రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దేశ రక్షణ యొక్క బలం ఆ దేశం తాలూకు సైన్య పరాక్రమం లో మాత్రమే కాక ఆ దేశం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ఒక శక్తి వనరు గా ఉపయోగించుకొనే సామర్థ్యం లో సైతం ఇమిడిపోయి ఉంటుంది: రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్

Posted On: 21 MAY 2024 1:30PM by PIB Hyderabad

ప్రాజెక్టు ఉద్భవ్లో భాగంగా హిస్టారికల్ పేటర్న్‌ స్ ఆఫ్ ఇండియన్ స్ట్రటిజిక్ కల్చర్ అనే అంశం పై ఒక చర్చాసభ ను మరియు ప్రదర్శన ను 2024 మే 21 వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని నేశనల్ మ్యూజియమ్ లో నిర్వహించడమైంది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ వ్యవహరించారు. ఇదే కార్యక్రమం లో ఇవల్యూశన్ ఆఫ్ ఇండియన్ మిలిటరీ సిస్టమ్స్, వార్‌ఫైటింగ్ ఎండ్ స్ట్రటిజిక్ థాట్స్, ఫ్రమ్ యాంటిక్విటీ టు ఇండిపెండెన్స్ అనే అంశం పై ఒక ప్రదర్శన ను కూడా ప్రారంభించడమైంది. దీనికి అదనం గా, ఉద్భవ్ కంపెండియమ్మరియు ఆల్హా ఉదల్ - బైలడ్ రెండిశన్ ఆఫ్ వెస్టర్న్ ఉత్తర్ ప్రదేశ్ అనే ఒక పుస్తకావిష్కరణ ను కూడా చేపట్టడమైంది.

 

రక్షణ శాఖ సహాయ మంత్రి తన ప్రసంగం లో ప్రాజెక్టు ఉద్భవ్కార్యక్రమాని కి గాను భారతీయ సైన్యాన్ని మరియు యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూశన్ ఆఫ్ ఇండియా (యుఎస్ఐ) ని ప్రశంసించారు. దేశం లో పురాతన గ్రంథాలు మరియు మౌఖిక సాంప్రదాయాల ను అన్వేషించి, దేశ వ్యూహాత్మక సంస్కృతి తాలూకు అమూల్యమైన భావనల ను ఆవిష్కరించాలి అనేదే ప్రాజెక్ట్ ఉద్భవ్యొక్క ఉద్దేశ్యం గా ఉంది. ‘‘భౌగోళిక రాజకీయ ముఖచిత్రం ఎప్పటికప్పుడు మార్పుల కు లోనవుతోంది, మరి మన సాయుధ బలగాల కు వాటి దృష్టికోణం లో అనుకూలత ను మరియు నూతన ఆవిష్కారాల కు తావు ఇచ్చే వైఖరి తప్పనిసరి అవుతున్నది. మన ప్రాచీన గ్రంథాలు మరియు సంప్రదాయాల ను పరిశీలించి, తద్ద్వారా ఉద్భవ్ వంటి ప్రాజెక్టు లు ఒక్క వ్యూహాత్మక సంస్కృతి పట్ల మన అవగాహన ను సమృద్ధం చేయడం ఒక్కటే కాకుండా సాంప్రదాయేతరమైన యుద్ధ తంత్రాల ను గురించినటువంటి, దౌత్యపరమైనటువంటి ఆలోచనలలో విలువైన భావనల ను కూడా అందిస్తాయి’’ అని ఆయన అన్నారు.

 

ముందు ఉన్న మార్గాన్ని గురించి శ్రీ అజయ్ భట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, దేశం యొక్క రక్షణ శక్తి ఏపాటిది అనేది గుర్తించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసి ఉంది అన్నారు. ఆ శక్తి కేవలం దాని సైన్య పరాక్రమంలో మాత్రమే కాకుండా మారుతున్న పరిస్థితుల కు తగ్గట్టుగా మారే సామర్థ్యం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ఒక శక్తి వనరు గా వినియోగించుకొనగలిగిన సైన్య సామర్థ్యం లో సైతం ఇమిడిపోయి ఉంటుంది అన్నారు. ప్రాజెక్టు ఉద్భవ్వంటి కార్యక్రమాలు భారతదేశం ఆత్మనిర్భరం గా ఉండి, తన సాంస్కృతిక వారసత్వం లో గాఢం గా ఇమిడిపోయేటటువంటి భవిష్యత్తు కాలానికి దారి ని చూపే దీపం వంటివి కూడా అని ఆయన అభివర్ణించారు.

 

ఆత్మనిర్భర్ భారత్ భావన ఒక్క భారతీయ వస్తువుల ఉత్పాదన మరియు వాటి వినియోగాలకే పరిమితం కాదు, అది వర్తమాన కార్యాలు మరియు నిర్ణయాల లో భారతదేశ ఆలోచన విధానం మరియు విలువ ల సారాన్ని చొప్పించడానికి చిత్తశుద్ధి తో కూడినటువంటి ప్రయాసలు కూడా అని ఆయన పేర్కొన్నారు. ప్రాచీన కాలం యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని దేశం సమగ్రం గా అర్థం చేసుకోవడం, దానిని ఆధునిక కాలం లోని మహత్వాకాంక్షలు మరియు విధానాల ను రూపొందించడం లో సందర్భానుసారం వర్తింప చేయడం వల్లనే వికసిత్ భారత్ యొక్క లక్ష్యాన్ని సాధించవచ్చును అని ఆయన అన్నారు.

 

ప్రాజెక్టు ఉద్భవ్బౌద్ధిక స్థాయి లో పౌర మరియు సైనిక సహకారాన్ని బలపరచి విద్య రంగ ప్రముఖుల ను, పరిశోధక విద్యార్థుల ను, మరియు సైన్య నిపుణుల ను ఒక ఉమ్మడి వేదిక వద్దకు తీసుకు వచ్చి యావత్తు దేశం అనే ఒక దృష్టికోణాన్ని పటిష్టపరచింది అని శ్రీ అజయ్ భట్ ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు యొక్క పరిణామాలు భారతదేశ సైన్యం యొక్క వ్యూహాత్మక సామర్థ్యాల ను వృద్ధి చెందింప చేయడం ఒక్కటే కాకుండా భారతదేశం యొక్క ప్రాచీన జ్ఞానాని కి కాలాతీత ప్రాసంగికత కలదు అనే ఒక ప్రమాణాన్ని కూడా ఏర్పరుస్తాయి అని ఆయన వివరించారు.

 

సైన్య దళాల ప్రధాన అధికారి గా జనరల్ శ్రీ మనోజ్ పాండే యొక్క పదవీ కాలం ఉత్కృష్టం గా ఉంది అని కూడా మంత్రి ప్రశంసించారు. సంస్థ యొక్క మెరుగుదల కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారన్నారు.

 

ఈ కార్యక్రమం లో సైనిక దళాల ప్రధాన అధికారి మాట్లాడుతూ, ‘ప్రాజెక్ట్ ఉద్భవ్ప్రముఖ భారతీయ విద్వాంసులు మరియు పశ్చిమ దేశాల విద్వాంసుల మధ్య తగినంత బౌద్ధిక సమావేశం గురించి వెల్లడి చేయడం తో పాటు వారి ఆలోచనలు, వారి దర్శనం మరియు దృష్టికోణం ల మధ్య ప్రతిధ్వని ని చాటుతున్నది అని కూడా ఆయన అన్నారు. ఈ ప్రయాస భారతదేశం యొక్క ఆదివాసి సంప్రదాయాల ను , మరాఠా నావికాదళం యొక్క వారసత్వం మరియు సైన్య ప్రముఖుల, విశేషించి మహిళల వ్యక్తిగత వీరత్వ భరిత కార్యాల ను అన్వేషించి క్రొత్త రంగాల లోకి విస్తరించేందుకు ప్రేరణ ను అందించింది అని ఆయన అన్నారు.

 

జనరల్ శ్రీ మనోజ్ పాండే మాట్లాడుతూ, ‘‘ఈ ప్రాజెక్టు లో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మరియు అర్థ శాస్త్రం ల వంటి ప్రాచీన గ్రంథాల ను తీవ్రంగా శోధించడమైంది. ఇవి పరస్పర సంధానం, ధార్మికత్వం మరియు నైతిక విలువల తో నిండి వున్నాయి. వీటికి అదనం గా, ఇది మహాభారత మహాకావ్యం లోని యుద్ధాలు మరియు మౌర్యులు, గుప్తులు మరియు మరాఠా ల హయాముల లో అనుసరించినటువంటి వ్యూహాత్మక ప్రతిభ ను కనుగనడమైంది; ఈ వ్యూహాత్మక ప్రతిభ భారతదేశం యొక్క సమృద్ధమైనటువంటి సైన్య వారసత్వానికి రూపును రేఖ ను కల్పించింది’’ అన్నారు.

 

ప్రదర్శన

ఈ కార్యక్రమం సందర్భం లో ఇవల్యూశన్ ఆఫ్ ఇండియన్ మిలిటరీ సిస్టమ్స్, వార్‌ఫైటింగ్ ఎండ్ స్ట్రటిజిక్ థాట్స్, ఫ్రమ్ యాంటిక్విటీ టు ఇండిపెండెన్స్ఏర్పాటు చేసిన ప్రదర్శన లో భారతదేశం లో సైన్య వ్యవస్థల యొక్క పరిణామ క్రమానికి అద్దం పట్టడం తో పాటుగా దేశం యొక్క సైనిక సంస్కృతి పై దార్శనిక ఆధారాలను స్పష్టమైన విధం గా వివరించడమైంది. ఈ ప్రదర్శన లో కళాఖండాల ను, చేతివ్రాత ప్రతుల ను, నేశనల్ మ్యూజియమ్ యొక్క కళాకృతులు, ప్రింటులు, వ్రాతప్రతులు మరియు లఘు చిత్రాల ను ఉపయోగించడమైంది. ఈ ప్రదర్శన అందరూ చూసేందుకు గాను పది రోజుల పాటు తెరచి ఉంటుంది.

 

సార సంగ్రహం

ఉద్భవ్ కంపెడియమ్ (2023-2024) ను విశేషించి సైన్య వ్యవహారాల కోసం మరియు సామాన్య రీతి న శాసన కళ కై భారతదేశం లోని ప్రాచీన జ్ఞానం మరియు భావి విద్య కోసం ఒక రికార్డు ను సిద్ధం చేయడానికని రూపొందించడమైంది. దీనిలో ఆరు అధ్యాయాలు ఉన్నాయి. వాటి లో ప్రాజెక్టు ఉద్భవ్ లో భాగం గా నిర్వహించే కార్యకలాపాలు మరియు కార్యక్రమాల తాలూకు ముఖ్య అంశాల రూపం లో చేర్చడమైంది. ఇవి తరువాతి అధ్యయనాల కు ఆధారాన్ని ప్రదానం చేయడం కోసం భవిష్యత్తు లో పరిశోధన మరియు చర్చోప చర్చల ను చేపట్టడానికి ఒక ముందస్తు మార్గాన్ని కూడా చూపుతాయి.

 

బృంద చర్చ

 

స్టేట్ ఎండ్ వార్ క్రాఫ్ట్ పట్ల దేశం లోని ప్రాచీన జ్ఞాన భండారాన్ని పునర్జీవింపచేయడం మరియు దానిని పునర్ మూల్యాంకనం చేయడం కోసం న్శంట్ ఇండియన్ ట్రెడిశన్స్ ఆఫ్ మిలిటరీ ఎథిక్స్ ఎండ్ కల్చర్అంశం పై బృంద చర్చ ఆరోగ్యకరమైన రీతి న జరిగింది.

 

ప్రాజెక్టు ఉద్భవ్ను 2023 అక్టోబరు 21 వ తేదీన జరిగిన ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ సందర్భం లో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో యుఎస్ఐ యొక్క డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ శ్రీ పి.కె. గోస్వామి (రిటైర్డ్), సాయుధ దళాల లో పని చేస్తున్న సీనియర్ అధికారులు, చిరకాలానుభవం కలిగిన అధికారులు మరియు పరిశోధక విద్యార్థులు పాలుపంచుకొన్నారు.

 

***

 



(Release ID: 2021336) Visitor Counter : 67