భారత ఎన్నికల సంఘం
2024 సాధారణ ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో 69.16% ఓటింగ్ నమోదు
Posted On:
17 MAY 2024 4:08PM by PIB Hyderabad
సాధారణ ఎన్నికలు-2024లలో భాగంగా జరిగిన నాలుగో దశ పోలింగ్ కార్యక్రమంలో 69.16% ఓటింగ్ నమోదైంది. ఈ దశలో 96 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 13.05.2024 నాటి ఈసీఐ రెండు ప్రెస్ నోట్ల కొనసాగింపుగా, నాలుగో దశ పోలింగ్ సంబంధించి.. స్త్రీ, పురుషుల వారీగా ఓటర్ల సంఖ్య గణాంకాలు ఈ కిందన ఇవ్వబడ్డాయి:
పోలింగ్ దశ
|
పురషుల ఓటింగ్
|
స్త్రీల ఓటింగ్
|
థర్డ్ జెండర్ ఓటింగ్
|
మొత్తం ఓటింగ్
|
నాలుగో దశ
|
69.58%
|
68.73%
|
34.23%
|
69.16%
|
2. నాలుగో దశ పోలింగ్ కు సంబధించి రాష్ట్రాల వారీగా మరియు నియోజకవర్గాల వారీగా ఓట్లు వేసిన వారి సమాచారం వరుసగా టేబుల్ 1 మరియు 2లో ఇవ్వబడింది. ఫారమ్ 17సీ కాపీ కూడా ఒక నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ స్టేషన్ కోసం అభ్యర్థులకు వారి పోలింగ్ ఏజెంట్లకు అందించబడుతుంది. ఫారమ్ 17 C యొక్క వాస్తవ డేటా ఇప్పటికే అభ్యర్థులతో పంచుకోబడింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మరియు మొత్తం ఓట్ల లెక్కింపుతో పాటు కౌంటింగ్ తర్వాత మాత్రమే తుది పోలింగ్ వివరాలు అందుబాటులో ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లలో సర్వీస్ ఓటర్లు, గైర్హాజరైన ఓటర్లు (85+, పీడబ్ల్యుడీ, ఎసెన్షియల్ సర్వీసెస్ మొదలైనవి) మరియు ఎన్నికల విధుల్లో ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి. నిబంధనల ప్రకారం అందుకున్న అటువంటి పోస్టల్ బ్యాలెట్ల రోజువారీ ఖాతా అభ్యర్థులందరికీ ఇవ్వబడుతుంది.
3. అదనంగా, మే 20, 2024న 5వ దశ ఎన్నికలకు వెళ్లే 49 నియోజకవర్గాలకు సంబంధించి పీసీ వారీగా నమోదైన ఓటర్ల వివరాలు టేబుల్ 3లో అందించబడ్డాయి.
***
(Release ID: 2021094)
Read this release in:
Kannada
,
Malayalam
,
Odia
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil