వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఐపిఇఎఫ్ క్లీన్ ఇకానమి ఇన్ వెస్టర్ ఫోరమ్ లో భారతదేశం యొక్క అవకాశాల ను చాటిచెప్పడమైంది
ప్రపంచవ్యాప్త ఇన్ వెస్టర్ లు మరియు ఆర్థిక సహాయ సంస్థ ల కు చెందిన 60 మంది కి పైగా ప్రతినిధులు ఈ సమావేశం లో పాల్గొన్నారు
ప్రపంచ స్థాయి ఇన్ వెస్టర్ లను ఆకర్షించడం కోసమని 15 కు పైగా భారతీయ సంస్థ ల ప్రతినిధులు ఈ కార్యక్రమం లోపాలుపంచుకొన్నాయి
Posted On:
07 JUN 2024 1:17PM by PIB Hyderabad
భారతదేశం లో గల పెట్టుబడి అవకాశాల ను చాటిచెప్పడం కోసమని వాణిజ్య విభాగం మరియు ఇన్వెస్ట్ ఇండియా లు ఇండో-పసిఫిక్ ఇకానమిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ ప్రాస్పెరిటీ (ఐపిఇఎఫ్) క్లిన్ ఇకానమి ఇన్ వెస్టర్ ఫోరమ్ యొక్క ప్రారంభిక సమావేశం సందర్భం లో ఒక సమావేశాన్ని నిర్వహించాయి.
ఈ సందర్భం లో వాణిజ్య విభాగం కార్యదర్శి శ్రీ సునీల్ బరథ్‌వాల్ ప్రారంభోపన్యాసాన్ని ఇస్తూ, బజారు ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలు గా క్రొత్త గా ఉనికి లోకి వస్తున్న దేశాల తో పోలిస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటు ఏ విధం గా దాదాపు గా రెండింతలు గా ఉన్నదీ నొక్కి చెప్పారు. ఈ బలమైన వృద్ధి ఇది వరకు మూలధన లభ్యత మరియు పన్నుల సంబంధి ప్రయోజనాల కోసం విదేశాల కు తరలి వెళ్ళినటువంటి భారతదేశం స్టార్ట్-అప్స్ ప్రస్తుతంలో స్వదేశాని కి తిరిగి వస్తున్నటువంటి ఒక ‘రివర్స్ ఫ్లిపింగ్’ సరళి కి సైతం దారితీస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ డిజిటల్ ఇకానమి తో పాటు గా ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) వంటి సరిక్రొత్తగా ఉనికి లోకి వస్తున్నటువంటి సాంకేతికత లు మరియు డేటా సెంటర్ ల సంఖ్య లో వృద్ధి రాబోయే కాలం లో భారతదేశం యొక్క వృద్ధి లో ఏ విధం గా కీలకం కానున్నాయి అని ఆయన స్పష్టం చేశారు.
సింగపూర్ లోని మరీనా బే సేండ్స్ లో నిర్వహించిన ఈ సమావేశం లో భారతదేశాని కి చెందిన ప్రైవేటు రంగం మరియు ప్రభుత్వ అధికారుల తో పాటుగా, యుఎస్, సింగపూర్, జాపాన్, ఆస్ట్రేలియా, కొరియా తదితర దేశాల నుండి విచ్చేసిన గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సహా అరవై మంది కి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో టెమాసెక్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్ట్‌నర్స్, గారంట్‌కో, ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డివెవలప్ మెంట్ గ్రూప్ (పిఐడిజి), గోల్డ్‌మన్ సేక్స్, ఐ స్క్వేయర్డ్ కేపిటల్, మిజుహో బేంక్ లిమిటెడ్, ఎడ్ వాంటేజ్ పార్ట్‌నర్స్, నోమురా, డిబిఎస్ బేంక్, ఇంకా సిటీ బేంక్ ల వంటి ఐపిఇఎఫ్ సభ్యత్వ దేశాల కు చెందిన ఇన్ వెస్టర్ లతో పాటు ఆర్థిక సహాయ సంస్థలు పాలుపంచుకొన్నాయి. భారతదేశాని కి చెందిన మౌలిక సదుపాయాల రంగం మరియు జలవాయు రంగం తో ముడిపడ్డ వ్యాపార సంస్థ లు వాటి యొక్క పరిష్కారాల ను ఈ సందర్భం గా ప్రదర్శించాయి; అవి ప్రపంచ బజారుల లో ప్రవేశించడం కోసం అంతర్జాతీయ ఇన్ వెస్టర్ లతో మాటామంతీ జరిపాయి.
సింగపూర్ లో భారతీయ కమిశనర్ డార్టర్ శ్రీ శిల్పక్ అంబులె ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ, భారతదేశం లో వృద్ధి కి దన్ను గా నిలుస్తున్న మౌలిక అంశాల ను గురించి వివరించారు. భౌతికమైనటువంటి మరియు డిజిటల్ మాధ్యమం లోని మౌలిక సదుపాయాల కల్పన పై పెట్టే పెట్టుబడి ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై అనేక విధాలు గా ఉంటుందని, మరి శాసన సంబంధమైనటువంటి, ఇంకా నియంత్రణ పరమైనటువంటి మార్పు లు బజారు కు అనుకూలమైన అవకాశాల ను కల్పించి, విధానాల కు సంబంధించిన సానుకూలమైనటువంటి మరియు భవిష్యత్తు లో ఏ రకమైన చర్య లు తెర మీదకు వచ్చేదీ ఊహించగలిగిన అటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తం గా సప్లయ్ చైన్ లో చోటు చేసుకొంటున్న పరివర్తన మరియు మౌలిక సదుపాయాల కల్పన సంబంధి ఆధునీకరణ దిశ లో భారతదేశం చేపడుతున్నటువంటి చర్య లు భారతదేశాని కి చక్కటి అవకాశాల ను ఏ విధం గా కల్పించనున్నాయో ఆయన ప్రముఖం గా ప్రకటించారు.
దీని తరువాత ఘట్టం లో భాగం గా భారతదేశం లోని అవకాశాలను గురించిన ఒక ప్రత్యేక సన్నివేశాన్ని ఆవిష్కరించడమైంది. ఇన్ వెస్ట్ ఇండియా ప్రభుత్వ వివిధ ప్రధాన కార్యక్రమాల ను గురించి ఒక వివరణ చిత్రాన్ని ప్రదర్శించింది. ఇందులో భారతదేశం లో స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ వర్ధిల్లుతూ ఉండడం, నైపుణ్యం కలిగిన మరియు ప్రతిభావంతులైన వృత్తి కుశలురతో కూడిన ఒక పెద్ద సమూహం వివిధ పరిశ్రమల కు అందుబాటు లో ఉండడం, మౌలిక సదుపాయాల కల్పన ప్రధానమైన ప్రాజెక్టుల లో పెట్టుబడుల కు ప్రోత్సాహం, నియంత్రణల ను ఒక గాడిన పెట్టేందుకు ఉద్దేశించినటువంటి విధానపరమైన సంస్కరణ చర్య లు, పారదర్శకత్వాన్ని పెంపొందించడం లతో పాటు ‘‘వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం’’ పైన శ్రద్ధ వహించడం వంటి వాటిని గురించి వివరించడమైంది.
ఇన్ వెస్ట్ ఇండియా యొక్క ఎమ్‌డి మరియు సిఇఒ నివృతి రాయ్ గారు మాట్లాడుతూ, భారతదేశం నెట్ జీరో లక్ష్యాల ను సాధించడానికి బలమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, జలవాయు సాంకేతిక పరిజ్ఞానం మరియు నవీకరణ యోగ్య శక్తి సంబంధి ప్రాజెక్టుల లో ముందంజ వేయడం కోసం ఇన్ వెస్టర్ లతోను, క్లీన్ ఇకానమి సంస్థల తోను మరియు వినూత్నమైనటువంటి స్టార్ట్-అప్స్ తోను కలసి పనిచేయడానికి ఆసక్తి ని కనబరుస్తోందన్నారు.
‘‘చార్టింగ్ ఇండియా ఆపర్‌చ్యునిటీ’’ శీర్షిక తో జరిగిన ఒక సంభాషణ లో సీనియర్ ఆర్థికవేత్త మరియు కార్యనిర్వాహక సంచాలకురాలు రాధిక రావు గారు పాల్గొంటూ, భారతదేశం యొక్క శక్తి ‘నాలుగు సి’ (4C) లలో ఇమిడివుందన్నారు. ఆ ‘నాలుగు సి’ లు ఏవేవి అంటే వాటిలో కన్‌సిస్టెన్సీ & కంటిన్యుయిటీ ఇన్ పాలిసీ (విధానాల పరం గాను, సంస్కరణలోను స్థిరత్వం); ఇంక్రీజింగ్ కేపెక్స్ (ప్రభుత్వం ద్వారాను, వినియోగం మాధ్యం ద్వారాను మరియు ప్రయివేటు రంగం ద్వారాను మూలధన నిధుల ను పెంచడం) ; తయారీ రంగాల ను ఆకట్టుకొనే తరహా లో వ్యాపారాల కూర్పు; రాబోయే 5 సంవత్సరాల లో వినియోగం పరం గా వృద్ధి అనేవే అని ఆమె చెప్పారు.
నోమురా ఇండియా నివేదిక ను గురించి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనల్ వర్మ గారు విపులం గా మాట్లాడారు. ‘‘బాటమ్స్ అప్’’ పేరు తో నిర్వహించిన ఒక అధ్యయనం లో అత్యధిక వ్యాపార సంస్థ లు మరే ఇతర భూభాగం కంటే కూడా భారతదేశానికేసే ఆశ గా చూస్తున్నాయని తేలింది. ‘‘బాటమ్స్ అప్’’ అధ్యయనం లో భాగం గా దాదాపు గా 130 కంపెనీలు వాటి వాటి పెట్టుబడుల ను ఏ దేశం లో, ఏ ఏ రంగాల లో పెట్టాయో తెలుసుకోవడానికి ఒక సర్వేక్షణ ను నిర్వహించడమైంది. భారతదేశం సెమికండక్టర్ అసెంబ్లి మొదలుకొని టెస్టింగ్ వరకు, ఆటోమొబైల్స్ మొదలుకొని కేపిటల్ గూడ్స్ వరకు చూస్తే అనేక రంగాల లో పెట్టుబడుల ను ఆకర్షిస్తున్నది.
ఐ స్క్వేయర్డ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కుణాల్ అగ్రవాల్ మాట్లాడుతూ, భారతదేశం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ క్రాంతి సంబంధి రంగం లో ఒక మెరుగైనటువంటి దశ గుండా పయనిస్తోందన్నారు. భారతదేశాన్ని ఒక భేదభావాలకు తావు ఉండని అటువంటి పెట్టుబడి నిలయం గా పరిగణించడం జరుగుతోంది అని ఆయన అన్నారు.
ఇదే కార్యక్రమం లో పాలుపంచుకొన్న పరిశ్రమ రంగ సభ్యులు ఇండో-పసిఫిక్ రీజన్ లో ఆర్థిక విషయాల పరం గా సహకారాన్ని ప్రోత్సహించే దిశ లో ఈ ప్రారంభిక కార్యక్రమం చెప్పుకోదగిన ముందంజ అని చెప్పవచ్చన్నారు. పరిశ్రమ లు అవి ఎదుర్కొంటున్న సవాళ్ళ ను పరిష్కరించుకోవడం కోసం మరియు వృద్ధి ని సాధించడం కోసం క్రొత్త క్రొత్త అవకాశాల ను సృష్టించడానికి కలిసికట్టు గా కృషి చేసేందుకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అని వారు నొక్కి పలికారు. క్లీన్ ఇకానమి మరియు సప్లయ్ చైన్ వ్యవస్థ ల పరంగా ఆటుపోటుల ను తట్టుకొని నిలబడగలిగే వాతావరణం యొక్క కల్పన ఎంతో కీలకం అని కూడా ఫోరమ్ స్పష్టం చేసింది.
ఐపిఇఎఫ్ మరియు క్లీన్ ఇకానమి ఇన్ వెస్టర్ ఫోరమ్ లను గురించి
ది ఇండో-పసిఫిక్ ఇకానామిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ ప్రాస్పెరిటీ (ఐపిఇఎఫ్ ) ను 2022 మే మాసం లో ప్రారంభించడమైంది. ప్రస్తుతం దీనిలో 14 దేశాల కు భాగస్వామ్యం ఉంది. ఆయా దేశాల లో ఆస్ట్రేలియా, బ్రునేయి దారుస్సలామ్, ఫిజీ, భారతదేశం, ఇండొనేశియా, జాపాన్, కొరియా గణతంత్రం, మలేశియా, న్యూజీలేండ్, ఫిలీపీన్స్, సింగపూర్, థాయీలాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు వియత్‌నామ్ లు ఉన్నాయి. ఐపిఇఎఫ్ లో సహకారం తాలూకు నాలుగు మూల స్తంభాలు ఉన్నాయి. అవి ఏవేవి అంటే వాటి లో వ్యాపారం, సప్లయ్ చైన్, క్లీన్ ఇకానమి మరియు ఫేర్ ఇకానమి లు. ఐపిఇఎఫ్ ఈ ప్రాంతం లోని దేశాల కు ఆటుపోటుల ను తట్టుకొని నిలబడగలిగేటటువంటి, స్థిరత్వం తో కూడినటువంటి మరియు సమ్మిళిత ఆర్థిక వృద్ధి ని ముందుకు తీసుకు పోయేటటువంటి సహకారాన్ని అందించడం కోసమంటూ ఒక వేదిక ను సమకూర్చుతోంది. దీని ఉద్దేశ్యమల్లా ఈ ప్రాంతం లో సహకారం, స్థిరత్వం మరియు సమృద్ధి లకు తోడ్పాటు ను ఇవ్వాలనేదే.
ఐపిఇఎఫ్ యొక్క కార్యక్రమాల లో ఒకటి గా ఉన్నటువంటి ఐపిఇఎఫ్ క్లీన్ ఇకానమి ఇన్ వెస్టర్ ఫోరమ్ దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల కల్పన, జలవాయు సాంకేతిక పరిజ్ఞానం మరియు నవీకరణ యోగ్య శక్తి సంబంధి ప్రాజెక్టుల కై పెట్టుబడి ని సమీకరించడం కోసం ఈ ప్రాంతం లోని అగ్రగామి ఇన్ వెస్టర్ లను, పరోపకారి సంస్థలకు , ఆర్థిక సహాయ సంస్థలకు, వినూత్న వ్యాపార సంస్థలకు, స్టార్ట్-అప్స్ కు మరియు నవ పారిశ్రమిక వేత్తల కు ఒక వేదిక ను సమకూర్చింది.
**
(Release ID: 2023522)
Visitor Counter : 138