ఆర్థిక మంత్రిత్వ శాఖ

లద్దాఖ్‌లో ఈ నెల 6-7 తేదీల్లో భారత్ - భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ (జేజీసీ) సమావేశం


రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవడం సహా వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చ
పరస్పర గరిష్ట ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను వెతకటానికి భారత్-భూటాన్ అంగీకారం

Posted On: 07 MAY 2024 8:58PM by PIB Hyderabad

భారతదేశం-భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ (జేజీసీ) సమావేశం ఈ నెల 6-7 తేదీలలో లద్దాఖ్‌లోని లేహ్‌లో జరిగింది. కేంద్ర పరోక్ష పన్నులు &  కస్టమ్స్ విభాగం ప్రత్యేక కార్యదర్శి, సభ్యుడు (కస్టమ్స్) శ్రీ సుర్జిత్ భుజబల్, భూటాన్ ప్రభుత్వ రెవెన్యూ & కస్టమ్స్ విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీ సోనమ్ జమ్త్‌షో అధ్యక్షత ఈ సమావేశం జరిగింది.

కొత్త ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లను ప్రారంభించడం, కొత్త వాణిజ్య మార్గాలను ప్రకటించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా ప్రక్రియల డిజటలీకరణ, స్మగ్లింగ్ నిరోధం, సరిహద్దు నిర్వహణలో సమన్వయం, కస్టమ్స్ సమాచారం ముందస్తు మార్పిడి, కస్టమ్స్ సహకారంపై ద్వైపాక్షిక ఒప్పందం, ఎలక్ట్రానిక్ కార్గో వ్యవస్థ కింద సరుకుల రవాణా వంటి ద్వైపాక్షిక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.

తమ కస్టమ్స్ అధికారుల సామర్థ్య నిర్మాణం, శిక్షణ & నైపుణ్యాభివృద్ధి కోసం ఐఆర్ఎస్ సహా వివిధ వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నిరంతర మద్దతు అందిస్తున్న భారత ప్రభుత్వానికి, ప్రత్యేకించి పరోక్ష పన్నుల బోర్డు &  కస్టమ్స్‌ విభాగానికి భూటాన్ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు, వివిధ ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా భూటాన్‌తో సీమాంతర వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించి, ప్రోత్సహిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి భూటాన్ అభినందనలు తెలిపింది.

 

 

భారత్-భూటాన్ జేజీసీ సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. కస్టమ్స్ విధానాలను పునర్నిర్వచించడం, పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ ఉత్తమ విధానాలకు అనుగుణంగా సీమాంతర వాణిజ్యాన్ని సులభతరం చేయడం వంటి అంశాలపై చర్చిస్తారు. రెండు దేశాల మధ్య అనుసంధానత పెంచడంలో, సరిహద్దుల వద్ద కస్టమ్స్ అనుమతుల కోసం వాణిజ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ఏటా జరిగే సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయి. భారతదేశం-భువాన్ సరిహద్దుల్లోని పశ్చిమ బెంగాల్లో బంగాల్ (6), అసోం (4) రాష్ట్రాల్లో10 ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు ఉన్నాయి.

భూటాన్‌కు అగ్ర వాణిజ్య భాగస్వామి భారత్. 2014 నుంచి, భూటాన్‌తో భారతదేశ వాణిజ్యం 2014-15లోని $484 మిలియన్ల నుంచి 2022-23లో $1,615 మిలియన్లకు, మూడు రెట్లు పెరిగింది. ఇది భూటాన్ మొత్తం వాణిజ్యంలో 80% వాటా భారతదేశానిదే. చుట్టూ భూ ప్రాంత సరిహద్దులు ఉన్న దేశం కాబట్టి ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భూటాన్‌తో వాణిజ్యం కీలకం. భూటాన్‌తో అనుసంధానత మెరుగుపరుచుకోవడం భారతదేశ ‘నైబర్‌హుడ్ ఫస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ విధానాల్లో ముఖ్యమైనది.

 భారతదేశం-భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం ఆశాజనకంగా ముగిసింది. పరస్పర గరిష్ట ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలు వెతకటానికి, నూతన సాంకేతికతలు & సామాజిక ఆవిష్కరణల్లో వస్తున్న వేగవంతమైన మార్పులను అందిపుచ్చుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి. పరస్పర అభివృద్ధి కోసం కస్టమ్స్, వాణిజ్య సహకారాన్ని మరింత సులభంగా మార్చడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

                                     

 ***



(Release ID: 2020089) Visitor Counter : 76