కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్‌&డి వ్యయంపై భారతదేశంలోని టాప్ 1,000 లిస్టెడ్ కంపెనీలతో రౌండ్‌ టేబుల్ సమావేశం నిర్వహించిన ఐఐసీఏ

Posted On: 17 MAY 2024 9:30AM by PIB Hyderabad

ఈరోజు న్యూఢిల్లీలో స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఐ) ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయ మద్దతుతో భారతదేశంలోని టాప్ 1,000 లిస్టెడ్ కంపెనీల 'పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్‌&డి)వ్యయంపై  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.

ఆర్‌&డి వ్యయంపై కార్పొరేట్ అభిప్రాయాలను ఏకీకృతం చేయడంతో పాటు కంపెనీ వృద్ధికి మరియు దీర్ఘకాలంలో నిలకడగా ఉండటానికి ఆర్&డిలో పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను వివరించడం, ఆర్&డి సంబంధిత అంశాలపై అవగాహన అవసరాన్ని తెలియజేసేందుకు జరుగుతున్న పరిశోధనలో భాగంగా ఈ రౌండ్‌టేబుల్ నిర్వహించబడింది.  దేశంలోని ఆర్&డి ల్యాండ్‌స్కేప్‌పై ఐఐసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధన అధ్యయనానికి సంబంధించిన ఫలితాలపై ఇన్‌పుట్‌లను కోరడం మరియు కార్పొరేట్ నాయకుల అభిప్రాయాన్ని తీసుకోవడం ఈ రౌండ్ టేబుల్ సమావేశం లక్ష్యం ఉంది.

 

image.png


కార్యక్రమంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ముఖ్య ఉపన్యాసం చేస్తూ ఆర్&డి డేటాను సంగ్రహించడానికి భారతదేశం బలమైన మరియు ప్రామాణిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సేవ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారతదేశ ప్రయాణాన్ని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రొ.సూద్ మాట్లాడుతూ..ఆర్థికవ్యవస్థలో సేవలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆవిష్కరణలు మరియు ఉత్పత్తి అభివృద్ధి ద్వారా మనం గ్లోబల్ ప్రాముఖ్యంలోకి దూసుకుపోతామని చెప్పారు. సృజనాత్మకత మరియు రిస్క్ తీసుకునే సంస్కృతిని పెంపొందిస్తూ ఆర్ అండ్ డిలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టాలని కంపెనీలను ఆయన కోరారు. పోటీలో నిలబడేందుకు భారతదేశం ఈ విజన్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థను సాకారం చేసుకోవడానికి వారధిగా ప్రభుత్వ ప్రైవేట్ నిధుల నమూనాలను స్వీకరించాలన్నారు. భారతదేశ ఆర్&డి ఎజెండా ఆవశ్యకతను . ప్రొ. సూద్ వివరించారు. ఇది కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదని ఇది మన భవిష్యత్తును రూపొందించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు రాబోయే తరాలకు వారసత్వాన్ని అందించడం గురించి అని ప్రొఫెసర్ సూద్
చెప్పారు.

ఈ సందర్భంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ & సీఈఓ, మరియు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) చైర్‌పర్సన్ డాక్టర్ అజయ్ భూషణ్ పాండే మాట్లాడుతూ ఆర్‌&డి రంగంలో అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలకు సంబంధించిన వివిధ ఉదాహరణలను ప్రస్తావించారు మరియు దేశంలో ఆర్&డి కార్యక్రమాలపై పన్ను రాయితీలకు సంబంధించిన అంశాలను పంచుకున్నారు. ఈఎస్‌జి (పర్యావరణ, సామాజిక మరియు పాలన) మరియు ఆర్&డి ప్రాముఖ్యతపై కార్పొరేట్ రంగానికి అవగాహన కల్పించాల్సిన అవసరం మరియు ప్రాముఖ్యతను కూడా ఆయన హైలైట్ చేశారు. డిజిటల్ మౌలిక సదుపాయాలలో అగ్రగామిగా మారడం ద్వారా భారతదేశం విజయవంతంగా ఉదాహరణలను స్థాపించిందని పేర్కొన్నారు. దక్షిణ కొరియా, జపాన్, చైనా, సింగపూర్, అమెరికా, ఇజ్రాయెల్ మరియు జర్మనీ వంటి దేశాల నుండి వచ్చిన కేస్ స్టడీలను హైలైట్ చేస్తూ ఆ దేశాలు తమ ఆర్&డి రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారాయని డాక్టర్ పాండే చెప్పారు. ఈఎస్‌జి రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌లను అవలంబించడం ఈఎస్‌జీ లీడ్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతులను ప్రోత్సహించే దిశగా కంపెనీల విధానాన్ని ఎలా మారుస్తుందో కూడా వివరించారు. అదేవిధంగా భారతదేశ ఆర్&డిలో అదే విధమైన వృద్ధిని ప్రొత్సహించగలదని డాక్టర్ పాండే చెప్పారు.

పిఎస్‌ఏ కార్యాలయ సైంటిఫిక్ సెక్రటరీ డాక్టర్ పర్విందర్ మైనీ మాట్లాడుతూ  దేశంలో పరిశోధన & అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను అమలు చేయడంలో తన అనుభవాలను పంచుకున్నారు. ఆవిష్కరణలను  ఆర్&డి  నడిపిస్తుందని ఆమె పునరుద్ఘాటించారు. ఆర్&డి పెట్టుబడులలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించాలని  డా. మైనీ వివరించారు. సాంకేతిక పురోగతి మరియు స్థిరమైన వృద్ధి వైపు మన ప్రయాణంలో ప్రైవేట్ రంగం భాగస్వాములుగా ముందడుగు వేయాలని తెలిపారు. ఆర్&డి శ్రేష్ఠతకు సమిష్టి నిబద్ధత అవసరమని నొక్కి చెబుతూ, సహకార ప్రయత్నాలను ఆమె వివరించారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ శ్రీ సునీల్ కుమార్ తన ప్రసంగంలో దేశంలోని ఆర్&డి డేటాను సంగ్రహించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం యొక్క చొరవలను హైలైట్ చేశారు. హేతుబద్ధమైన విధాన రూపకల్పన మరియు భారతీయ విధానాలతో మెరుగైన అమలుపై శ్రీ కుమార్ చేసిన పిలుపు ప్రేక్షకులను అలరించింది. ప్రభుత్వ-ప్రైవేట్ కంపెనీల డేటాబేస్‌ను ప్రత్యేకంగా ఆర్&డి రంగానికి సంబంధించి జోక్యాలను మరియు సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన ప్రతిపాదించారు.

ఈ సందర్భంగా  కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఏ) జాయింట్ సెక్రటరీ శ్రీ ఇందర్ దీప్ సింగ్ ధరివాల్ మాట్లాడుతూ మన ప్రాచీన మూలాల నుండి ఆర్&డి సారాంశాన్ని వివరించారు. "పంచతంత్రం యొక్క కాలానుగుణ కథలలో మనకు మించిన జ్ఞానం కనిపిస్తుంది. మన పూర్వీకులు జ్ఞానం విలువను అర్థం చేసుకున్నారు మరియు సమాధానాలను వెతకడం, సరిహద్దులను కనుక్కోవడం మరియు సృజనాత్మకతను పెంపొందించడంలో నిజమైన పురోగతి ఉందని వారు గుర్తించారు. ఆర్‌అండ్‌డిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ వారసత్వాన్ని గౌరవించాలని శ్రీ ధరివాల్ కార్పొరేట్ కమ్యూనిటీని కోరారు. ఇది కేవలం ఒక బాధ్యతగా కాకుండా మన దేశ భవిష్యత్తుకు పవిత్ర కర్తవ్యంగా ఉంటుందన్నారు.

మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా టాప్ 1,000 లిస్టెడ్ కంపెనీలలో ఆర్&డి ఖర్చుల వివరాలతో పాటు ఐఐసీఏ నిర్వహించిన పరిశోధన అధ్యయనానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఫలితాలను భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయ పిఎస్‌ఏ శ్రీ బి.ఎన్. సత్పతి సమర్పించారు. ఈ పరిశోధన అధ్యయనం కంపెనీలు, రంగాలు మరియు భౌగోళిక అంశాలలో ఖర్చుల పరిమాణాన్ని పోల్చింది; పరిశ్రమలు మరియు రంగాలలో అత్యధిక ఆర్&డి పెట్టుబడి, మరియు నిర్దిష్ట వ్యయం అలాగే ఆర్&డిలో పెట్టుబడి వ్యూహాలను ఆప్టిమైజ్ చేయడానికి అవసరమైన సిఫార్సులు అందించింది.

ఐఐసీఏ, స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ గరిమా దధీచ్ మాట్లాడుతూ “మనం ఆవిష్కరణ మరియు స్థిరత్వాల కూడలిలో ఉన్నాము. ఆర్&డి పట్ల మన నిబద్ధత మన భవిష్యత్తును రూపొందిస్తుంది. ఇది మన వ్యాపారాలపై మాత్రమే కాకుండా మన పర్యావరణం, సమాజం మరియు భవిష్యత్తు తరాలపై కూడా ప్రభావం చూపుతుంది. మెరుగైన నిబద్ధత, మెరుగైన రిపోర్టింగ్ పద్ధతులు, సహకారం మరియు దీర్ఘకాలిక ప్రభావం యొక్క ఆవశ్యకతను నొక్కిచెబుతూ రౌండ్‌టేబుల్ నిర్దిష్ట లక్ష్యాలను డా. దధీచ్ వివరించారు.

ఐఐసిఎలోని స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ చీఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ రవి రాజ్ ఆత్రే రౌండ్ టేబుల్‌కు సహకరించారు. వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు చెందిన ఆర్&డి/సుస్థిరత విభాగాల నుండి దాదాపు 50 మంది సీనియర్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంప్రదింపుల నుండి అందిన కొన్ని కీలకమైన సిఫార్సులు ఏంటంటే ఆర్&డి డేటాను రియల్ టైమ్ ప్రాతిపదికన నిర్వహించడానికి మరియు ట్రాక్ చేయడానికి ఆర్&డి  ప్రాముఖ్యతపై కార్పొరేట్ కార్యనిర్వాహకులకు అవగాహన కల్పించడానికి అంకితమైన వెబ్-పోర్టల్‌ను రూపొందించాలి. ఆర్&డి  ప్రామాణిక నిర్వచనం ప్రామాణిక ఫార్మాట్‌లలో తప్పనిసరి ఆర్&డి బహిర్గతం కోసం అవకాశం, జాబితా చేయని కంపెనీల కోసం కూడా అలాంటి పరిశోధన అవసరం అని వివరించింది.

భారతదేశంలోని మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా టాప్ 1,000 లిస్టెడ్ కంపెనీల ఆర్&డి వ్యయంపై పరిశోధన అధ్యయనాన్ని స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ ఐఐసిఏకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం అప్పగించడం గమనార్హం.


 

***


(Release ID: 2020908) Visitor Counter : 80