రక్షణ మంత్రిత్వ శాఖ
సింధు శిఖర్ కార్ ర్యాలీ ప్రారంభానికి గుర్తు జెండాను చూపెట్టే కార్యక్రమం (2024 జూన్ 10 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు)
Posted On:
10 JUN 2024 4:43PM by PIB Hyderabad
దిల్లీ నుండి లేహ్ కు వెళ్ళి తిరిగి వచ్చేందుకు ఉద్దేశించిన సింధు శిఖర్ కార్ ర్యాలీ కి చీఫ్ ఆఫ్ పర్సనెల్ వైస్ ఎడ్ మరల్ శ్రీ సంజయ్ భల్లా 2024 జూన్ 10 వ తేదీ న న్యూ ఢిల్లీ లో జెండా ను చూపెట్టడం ద్వారా ఆ ర్యాలీ ని ప్రారంభించారు. భారతదేశం యొక్క సుసంపన్నమైనటువంటి సముద్ర సంబంధి వారసత్వాన్ని గురించి న చైతన్యాన్ని ఉత్తరాది రాష్ట్రాల లో వ్యాప్తి చేయాలన్నది ఈ యాత్ర యొక్క ప్రధానోద్దేశ్యం.
నలభై మంది నౌకా దళ ఉద్యోగుల తో కూడిన ఈ యాత్ర మారుమూల ప్రాంతాల గుండా సాగుతూ 18 రోజుల లో 3637 కిలో మీటర్ ల మేర కలియదిరుగనుంది.
భారతీయ నౌకా దళం యొక్క పౌర సంబంధాల కార్యక్రమాల లక్ష్య సాధన లో ఈ యాత్ర ఒక ప్రధానమైన మైలురాయి కాగలదు. ముఖ్యం గా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము మరియు కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ల లోని పలు ప్రాంతాల లో పాఠశాల లు, కళాశాల లు మరియు ఎన్‌సిసి విభాగాలకు చెందిన వారి తో మాటామంతీ జరపడం తో పాటుగా చండీగఢ్ లో నిర్వహించే ఒక కార్యక్రమం లో పూర్వ సైనికులతో సంభాషించడం ఒక భాగం గా ఉండబోతున్నది. విద్యార్థుల తో మాటలాడే క్రమం లో, భారతీయ నౌకా దళం లో చేరడం ఎలాగో యువత కు తెలిపేందుకు జట్టు సభ్యులు కొన్ని ప్రదర్శనలను సమర్పించడం తో పాటు గా సాయుధ దళాల లో యువత చేరేటట్టు గా వారిలో ప్రేరణ ను కలిగించనున్నారు.
****
(Release ID: 2023868)
Visitor Counter : 85