ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విజ్ఞాన్ భవన్ లో ఈశాన్య ప్రాంత పర్యాటక అభివృద్ధి టాస్క్ ఫోర్స్ ఐదవ సమావేశం

प्रविष्टि तिथि: 10 MAY 2024 5:22PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగం  అభివృద్ధి కోసం ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ 5వ సమావేశం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగింది.  ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి అవసరమైన సామర్థ్యం నిర్మాణం , శిక్షణ విధానాలు, మార్కెటింగ్ తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
 

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు చెందిన అధికారులతో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య  (సీఐఐ), ఇతర ప్రైవేట్ భాగస్వాముల ప్రతినిధులు పాల్గొన్నారు.

***


(रिलीज़ आईडी: 2020416) आगंतुक पटल : 106
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Tamil