వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
డిజిటల్ కామర్స్ ఓపెన్ నెట్వర్క్ ప్రక్రియలో స్టార్టప్స్ తమ సామర్థ్యాలను పెంచుకునే ఉద్దేశంతో కొత్త దిల్లీలోని డీపీఐఐటీ ఆధ్వర్యంలో ఓఎన్డిసి స్టార్టప్ మహోత్సవ్
12 యునికార్న్‌లు, 125కి పైగా స్టార్టప్‌లు ఓఎన్డిసిని ఆన్‌బోర్డింగ్ చేయడానికి కట్టుబడి ఉన్నాయి
ఓఎన్డిసి ఏప్రిల్ 2024లో 7.22 మిలియన్ల లావాదేవీలను సులభతరం చేసింది, 5 లక్షలకు పైగా
అమ్మకందారులను ఆన్‌బోర్డ్ చేసింది
प्रविष्टि तिथि:
17 MAY 2024 4:07PM by PIB Hyderabad
డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటీ) 2024 మే 17వ తేదీన న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో 'ఓఎన్ డిసి స్టార్టప్ మహోత్సవ్'ను నిర్వహించింది. ఈ కార్యక్రమం డిపిఐఐటీ రెండు ప్రధాన కార్యక్రమాల వేడుకలు, సహకారానికి ప్రతీక - స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డిసి).
డిపిఐఐటి కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, స్టార్టప్ వృద్ధి, ఆవిష్కరణల కోసం పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం, ప్రోత్సహించడంలో ప్రభుత్వం తిరుగులేని నిబద్ధతను స్పష్టం చేశారు. ఓఎన్డీసి ద్వారా అందుబాటులోకి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడానికి భారతదేశంలోని స్టార్టప్‌లకు ఓఎన్డీసి స్టార్టప్ మహోత్సవ్ ఒక పరివర్తనకు సూచి లాంటిదని ఆయన అన్నారు. నెట్‌వర్క్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందింది. పరిపక్వం చెందింది, నేటి సెషన్ భారతదేశంలో డిజిటల్ వాణిజ్యాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి డిపిఐఐటీ, పరిశ్రమ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటి) 2024 మే 17వ తేదీన న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో ‘ONDC స్టార్టప్ మహోత్సవ్’ను నిర్వహించింది. ఇది డీపీఐఐటి రెండు ప్రధాన కార్యక్రమాలు స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసి) వేడుకలు గాను, సహకారానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఈ ఈవెంట్‌లో హైబ్రిడ్ పధ్ధతిలో దాదాపు 5,000 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. స్టార్టప్‌లు, యునికార్న్‌లు, EaseMyTrip, OfBusiness, Winzo, Livspace, GlobalBees, Pristyn Cars, Cars24, Physics Wallah, PolicyBazaar, Zerodha వంటి అధిక వృద్ధి వ్యాపారాలతో సహా 125 మందికి పైగా పర్యావరణ వ్యవస్థ వాటాదారులు ఈ కార్యక్రమంలో సంతకం చేశారు. ఈ ఎల్ఓఐ లో ఓఎన్డీసి సామర్థ్యాన్ని, ప్లాట్‌ఫారమ్‌తో సహకరించడానికి దేశంలోని ప్రముఖ స్టార్టప్‌ల ఆసక్తిని సూచిస్తాయి.
డీపీఐఐటి జాయింట్ సెక్రటరీ శ్రీ సంజీవ్, స్టార్టప్‌లు, ఓఎన్డీసి మధ్య నిరంతర సహకారం కోసం ప్రభుత్వ దృష్టి దృష్టి కోణాన్ని వివరించారు. “ఇన్నోవేషన్, పోటీని పెంపొందించడం, వినియోగదారుల ఎంపికను మెరుగుపరచడం ద్వారా స్టార్టప్‌లు ఓన్డీసీ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. నేటి ఈవెంట్‌లో 125 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఓఎన్డీఎస్ నెట్‌వర్క్‌కు ఆన్‌బోర్డ్‌కు కట్టుబడి ఉన్నాయి, ఇది జాతీయ చొరవతో పాటు వారికున్న ఉత్సాహం, వేగాన్ని ప్రతిబింబిస్తుంది.
ఓఎన్డీసి ఎండీ, సీఈఓ శ్రీ. టి. కోశి మాట్లాడుతూ, "భారతదేశం డిజిటల్ పరివర్తన ప్రయాణంలో ఓఎన్డీసి స్టార్టప్ మహోత్సవ్ కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. మా పర్యావరణ వ్యవస్థలో సహకారం, ఆవిష్కరణలను పెంపొందించడం ద్వారా, మేము ఇ-కామర్స్‌లో నిర్వహించే పాత్రకు నియమాలను పునర్నిర్వచించటానికి స్టార్టప్‌లకు అధికారం ఇస్తున్నాము".
‘ఓఎన్డీసి స్టార్టప్ మహోత్సవ్’ అనేది ఓఎన్డీసి స్టార్టప్ ఇండియా చొరవ మధ్య ఒక ప్రత్యేకమైన సహకారం. ప్లాట్‌ఫారమ్‌లో 5 లక్షల కంటే ఎక్కువ మంది విక్రేతలు ఉన్నారు, వీరిలో 70 శాతం కంటే ఎక్కువ మంది చిన్న లేదా మధ్యస్థ విక్రయదారులు. ఏప్రిల్ 2024లో, ఓఎన్డీసి దాదాపు 7.22 మిలియన్ లావాదేవీలను సులభతరం చేసింది. దీన్ని గ్రహించేందుకు ‘ఓఎన్‌డీసీ స్టార్టప్ మహోత్సవ్’ నిర్వహించింది. స్టార్టప్‌లు, ఓఎన్డీసి మధ్య ప్రభావవంతమైన అనుబంధంతో, రెండు కార్యక్రమాల సమగ్ర అభివృద్ధికి అవకాశం ఉంటుంది.
'భారతీయ ఈ-కామర్స్ సహకార భవిష్యత్తును నిర్మించడం', 'ఓఎన్డీసి - స్టార్టప్ సక్సెస్ స్టోరీ', ' ఓఎన్డీసి ద్వారా స్టార్టప్ వృద్ధి' వంటి విషయాలపై అంతర్దృష్టితో కూడిన ప్యానెల్ చర్చలు జరిగాయి. పరస్పర సహకారం, స్టార్టప్‌లు, అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల కోసం అపారమైన అవకాశాలపై చర్చించారు. ఓఎన్డీసి నెట్‌వర్క్‌ను విస్తరించడం, స్కేల్-అప్ చేయడం కూడా వీటిలో ముఖ్యమైన చర్చనీయాంశాలయ్యాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యుడు శ్రీ అనిల్ అగర్వాల్‌తో సహా విశిష్ట వక్తలు; డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ, శ్రీ ఈ. శ్రీనివాస్; క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ శ్రీ చక్రవర్తి టి కన్నన్; ఓ ఎన్డీఎసి సలహా మండలి సభ్యుడు శ్రీమతి అంజలి బన్సాల్; సిడ్బీ డిఎండి శ్రీ సుదత్త మండల్; ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు శ్రీ రికాంత్ పిట్టీ; విన్జో సహ వ్యవస్థాపకుడు శ్రీ పవన్ నందా ఈ ఆకర్షణీయమైన చర్చలపై తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకున్నారు.
వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడం, దేశంలో బలమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 16 జనవరి 2016న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2016లో దాదాపు 300 స్టార్టప్‌ల నుండి, నేడు భారతదేశం 1.3 లక్షల కంటే ఎక్కువ డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌లతో ప్రముఖ స్టార్టప్ హబ్‌లలో ఒకటిగా ఉంది. ఇవి 55 కంటే ఎక్కువ రంగాలలో పనిచేస్తున్నాయి, డొమైన్‌ల అంతటా ఆవిష్కరణలను తీసుకువస్తున్నాయి. స్టార్టప్‌లు దేశంలో 13 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాయి.
ప్రభుత్వంమరొక గొప్ప చొరవలో భాగంగా , ఓఎన్డీసి 2021లో డిజిటల్ కామర్స్‌ను ప్రజాస్వామ్యీకరించే లక్ష్యంతో మొదటి-రకం ప్రోటోకాల్‌గా ప్రారంభించబడింది. నేడు, ఓఎన్డీసి డిజిటల్ వ్యవస్థను నెలకొల్పి భారతదేశం అంతటా పూర్తిగా పని చేస్తోంది. వ్యాపారాలు, ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.ఓఎన్డీసి డిజిటల్ వాణిజ్యానికి ప్రవేశ అడ్డంకులను తగ్గిస్తుంది. ఇ-కామర్స్ సంస్థలకు, ముఖ్యంగా చిన్న-స్థాయి వ్యాపారాలు , డిజిటల్‌గా మినహాయించబడిన వారికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ను అందిస్తుంది. స్టార్టప్‌లు పోటీ ధరలకు మంచి నాణ్యమైన ఉత్పత్తులు మరియు సేవలను అందించే చురుకైన పని సంస్కృతులతో ఆవిష్కర్తలు. దేశంలో స్వావలంబన లక్ష్యాన్ని సాధించడానికి స్టార్టప్‌లు కీలకమైన స్తంభం. మార్కెటింగ్ అనేది స్టార్టప్‌లకు ఒక సవాలుగా ఉంది. ఓఎన్డీసి ప్లాట్‌ఫారమ్ ద్వారా దీనిని పరిష్కరించవచ్చు.
కొన్నేళ్లుగా దేశంలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం అటువంటి వినూత్న చొరవ, ఇప్పుడు దేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫలవంతమైన సహకారాన్ని సాకారం చేసుకోవడానికి ఈ గొప్ప మహోత్సవం తొలి అడుగు.
***
(रिलीज़ आईडी: 2021096)
आगंतुक पटल : 135