రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గెజిట్ నోటిఫికేశన్ మాధ్యం ద్వారా ఇంటర్-సర్వీసెస్ఆర్గనైజేశన్స్ (కమాండ్, కంట్రోల్ & డిసిప్లిన్)చట్టాన్ని నోటిఫై చేయడమైంది

Posted On: 10 MAY 2024 4:04PM by PIB Hyderabad

ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేశన్స్ (కమాండ్, కంట్రోల్ ఎండ్ డిసిప్లిన్) చట్టాన్ని రాజపత్రం లో ప్రకటించడమైంది. ఈ చట్టం 2024 మే 10 వ తేదీ నుండి అమలు లోకి వస్తుంది. ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేశన్స్ (ఐఎస్ఒ స్) యొక్క ఆధిపత్యాన్ని, నియంత్రణ ను, సమర్థమైన పనితీరు ను ఉత్తేజితం చేయడం కోసం ఉద్దేశించిన ఒక బిల్లు ను 2023 వ సంవత్సర వర్ష కాల సమావేశాల లో పార్లమెంటు ఉభయ చట్ట సభల లో ఆమోదించడమైంది. ఈ బిల్లు కు 2023 ఆగస్టు 15 వ తేదీ న రాష్ట్రపతి ఆమోదం లభించింది.

 

ఈ చట్టం ఐఎస్ఒ ల కమాండర్స్-ఇన్-చీఫ్ మరియు ఆఫీసర్స్-ఇన్-కమాండ్ కు సర్వీసు సిబ్బంది మీద నియంత్రణ అధికారాల ను అప్పగిస్తుంది. ఈ అధికారాలు ప్రతి ఒక్క వ్యక్తిగత సేవ తాలూకు విశిష్ట సేవ షరతుల పైన ప్రతికూల ప్రభావాన్ని ప్రసరించకుండా క్రమశిక్షణ ను మరియు పరిపాలన ను ప్రభావవంతమైన విధం గా నిర్వహించడం లో దోహద పడతాయి.

 

నోటిఫికేశన్ వెలువడడం తో, ఈ చట్టం ఐఎస్ఒ ల అధిపతుల కు కేసులను త్వరిత గతి న పరిష్కరించేందుకు, ఒక సారి చేసినటువంటి కార్యాలనే మళ్లీ మళ్లీ చేయవలసిరావడాన్ని నివారించేందుకు మార్గాన్ని సుగమం చేయడం తో పాటుగా సాయుధ దళాల సిబ్బంది మధ్య అధిక సమన్వయాన్ని ఏర్పరచే దిశ లో ఒక అడుగు ను వేసేటటువంటి అధికారాన్ని ఇస్తుంది.

 

***


(Release ID: 2020247) Visitor Counter : 107