రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నౌకా నిర్మాణం లో దేశవాళీ భాగాల ఉపయోగాన్ని పెంచడంకోసం మరీన్ గ్రేడ్ ఉక్కు కొనుగోలు కై ప్రైవేటు రంగం తో ఎమ్ఒయు ను కుదుర్చుకున్నభారతీయ కోస్తాతీర రక్షకదళం

Posted On: 08 MAY 2024 12:12PM by PIB Hyderabad

నౌకా నిర్మాణం లో దేశవాళీ సామగ్రి ని ఉపయోగించడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం లో భాగం గా స్వదేశీ మరీన్ గ్రేడ్ ఉక్కు కొనుగోలు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) మరియు జిందల్ స్టీల్ & పావర్ (జెఎస్‌పి) లు 2024 మే నెల 7 వ తేదీ నాడు ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పైన న్యూ ఢిల్లీ లో సంతకాలు చేశాయి. ఒప్పందం లో భాగస్వామ్యం పంచుకొన్న రెండు సంస్థలు దేశ హితం కోసం స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం కోసం అవసరమైన సామర్థ్య నిర్మాణానికి వాటి నిబద్ధత ను చాటిచెప్పాయి.

 

ఈ ఎమ్ఒయు రక్షణ సంబంధి జటిల సవాళ్ళ ను ఎదుర్కోవడం లో పబ్లిక్ - ప్రైవేటు భాగస్వామ్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్తుంది. ఈ ఎమ్ఒయు కుదిరిన సందర్బం లో ప్రభుత్వ సంస్థల కు మరియు ప్రైవేటు రంగాని కి మధ్య సహకారం ఏర్పడవలసిన అవసరాన్ని కూడ స్పష్టం చేస్తున్నది. నాణ్యత, గ్రేడు లు, డైమన్శన్ లతో పాటు ఎమ్ఒయు లో నిర్దేశించిన ఉక్కు ప్లాంటు లు ఎప్పటికప్పుడు నౌకానిర్మాణం కోసం అవసరమైన కొన్ని రకాల ఉక్కు ను అవి తయారు చేయవలసిన ఉత్పత్తి, ఐసిజి కి సరఫరా చేయడం కోసం నిర్దిష్ట శిప్ బిల్డింగ్ యార్డుల కు ఇవ్వవలసిన హామీ ల వంటివి ఎమ్ఒయు లో ఇమిడి ఉన్న కీలకమైన ప్రయోజనాల లో ఉన్నాయి.

 

ఎమ్ఒయు పై ఐసిజి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (మెటీరియల్ & మెయిన్‌టెనెన్స్) ఐజి శ్రీ హెచ్.కె. శర్మ మరియు జెఎస్‌పి యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ ఎస్.కె. ప్రధాన్ లు ఐసిజి కి చెందిన సీనియర్ అధికారుల సమక్షం లో సంతకాలు చేశారు.

 

***


(Release ID: 2020026) Visitor Counter : 125