ఉప రాష్ట్రపతి సచివాలయం
ఎల్లప్పుడూ పక్షపాతభరిత దృష్టికోణాని కి అతీతం గా ఉండండిఅంటూ ప్రభుత్వ ఉద్యోగుల కు సూచించిన ఉప రాష్ట్రపతి
రాజకీయ వ్యవస్థ ల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు దయ చూపకూడదుఅని స్పష్టం చేసిన ఉప రాష్ట్రపతి
ప్రభుత్వ ఉద్యోగులు మార్పు ను తెచ్చేటటువంటి వారు, పాలన లో వారు ఒక కీలక భాగం అని పేర్కొన్న ఉప రాష్ట్రపతి
మన సివిల్ సర్వీసు ఇదివరకటి కంటే ఎక్కువ ప్రాతినిధ్యస్వభావాన్ని కలిగి ఉంది అని నొక్కి చెప్పిన ఉప రాష్ట్రపతి
మీరు సదా దేశ హితాన్ని మరియు చట్ట పాలన ను మీ కొలమానంగా ఎంచాలి: ఉప రాష్ట్రపతి
జాతీయవాది మరియు సమాఖ్య ప్రధానమైన విధానాన్ని అవలంబించాలిఅంటూ అధికారి శిక్షణార్థుల కు పిలుపు ను ఇచ్చిన ఉప రాష్ట్రపతి
ఐఎఎస్ 2022 బ్యాచ్ కు చెందిన సహాయక కార్యదర్శుల ను ఉద్దేశించి ప్రసంగించిన ఉప రాష్ట్రపతి
Posted On:
03 JUN 2024 6:59PM by PIB Hyderabad
ప్రభుత్వ ఉద్యోగులు ఎల్లప్పుడూ పక్షపాతభరిత దృష్టికోణాని కి అతీతం గా ఆలోచించాలి అని ఉప రాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఈ రోజు న నొక్కి పలికారు. ఉప రాష్ట్రపతి ఈ రోజు న ఐఎఎస్ 2022 బ్యాచ్ లోని సహాయక కార్యదర్శుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ వ్యవస్థ ల పట్ల దయ చూపే వారు కాకూడదు అన్నారు.
ఫలితాల ను అందజేయడం లో భారతీయ ఉద్యోగి గణాని కి ఉన్నటువంటి శక్తి యుక్తుల ను ఉప రాష్ట్రపతి అంగీకరిస్తూ, సభ కు హాజరు అయినటువంటి అధికారులు జాతీయవాది మరియు సమాఖ్యవాది దృష్టికోణాన్ని అవలంబించాలి అని, మరి దేశ హితాన్నే సర్వోపరి గా ఎల్లవేళ ల ఎంచుతూ, చట్టం యొక్క పాలన ను పరిరక్షించాలి అని పిలుపు ను ఇచ్చారు.
యుతత కు యువ సహాయక కార్యదర్శులు ఒక ప్రేరణ గాను, స్ఫూర్తి శక్తి గాను ఉంటారు అని శ్రీ ధన్‌ఖడ్ పేర్కొంటూ, ప్రభుత్వ ఉద్యోగులు అత్యున్నత నైతిక సూత్రాల ను సమున్నతం గా నిలపాలి అని కోరారు. ‘‘మీరు మార్పున కు వాహకులు గా ఉన్నారు. మీరు నాణ్యమైన పాలన లో కీలక భాగస్వాములు; అంతేకాకుండా, త్వరిత గతి న సాధించవలసిన వృద్ధి కి దారి ని చూపే వారు కూడాను’’ అని ఆయన అన్నారు.
సివిల్ సర్వీసు ఇదివరకటి కంటే అధిక ప్రాతినిధ్యం కలిగింది గా ఉంది అని శ్రీ ధన్ ఖడ్ స్పష్టం చేశారు. దీనితో సమాజం లోని అన్ని వర్గాల, విశేషించి బలహీనులు, నిరాదరణ కు లోనైన వారు మరియు సకల సౌకర్యాల కు దూరం గా ఉండిపోయినటువంటి వారి కి సైతం ప్రాతినిధ్యం లభించింది అని ఆయన అన్నారు.
భారతదేశం యొక్క చెప్పుకోదగిన ఆర్థిక పరివర్తన కు లోనైందని శ్రీ ధన్‌ఖడ్ పేర్కొంటూ, ప్రస్తుతం భారతదేశం ఆశ తో, అవకాశాల తో తొణికిసలాడుతోంది, పెట్టుబడి కి అత్యంత అభిమానపాత్రమైనటువంటి గమ్యస్థానం గా ఉంది’’ అన్నారు. ‘‘యువత కోసం విభిన్నమైనటువంటి అవకాశాలు రోజు రోజు కు పెరుగుతూ పోతున్నాయి’’ అని కూడా ఆయన అన్నారు.
భారతదేశం లో డిజిటల్ రెవలూశన్ చోటు చేసుకోవడాన్ని శ్రీ ధన్‌ఖడ్ ప్రశంసిస్తూ, ‘‘మన కార్యసాధన లు ప్రపంచాన్ని విస్మయచకితం చేసి వేశాయి. ప్రపంచ సంస్థలు ఏవయితే మనకు వాటి యొక్క సలహాల ను ఇస్తూ వచ్చాయో, అవి ఇప్పుడు భారతదేశం నడచిన దారి లో నడవాలంటూ ఇతర దేశాల కు సూచనలు చేస్తున్నాయి’’ అన్నారు.
కార్యక్రమాని కి హాజరైన అధికారుల తో ఉప రాష్ట్రపతి ‘‘వారు నేర్చుకోవడాన్ని ఎన్నటికీ ఆపివేయకూడదు, వారు వారి నైపుణ్యాల ను ఎప్పటికప్పుడు పెంచుకొంటూ ఉండాలి’’ అని చెప్పారు. ‘‘మిమ్మల్ని మార్పు ను తీసుకు రావడం కోసం రాజ్యాంగం ద్వారా నియామకం జరపడమైంది’’ అని ఆయన అన్నారు.
దేశం లో అధికారపు నడవాల లో ఇదివరకు అవినీతి వ్యాపించిన కాలం అంటూ ఒకటి ఉండింది, అప్పట్లో ప్రతిభ ఆధారిత అవకాశాల కు అవరోధం ఏర్పడింది అని శ్రీ ధన్‌ఖడ్ అన్నారు. ‘‘నవ యుగం లో అధికారపు కారిడోర్ లలో భ్రష్టాచారాని కి తావు లేకుండా చేయడం తో పాటు గా పారదర్శకత్వాని కి మరియు జవాబుదారు తనానికి చోటు ను కల్పించడమైంది’’ అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు.
ఈ కార్యక్రమం లో డిఒపిటి కార్యదర్శి శ్రీమతి ఎస్. రాధ చౌహాన్; రాజ్య సభ కార్యదర్శి శ్రీ రజిత్ పున్హానీ; డిఒపిటి సంయుక్త కార్యదర్శి శ్రీమతి నీల మోహనన్; ఉప రాష్ట్రపతి యొక్క సచివాలయం లోని అధికారులు, అధికారి శిక్షణార్థులు మరియు ఇతర ప్రముఖులు కూడ పాలుపంచుకొన్నారు.
***
(Release ID: 2022746)
Visitor Counter : 133