రక్షణ మంత్రిత్వ శాఖ
28 భారీ డంప్ ట్రక్కుల కోసం నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి రూ.250 కోట్ల విలువైన ఆర్డర్ పొందిన బీఈఎంఎల్
Posted On:
17 MAY 2024 3:18PM by PIB Hyderabad
ప్రభుత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) నుంచి బీఈఎంఎల్‌కు భారీ ఆర్డర్ లభించింది. మొత్తం 28 యూనిట్ల బీహెచ్100 రియర్ డంప్ ట్రక్కుల కావాలని నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఆర్డర్ చేసింది. ఈ ఆర్డర్ మొత్తం విలువ రూ.250 కోట్లు. ఒక బీహెచ్100 రియర్ డంప్ ట్రక్కు 100 టన్నుల బరువు వరకు రవాణా చేయగలదు. అధిక పని ఒత్తిడి ఉండే గని ప్రాంతాల్లో బొగ్గును సమర్థవంతంగా రవాణా చేయడానికి ఈ ట్రక్కులను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.
ఎన్‌సీఎల్ - బీఈఎంఎల్ మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యంలో ఈ ఆర్డర్ ఒక ముఖ్యమైన మైలురాయి. భారీ స్థాయి పరికరాల కోసం రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థపై (బీఈఎంఎల్) ఆధారపడొచ్చన్న నమ్మకాన్ని ఇది పెంచుతుంది. డంప్ ట్రక్కులకు అవసరమయ్యే విడిభాగాలను ఐదేళ్ల పాటు బీఈఎంఎల్ అందించేలా ఒప్పందం కుదిరింది. దీనివల్ల, బొగ్గు రవాణాలో అంతరాయం లేని సేవలు, కార్యాచరణ సామర్థ్యం సాధ్యమవుతాయి.
బలమైన ఆకృతి, అధునిక లక్షణాలు, కార్యాచరణ సామర్థ్యంలో బీఈఎంఎల్ రూపొందించిన బీహెచ్100 రియర్ డంప్ ట్రక్‌కు మంచి పేరుంది. ఇది ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుంది. ఫలితంగా, అధిక పని చేస్తూనే ఖర్చులను ఇవి తగ్గించగలవు.
“బొగ్గు రంగానికి మా సహకారం విస్త్రతమవుతోంది. దేశంలో ఒక బిలియన్ టన్నులకు పైగా బొగ్గును వెలికితీసే లక్ష్యాన్ని సాధించడంలో బొగ్గు ఉత్పత్తి సంస్థలకు సాయం చేయడమే మా లక్ష్యం. ఈ విషయంలో, మా బీహెచ్100 రియర్ డంప్ ట్రక్‌లు ఎన్‌సీఎల్ ప్రయత్నాలకు గణనీయంగా మద్దతుగా నిలుస్తాయి" అని బీఈఎంఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శంతను రాయ్ చెప్పారు.
దేశంలోని గనుల పరిశ్రమకు బలమైన & నమ్మకమైన యంత్రాలను అందించగల బీఈఎంఎల్ నిబద్ధతను, సామర్థ్యాన్ని ఈ ఆర్డర్ ప్రతిబింబిస్తుంది. పరిశ్రమలో ప్రధాన సంస్థగా దాని స్థానం మరింత బలోపేతం అవుతుంది. ఈ సంస్థ, తన ఉత్పత్తుల్లో సాంకేతికతను అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా నిరంతరం పెంచుతోంది. నూతన ఆవిష్కరణల పట్ల బీఈఎంఎల్ ప్రదర్శిస్తున్న అంకితభావం రక్షణ రంగాన్ని బలపరచడం మాత్రమే కాదు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సామర్థ్యాన్ని & స్థిరత్వాన్ని పెంచుతుంది.
***
(Release ID: 2021093)
Visitor Counter : 60