భారత పోటీ ప్రోత్సాహక సంఘం
సిక్కిమ్ ఊర్జా లిమిటెడ్ (ఇదివరకటి తీస్తా ఊర్జాలిమిటెడ్ ) లో అదనపు శేర్స్ ను గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలుచేసేందుకు ఆమోదం తెలిపిన సిసిఐ
Posted On:
07 MAY 2024 9:01PM by PIB Hyderabad
సిక్కిమ్ ఊర్జా లిమిటెడ్ (ఇదివరకటి తీస్తా ఊర్జా లిమిటెడ్ ) లో అదనపు వాటాల ను గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు కాంపిటిశన్ కమిశన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదాన్ని తెలియజేసింది.
గ్రీన్‌కో ఎనర్జీస్ భారతదేశం లో ఏర్పాటైన ఒక పరిమితమైన బాధ్యత కలిగిన వ్యాపార సంస్థ. ఇది గ్రీన్‌కో మారిశస్ యొక్క పూర్తి యాజమాన్యం లో (పరోక్షం గా) సబ్సిడియరి కంపెనీ గా ఉన్నది. గ్రీన్‌కో మారిశస్ యొక్క సంపూర్ణ యాజమాన్యం మారిశస్ లో ఏర్పాటైన గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్ (జిఇహెచ్) వద్ద ఉన్నది. గ్రీన్‌కో గ్రూపు ఆఫ్ కంపెనీస్ కు హోల్డింగ్ కంపెనీ యే జిఇహెచ్. జిఇహెచ్ అనేది ఒక ఇన్వెస్ట్ మెంట్ హెల్డింగ్ కంపెనీ; ఇది భారతదేశం లో విద్యుత్తు ఉత్పాదన రంగం లో నిమగ్నం అయి ఉన్నటువంటి కంపెనీ ల యొక్క విధ విధాలైన వ్యాపార సముచ్చయం లో పెట్టుబడుల ను పెట్టింది.
సిక్కిమ్ ఊర్జా ఒక స్పెశల్ పర్పస్ వెహికిల్, దీని ని భారతదేశం లో 1200 మెగా వాట్ (ఎమ్‌డబ్ల్యు) (ఒక్కొక్కటీ 200 ఎమ్‌డబ్ల్యు సామర్థ్యం కలిగి ఉండేటటువంటి 6 యూనిట్ లు) జల విద్యుత్తు ఉత్పాదన కై సిక్కిమ్ ఉత్తర ప్రాంతం లో ఏర్పాటు చేయడమైంది.
ఈ విషయం లో, సిసిఐ యొక్క సమగ్ర ఉత్తర్వు త్వరలో వెల్లడి కానుంది.
***
(Release ID: 2020024)