అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

సంక్లిష్టమైనటువంటిబ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కై అత్యాధునిక ఇంట్రాఆపరేటివ్ ఇమేజింగ్ ఉపకరణాన్ని సమకూర్చుకొన్నటాటా మెమోరియల్ సెంటర్ లోని నాడీ శస్త్ర చికిత్స విభాగం; ఈ ఉపకరణం దేశం లోనే ఈ తరహాకు చెందినటువంటి ఒకటో ఉపకరణం

Posted On: 04 JUN 2024 3:25PM by PIB Hyderabad

సంక్లిష్టమైనటువంటి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ల నిర్వహణ కు గాను ముంబయి లోని టాటా మెమోరియల్ సెంటర్ (టిఎమ్‌సి) యొక్క నాడీ శస్త్రచికిత్స ల విభాగం ఇటీవలె ఒక అత్యాధునిక ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్ (ఐయుఎస్) యంత్రాన్ని కొనుగోలు చేసింది. డాక్టర్ శ్రీ అలీ అస్‌గర్ మొయియాదీ నాయకత్వం లో టాటా మెమోరియల్ సెంటర్ లోని న్యూరో సర్జరీ బృందం భారతదేశం లో ఐయుఎస్ ను ఉపయోగించడాన్ని మొదలుపెట్టింది. ఈ బృందం ప్రపంచ వ్యాప్తం గా అగ్రగామి బృందాల లో ఒకటి గా ఉంది. ఐయుఎస్ అనేది తక్కువ ఖర్చు లో లభించేదే కాక తగిన శిక్షణ యొక్క అండ తో, న్యూరో సర్జన్ యొక్క చికిత్స ఉపకరణాల లో ఒక ముఖ్యమైన సహాయక పరికరం గా నిలువ గలదు. ఈ విభాగం ఇటీవలే సమకూర్చుకొన్నటువంటి బికెయాక్టివ్ (bKActiv) యంత్రం దేశం లో ఈ తరహా అత్యాధునిక ఐయుఎస్ వ్యవస్థ లో ఒకటో యంత్రం అని చెప్పాలి.

 

 

ఇంట్రాఆపరేటివ్ ఇమేజింగ్ ద్వారా మెదడు లో గడ్డ/కణితి/వాపు ను సురక్షితం గాను మరియు కచ్చితత్వం తోను తొలగించడం సాధ్యపడుతుంది. అపసవ్యత చెంతకు సరి అయినటువంటి మార్గం లో చేరుకోవడం లో సాయపడే సాధనాల (ఇవి ఒక విధం గా శస్త్ర చికిత్స ల విషయం లో జిపిఎస్ వ్యవస్థ ను పోలి ఉంటాయి) తో కూడిన ఐయుఎస్ యంత్రం న్యూరో సర్జన్ లు ట్యూమర్ యొక్క అవశేషాల ను నిశితం గా పరిశీలించేందుకు వీలు ను కల్పిస్తుంది. అంతకు మించి, దీనిని జాగృతావస్థ లో శస్త్ర చికిత్స వంటి బ్రెయిన్ మేపింగ్ టెక్ నిక్ లను జతపరచడం జరిగిందా అంటే, అప్పుడు అది మెదడు లోని అత్యంత కీలకమైన క్షేత్రాల దగ్గర కూడాను, ట్యూమర్ ను మౌలికంగా తొలగించేందుకు సహకరించగలుగుతాయి.

 

 

ఈ వ్యవస్థ ను ముంబయి లోని పరేల్ లో గల టాటా మెమోరియల్ హాస్పిటల్ లో ఆ ఆసుపత్రి యొక్క డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీ శైలేశ్ శ్రీఖండే, టాటా మెమోరియల్ సెంటర్ యొక్క న్యూరో సర్జరీ ప్రధానాధికారి డాక్టర్ శ్రీ అలీ అస్‌గర్ మొయియాదీ, విప్రో జిఇ హెల్థ్ కేయర్ సౌథ్ ఏశియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చైతన్య సారావటె ల సమక్షం లో 2024 జూన్ 1 వ తేదీ శనివారం నాడు ఆవిష్కరించడమైంది. ఈ సందర్భం లో సదరు విభాగం ఉద్యోగుల తో పాటు ఆపరేశన్ థియేటర్ సిబ్బంది కూడా పాలుపంచుకొన్నారు.

 

 

ఈ ఆధునిక సాధనం తో తన బృందం లోని వైద్యుల కు ఉపయోగకరం గా ఉండడం తో పాటుగా దీనివల్ల ఈ కేంద్రాని కి పెద్ద సంఖ్య లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్ రోగుల కు కూడాను ఉపయుక్తం గా ఉంటుంది అని డాక్టర్ శ్రీ మొయియాదీ భావిసిస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్ రోగ్రస్తుల లో చాలా మంది వేరే చోటుల లో సబ్సిడీ రేటుల కు అత్యంత అధునాతనమైన సంరక్షణ ను పొందడం లో విఫలం అవుతున్నారు. ఇంట్రాఆపరేటివ్ ఎమ్ఆర్ఐ మాదిగానే ఇతర ఇంట్రాఆపరేటివ్ ఇమేజింగ్ సిస్టమ్స్ తో పోల్చితే ఐయుఎస్ కు తక్కువ ఖర్చు అవుతుంది. టాటా మెమోరియల్ సెంటర్ వంటి పరిమిత నిధుల సమస్య తో సతమతం అవుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల కు ఇతోధిక లాభకరం గా ఐయుఎస్ ఉంది. ఐయుఎస్ మార్గదర్శకత్వం లో శస్త్ర చికిత్స ను కోరుకొన్న స్థాయి లో నిర్వహించడానికి అవసరపడే నైపుణ్యాల ను అలవరచేందుకు న్యూరో సర్జన్ లకు శిక్షణ ఇచ్చే ప్రయాసల కు కూడా ఈ విభాగం చొరవ తీసుకొంటున్నది. భారతదేశం లో పెద్ద సంఖ్య లో రోగుల కు ప్రయోజనాల ను అందించడం కోసం ఈ సాంకేతికత ను మరింత మంది న్యూరో సర్జన్ లు అవలంబించేటందుకు భారతదేశం లో మరియు ప్రపంచ దేశాల లో శిక్షణ కోర్సుల ను నిర్వహించే ఏర్పాటు చేయడమైంది. యుబిఎస్ యొక్క ఉదారమైన గ్రాంటు సాయం తో ఈ ఉపకరణాన్ని కొనుగోలు చేయడమైంది అని డాక్టర్ శ్రీ ఎ. మోయీయాదీ తెలియజేశారు. యుబిఎస్ అందించిన సహాయానికి గాను టిఎమ్ సి ధన్యవాదాల ను తెలియజేస్తోంది అని ఆయన అన్నారు. భారతీయులు అందరికీ ఆధునిక కేన్సర్ సంరక్షణ ను అందించే దిశ లో టిఎమ్ సి చేస్తున్న కృషి కి ఈ విధమైన తోడ్పాటు వెన్నుదన్ను గా నిలుస్తుంది అని ఆయన అన్నారు.

 

 

ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్న శ్రీ సారావటె మాట్లాడుతూ, ‘‘మేం శరీర నిర్మాణ విజ్ఞానాన్ని మరియు గాయాల ను తేరిపార చూడగలగడం లో తోడ్పాటు ను అందించేటటువంటి, జోక్యానికి మార్గదర్శనం చేసేటటువంటి మరియు మానవ శరీరం లోపల నేవిగేట్ చేయడం లో తోడ్పడే క్రియాశీల ఇమేజింగ్ వ్యవస్థల ను రూపొందించడానికి కంకణం కట్టుకొన్నాం. మరి ఈ బికెయాక్టివ్ సిస్టమ్ సహకారం భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ సంబంధి సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకు పోవడం లో ఒక ప్రముఖమైన కార్యసాధన గా మిగలడం ఒక్కటే కాకుండా న్యూరోసర్జరీ లో విప్లవాత్మకమైన మార్పు ను తీసుకు రావడం కోసం సిద్ధంగా ఉంది అన్నారు.

 

***


(Release ID: 2022995) Visitor Counter : 166