సహకార మంత్రిత్వ శాఖ
ప్రపంచం లోకెల్లా అతిపెద్ద ధాన్య నిలవ ప్రణాళిక కై ఏర్పాటైన జాతీయ స్థాయి సమన్వయ సంఘ సమావేశందిల్లీ లో మొట్ట మొదటిసారి గా సమావేశమైంది
ఒక మహత్వాకాంక్షయుక్త ప్రణాళిక ద్వారా పిఎసిఎస్ లనుబహుళ సేవా సంఘాలు గా మార్చడం పై శ్రద్ధ
ఈ ప్రయోగాత్మక పథకాన్ని యుపి, ఎమ్‌పి, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళ నాడు, కర్నాటక, అసమ్, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు తెలంగాణ రాష్ట్రాలుఅమలు పరచాయి
Posted On:
03 JUN 2024 5:30PM by PIB Hyderabad
ప్రపంచం లో కెల్లా అతిపెద్దది అయినటువంటి ధాన్య నిలవ ప్రణాళిక కై ఏర్పాటైన జాతీయ స్థాయి సమన్వయ సంఘం (ఎన్ఎల్ సిసి) సోమవారం నాడు న్యూ ఢిల్లీ లోని సహకార మంత్రిత్వ శాఖ కార్యాలయం లో తన ఒకటో సమావేశాన్ని నిర్వహించింది.
సహకార మంత్రిత్వ శాఖ యొక్క కార్యదర్శి డాక్టర్ శ్రీ ఆశీష్ కుమార్ భూటానీ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం ల కార్యదర్శి తోను, ఆహారం మరియు సార్వజనిక వితరణ శాఖ కార్యదర్శి తోను, ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కార్యదర్శి తోను, ఎన్ సిడిసి యొక్క ఎమ్‌డి తోను కలసి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ), వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి విషయాల జాతీయ బ్యాంకు (ఎన్ఎబిఎఆర్‌డి), డబ్ల్యుడిఆర్ఎ మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ తో ఒకటో సమావేశాన్ని నిర్వహించారు.
కమిటీ 11 రాష్ట్రాల లో క్రిందటి సంవత్సరం లో ప్రారంభించిన ప్రయోగాత్మకమైన పథకం యొక్క అమలు ఏ దశ లో ఉన్నదీ సమీక్షించింది. ఈ ప్రణాళిక లో భారత ప్రభుత్వం యొక్క ఎగ్రీకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎఐఎఫ్), ఎగ్రీకల్చరల్ మార్కెటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ (ఎఎమ్ఐ), సబ్ మిశన్ ఆన్ ఎగ్రీకల్చరల్ మెకనైజేశన్ (ఎస్ఎమ్ఎఎమ్) ప్రధాన మంత్రి ఫార్మలైజేశన్ ఆఫ్ మైక్రో ఫూడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ (పిఎమ్ఎఫ్ఎమ్ఇ) ల వంటి మాధ్యం ద్వారా పిఎసిఎస్ స్థాయి లో వేరు వేరు వ్యవసాయ సంబంధి మౌలిక సదుపాయాల ను నిర్మించే పథకం ఒకటి ఉన్నది. దీనిలో గిడ్డంగులు, కస్టమ్ హైరింగ్ సెంటర్, ప్రాసెసింగ్ యూనిట్టు లు, చౌక ధర దుకాణాలు మొదలైనవి భాగం గా ఉన్నాయి.
ఈ సందర్భం లో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీ భూటానీ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వం మొదలుపెడుతున్నటువంటి అన్నింటి కంటే మహత్వాకాంక్షయుక్త ప్రాజెక్టుల లో ఒకటి అని పేర్కొన్నారు. దీనిలో దేశం అంతటా ఈ పథకాన్ని అమలు చేయడం కోసం స్థఆనీయ స్థాయిల లో గిడ్డంగుల ను నిర్మించడం జరుగుతుంది.
ప్రయోగాత్మక పథకాన్ని నేశనల్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేశన్ (ఎన్ సిడిసి) ద్వారా నాబార్డ్ (ఎన్ఎబిఎఆర్‌డి), ఎఫ్‌సిఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ (సిడబ్ల్యుసి), నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఎన్ఎబిసిఒఎన్ఎస్) ల సమర్థన తో సంబంధి రాష్ట్రాల/ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క సమన్వయం తో అమలు చేయడమైంది. దీనికి అదనం గా, ఈ పైలెట్ ను రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ సిసిఎఫ్, నేశనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్శన్ కోఆపరేశన్ (ఎన్‌బిసిసి) వంటి వాటి యొక్క సహకారం తో 500 అదనపు పిఎసిఎస్ లలో ప్రయోగాత్మక పథకాన్ని విస్తరింప చేయడం జరుగుతున్నది.
రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, నేశనల్ కోఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేశన్ (ఎన్‌సిసిఎఫ్) మరియు నేశనల్ ఎగ్రీకల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎఎఫ్ఇడి) వంటి జాతీయ స్థాయి సహకార సంఘాలు ఈ ప్రాజెక్టు లో భాగం గా నిలవ సామర్థ్యంతో పాటు ఇతర వ్యవసాయ ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన కు గాను మరిన్ని పిఎసిఎస్ లను గుర్తించడమైంది.
ఈ ప్రణాళిక ను వేరు వేరు స్టేక్ హోల్డర్స్ తో గోదాముల ను జోడించడం వంటి సంభావ్య ఐచ్ఛికం ఒక ఉపాయం గా దేశవ్యాప్తం గా ఏ విధం గా ముందుకు తీసుకు పోవాలి అనే అంశాన్ని కూడా కమిటీ సభ్యులు చర్చించారు.
***
(Release ID: 2022991)
Visitor Counter : 109