విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఎస్‌జెవిఎన్ యొక్క డైరెక్టర్ (పర్సనల్) గా శ్రీ అజయ్ కుమార్ శర్మ ను సిఫారసు చేసిన పిఇఎస్‌బి

Posted On: 27 MAY 2024 8:05PM by PIB Hyderabad

విద్యుత్తు మంత్రిత్వ శాఖ లో భాగం గా ఉన్నటువంటి అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌జెవిఎన్ యొక్క డైరెక్టర్ (పర్సనెల్) పదవి కి గాను శ్రీ అజయ్ కుమార్ శర్మ ను పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్శన్ బోర్డ్ (పిఇఎస్‌బి) సిఫారసు చేసింది. 2024 మే 24 వ తేదీ న జరిగిన ఇంటర్ వ్యూ తాలూకు జటిల ప్రక్రియ అనంతరం ఆయన ను ఎంపిక చేయడమైంది. ఆ ఇంటర్ వ్యూ లో ఆయన పదకొండు మంది పోటీదారుల మధ్య అగ్ర స్థానాన్ని సంపాదించుకొన్నారు. శ్రీ శర్మ ప్రస్తుతం ఎస్‌జెవిఎన్ యొక్క కార్పొరేట్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ లో జనరల్ మేనేజర్ గా ఉన్నారు.

 

 

 

 

 

శ్రీ అజయ్ కుమార్ శర్మ 2009 అక్టోబరు లో ఎస్‌జెవిఎన్ లో చేరి, అప్పటి నుండి శిమ్‌లా లో కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ లో మానవ వనరుల విభాగం లో సేవల ను అందిస్తున్నారు. ఆయన తోడ్పాటు పర్సనెల్ ప్లానింగ్, పాలన, పారిశ్రమిక సంబంధాలు & సంక్షేమం, హెచ్ఆర్ పాలిసీ, శిక్షణ & మానవ వనరుల అభివృద్ధి, ఇంకా హెచ్ఆర్ ప్రొక్యూర్‌మెంట్ లు సహా మానవ వనరుల కు చెందిన వివిధ రంగాల వరకు విస్తరించింది. దీనికి అదనం గా, ఆయన ఎస్‌జెవిఎన్ యొక్క డైరెక్టర్ (పర్సనెల్) కు మరియు చైర్ పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ కు సహాయకుని బాధ్యతల ను కూడ నిర్వర్తించారు. ఎస్‌జెవిఎన్ లో చేరడానికి కంటే ముందు, ఆయన 1996 నుండి 2009 వరకు స్టీల్ అథారటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పని చేశారు.

 

 

శ్రీ అజయ్ కుమార్ శర్మ 1974 ఏప్రిల్ 8 న జన్మించారు. ఆయన చంబా జిల్లా సిహుంతా సబ్ డివిజన్ లోని ఖర్‌గట్ గ్రామానికి చెందిన వారు. ఆయన కోయంబత్తూరు లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడు అయ్యారు. శ్రీ శర్మ ఐజిఎన్ఒయు నుండి మానవ వనరుల అంశం లో ఎమ్‌బిఎ చదివారు. అంతేకాకుండా, ఎక్స్ఎల్ఆర్ఐ జమ్‌ శెద్‌పుర్ నుండి హెచ్ఆర్ఎమ్ లో ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు.

 

 

 

***

 



(Release ID: 2021965) Visitor Counter : 43