కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

డాట్... 15 స్టార్టప్స్, విద్యా సంస్థలను ఒక వేదికపైకి తెచ్చి ఇటువంటి తరహా తొలి చొరవగా టెలికాం డిజైన్ కొలాబరేషన్ స్ప్రింట్


డీప్-టెక్ వేగవంతమైన ఆలోచన, పరిష్కార అభివృద్ధిలో నిమగ్నమైన వివిధ స్టార్టప్‌లు, ఇతర భాగస్వాములు

భవిష్యత్తు అవసరాలకు తగ్గ టెలికాం పర్యావరణ వ్యవస్థకు మార్గం సుగమం చేయడం దీని లక్ష్యం

Posted On: 09 MAY 2024 5:07PM by PIB Hyderabad

ఒక కొత్త చొరవలో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) స్టార్టప్‌లు/ఎంఎస్ఎంఈలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలను "టెలికాం డిజైన్ సహకార స్ప్రింట్" కింద ఒకచోట చేర్చింది. ఈ స్ప్రింట్‌ను బెంగళూరులోని ఐఐఐటీ లో డిఓటి నిర్వహించింది. రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ఆర్ఏఎన్), కోర్ ఎకోసిస్టమ్స్‌లోని పదిహేను ప్రముఖ స్టార్టప్‌లు/ఎంఎస్ఎంఈలు, ఐఐటీ మద్రాస్, సి-డాట్, ఐఐటీ ఢిల్లీ, ఇతర నెట్‌వర్క్ సంస్థలు వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పాల్గొన్నాయి.

ఈ సహకారం సమగ్ర 5జి సొల్యూషన్‌తో కూడిన సమగ్ర, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న టెలికాం స్టాక్‌ను అభివృద్ధి చేయడానికి, 6జి భవిష్యత్తు పురోగతికి వేదికను ఏర్పాటు చేయడానికి లోతైన సాంకేతికత వేగవంతమైన ఆలోచన, వినూత్న పరిష్కారంలో భాగస్వామ్యం అవుతుంది. స్ప్రింట్ మూడు ప్రాథమిక లక్ష్యాలతో కొనసాగింది:

 

  1. సమిష్టి బలాన్ని పెంచడం: స్టార్టప్‌లను కీలకమైన 5జి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాంతాలలో నైపుణ్యాన్ని మిళితం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి,  సాధారణ టెలికాం స్టాక్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి  స్ప్రింట్  వీలు కల్పించింది.
  2. హోలిస్టిక్ సొల్యూషన్స్‌ను ప్రోత్సహించడం: సహకారం ద్వారా, స్టార్టప్‌లు సమగ్ర 5జి పరిష్కారాలను రూపొందించడం, పరిశ్రమ అవసరాలను పరిష్కరించడం, భవిష్యత్తు పురోగతికి సిద్ధపడడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
  3. మార్కెట్ అవకాశాలను కల్పించడం: ప్రయత్నాలను సమలేఖనం చేయడం ద్వారా, ఇది మార్కెట్ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ప్రయత్నిస్తుంది. టెలికాం ల్యాండ్‌స్కేప్‌లో పోటీ పడటానికి, ఎదగడానికి స్టార్టప్‌లను శక్తివంతం చేస్తుంది. 

 

స్ప్రింట్ ఈవెంట్‌లో లోతైన, విస్తృతమైన చర్చల తర్వాత, భారతీయ టెలికాం పర్యావరణ వ్యవస్థలోని అంతరాలను పరిష్కరించడానికి, 6జి, ఇతర రాబోయే సాంకేతికతలకు సిద్ధంగా ఉండటానికి ఫలితం-ఆధారిత కేంద్రీకృత సమూహాలు ఏర్పడ్డాయి. ఈ సమూహాలు ప్రస్తుత అంతరాలను తగ్గించడానికి, భవిష్యత్తు అవసరాలకు సరిపోయే పరిష్కారాలను అందించే లక్ష్యంతో కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిబ్యూషన్ యూనిట్‌లు (డియులు), రేడియో యూనిట్లు (ఆర్‌యులు), సెంట్రల్ యూనిట్లు (సియులు), ఇతర అంశాలపై దృష్టి పెట్టాయి. రెండు కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేశారు.

దీనిలో పాల్గొన్నవారు ఈ మార్గదర్శక చొరవను ప్రశంసించారు. పరిశ్రమలో ఇది ఇది ఈ తరహా తొలి ప్రయత్నం. వారు సన్నిహిత సహకారం పట్ల ఆసక్తిని వ్యక్తం చేశారు. అటువంటి కార్యక్రమాలను కొనసాగించాలని డాట్ ని కోరారు.

5జి యుగం, అంతకు మించి భారతదేశం టెలికమ్యూనికేషన్స్ రంగాన్ని ప్రపంచ నాయకత్వం వైపు నడిపించడానికి ఆవిష్కరణలను పెంపొందించడం, పరిశ్రమ సహకారాన్ని ప్రోత్సహించడంలో డాట్ నిబద్ధతను స్ప్రింట్ నొక్కి చెబుతుంది. అకాడెమియా, పరిశ్రమలతో కలిసి స్టార్ట్-అప్‌లు, ఎంఎస్ఎంఈలు ప్రత్యేక బలాలు, సామర్థ్యాలను ఒకచోట చేర్చి, 6జి సాంకేతికత వైపు ముందుకు సాగడంపై దృష్టి సారించి, దృఢమైన, ముందుకు కనిపించే మొబైల్ టెలికాం స్టాక్‌ను రూపొందించడం డాట్ లక్ష్యం.

 

****



(Release ID: 2020311) Visitor Counter : 87