రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
హైవే యూజర్ల తో అనుచితంగా ప్రవర్తించిన టోల్ ఆపరేటింగ్ ఏజెన్సీని తొలగించిన ఎన్హెచ్ఏఐ
प्रविष्टि तिथि:
10 MAY 2024 3:56PM by PIB Hyderabad
టోల్ (యూజర్ ఫీజు) ఆపరేటర్, దాని ఉద్యోగులు సాధారణ ప్రజలతో దుర్మార్గంగా ప్రవర్తించడంపై కఠినంగా వ్యవహరిస్తూ, ఎన్హెచ్ఏఐ చర్యలు చేపట్టింది. రాజస్థాన్‌లోని అమృత్‌సర్ - జామ్‌నగర్ విభాగం లోని సిర్మండి టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి వినియోగదారులపై దాడి మరియు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనకు సంబంధించి మెసెర్స్ రిద్ధి సిద్ధి అసోసియేట్‌ను డిబార్ చేసింది.
05.05.2024 నాడు సిర్మండి టోల్ ప్లాజా వద్ద హైవే వినియోగదారులతో టోల్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఉద్యోగులు దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన నమోదైంది. ఈ విషయంపై సత్వర చర్య చేపడుతూ సంఘటనను ఎన్హెచ్ఏఐ పరిశీలించింది. సంస్థకు 'షో కాజ్' నోటీసు ఇచ్చింది. టోల్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. కాంట్రాక్టు నిబంధనలు, ఎన్హెచ్ఏఐ స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను పూర్తిగా ఉల్లంఘిస్తూ, ఏజెన్సీ హైవే వినియోగదారులతో హింసకు దిగి, అనుచితంగా ప్రవర్తించే కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించారు. అథారిటీ మెసెర్స్ రిద్ధి సిద్ధి అసోసియేట్‌లను ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్ల జాబితా నుండి మూడు నెలల పాటు డిబార్ చేసింది.
దాని టోల్ ఆపరేటర్లతో ఎన్హెచ్ఏఐ కాంట్రాక్ట్ ఒప్పందం, కాంట్రాక్టర్ ద్వారా నియమించబడిన సిబ్బంది ప్రజలతో తప్పుగా ప్రవర్తించరాదని / వారి ప్రవర్తనలో కఠినమైన క్రమశిక్షణ, మర్యాదను పాటించాలని స్పష్టంగా నిర్వచిస్తుంది. గత సంవత్సరం, ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజాల వద్ద వాగ్వివాద సంఘటనలను అరికట్టడానికి, ప్రయాణికులు, టోల్ ఆపరేటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు వివరణాత్మక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి)ని జారీ చేసింది.
జాతీయ రహదారులపై సురక్షితమైన, నిరాటంక ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఎన్హెచ్ఏఐ కట్టుబడి ఉంది. ఇటీవల టోల్ ప్లాజాల వద్ద హైవే వినియోగదారులతో హింసకు దిగుతూ, దుర్మార్గంగా ప్రవర్తించే అక్రమ ఏజెన్సీలపై బలమైన చర్య తీసుకుంది.
***
(रिलीज़ आईडी: 2020418)
आगंतुक पटल : 100