భారతదేశం యొక్క రాష్ట్రపతి డాక్టర్ శ్రీ జాకిర్ హుసైన్ శంకు స్థాపన చేయడం తో లాంఛనం గా ఉనికి లోకి వచ్చింది. సౌహార్ద భావన ను పెంపొందింపచేయడం మరియు ప్రతి శాఖ కు చెందిన అధికారుల మధ్య ఆరోగ్యకరమైన మాటామంతీ ని ప్రోత్సహించడం అనేవి ఈ అకాడమి లో శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు గా ఉన్నాయి.
***
(Release ID: 2023870)
Visitor Counter : 92