రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సైన్య దళంప్రధానాధికారి జనరల్ శ్రీ మనోజ్ పాండే పదవీ కాలాన్ని 2024 జూన్ 30 వ తేదీ వరకు ఒకనెల రోజులు పాటు పొడిగించేటందుకు ఆమోదాన్ని తెలిపిన మంత్రి మండలి లోని నియామకాలసంఘం 

Posted On: 26 MAY 2024 5:31PM by PIB Hyderabad

చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ (సిఒఎఎస్) జనరల్ శ్రీ మనోజ్ సి.పాండే, పివిఎస్ఎమ్, ఎవిఎస్ఎమ్, విఎస్ఎమ్, ఎడిసి యొక్క పదవీ కాలాన్ని సైన్య నియమావళి 1954 లో రూల్ 16 ఎ (4) లో భాగం గా సాధారణ పదవీ విరమణ వయస్సు (2024 మే 31 వ తేదీ) కంటె అధికం గా మరొక నెల రోజుల పాటు అంటే 2024 జూన్ 30 వ తేదీ వరకు పొడిగించేందుకు మంత్రివర్గ నియామకాల సంఘం 2024 మే 26 వ తేదీ న ఆమోదాన్ని తెలియజేసింది. ఆయన ను 1982 వ సంవత్సరం డిసెంబరు లో ది కోర్ ఆఫ్ ఇంజినీర్స్ (ద బాంబే సైపర్స్) లోకి చేర్చుకోవడమైంది. సిఒఎఎస్ గా పదవీ బాధ్యతల ను సంబాళించడానికి పూర్వం ఆయన ను సైనిక దళాల ఉప ప్రధానాధికారి పదవి లో నియమించడం జరిగింది.

 

 

 

***



(Release ID: 2021818) Visitor Counter : 56