కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాననీయ కర్నాటక ఉన్నత న్యాయస్థానం ఇటీవల వెలువరించిన నిర్ణయాన్నిఅనుసరించడం లో ఎటువంటి కార్యాచరణ ను చేపట్టాలో మదింపు చేయనున్న ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్ఒ)

Posted On: 07 MAY 2024 8:27PM by PIB Hyderabad

మాననీయ కర్నాటక ఉన్నత న్యాయస్థానం ఇటీవల వెలువరించినటువంటి నిర్ణయానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) ప్రాముఖ్యాన్ని ఇస్తున్నది. ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యనిధి పథకం, 1952 లోని 83 వ పేరాగ్రాఫ్ లో మరియు ఉద్యోగుల పింఛను పథకం, 1995 లోని 43ఎ పేరాగ్రాఫ్ లలో పేర్కొన్న అంతర్జాతీయ శ్రమికుల కు ఉద్దేశించినటువంటి నిర్దిష్ట నిబంధనల కు సంబంధించింది. దీనిని రాజ్యాంగం లోని 14 వ అధికరణం తో చూస్తే పరస్పర విరుద్ధం గా ఉందన్న భావన నెలకొంది. ఇపిఎఫ్ఒ ఈ నిర్ణయాన్ని అమలుపరచడం లో ఎటువంటి కార్యాచరణ ను చేపట్టాలి అనే అంశాన్ని చురుకు గా మదింపు చేస్తున్నది.

 

భారతదేశాని కి ప్రస్తుతం 21 దేశాల తో సామాజిక భద్రత సంబంధి ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలు ఆ యా దేశాల శ్రమికుల కోసం పరస్పర ఆదాన ప్రదానం ప్రాతిపదిక న ఎటువంటి అంతరాయానికి ఆస్కారం ఉండనటువంటి సామాజిక భద్రత కవరేజీ కి పూచీ పడుతూ ఉన్నాయి. ఆ దేశాల పౌరులు అవతలి పక్షం భూభాగాల లో ఉద్యోగాలను స్వీకరించిన పక్షం లో, వారి కి సామాజిక భద్రత కవచం ఎటువంటి అంతరాయాల కు ఆస్కారం లేని విధం గా అందుబాటు లో ఉంటుంది.

 

ఈ ఒప్పందాలు అంతర్జాతీయ ఉద్యోగం కాలం లో ఉద్యోగుల కు ఎటువంటి అంతరాయానికి తావు ఉండని విధం గా సామాజిక భద్రత కవరేజీ కి హామీ ని ఇచ్చే లక్ష్యం తో రూపుదాల్చాయి. ఇంటర్‌ నేశనల్ మొబిలిటీ ని ప్రోత్సహించాలన్నా, ఉద్యోగం చేసే వ్యక్తుల తాలూకు వయస్సు కు సంబంధించిన విషయం లో అనుకూల స్థితి తాలూకు ప్రయోజనాల ను పొందాలన్నా ఈ ఒప్పందాలు భారతదేశానికి ఎంతో ముఖ్యమైనటువంటివిగా ఉన్నాయి. ఈ తరహా సామాజిక భద్రత ఒప్పందాల ను భారతదేశం లో నిర్వహించే సంస్థ గా ఇపిఎఫ్ఒ వ్యవహరిస్తున్నది.

 

***


(Release ID: 2020023) Visitor Counter : 112