గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్టేట్ మైనింగ్ ఇండెక్స్ అనే అంశం పై ఒక రోజు కార్యశాల ను ఐఐటి-ఐఎస్ఎమ్, ధన్‌బాద్ యొక్క సహకారం తో నిర్వహించనున్న గనుల మంత్రిత్వ శాఖ

Posted On: 07 MAY 2024 3:56PM by PIB Hyderabad

గనుల మంత్రిత్వ శాఖ ‘స్టేట్ మైనింగ్ ఇండెక్స్’ అంశం పై రేపటి రోజు న అంటే 2024 మే నెల 8 వ తేదీ న దిల్లీ లో ఒక రోజు పాటు సాగే కార్యశాల ను నిర్వహించనున్నది. ధన్‌బాద్ లోని ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఐటి-ఐఎస్ఎమ్) సహకారం తో ఈ వర్క్ శాపు ను గనుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు, గనుల రంగం లో కనబరచిన పనితీరు ఏ విధం గా ఉంది అన్నది తెలుసుకోవడాని కి లక్షించినటువంటి స్టేట్ మైనింగ్ ఇండెక్స్ యొక్క ముసాయిదా స్వరూపాన్ని చర్చించడం ఈ వర్క్ శాపు యొక్క ఉద్దేశ్యం గా ఉంది. ఈ వర్క్ శాప్ నకు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వి.ఎల్. కాంతా రావు అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రాల కు చెందిన సీనియర్ అధికారులు ఈ వర్క్ శాపు లో పాలుపంచుకోనున్నారు.

 

గనుల రంగం అనేక వేల్యూ చైన్ లలో అన్నిటి కంటే అగ్రస్థానాన నిలుస్తున్నది; ఈ రంగం ఉక్కు, నాన్- ఫెర్రస్ మెటల్స్, సిమెంటు, ఎరువులు, రసాయనాలు మరియు ఎలక్ట్రానిక్స్ ల వంటి కీలకమైన పరిశ్రమల కు ముడి పదార్థాల ను సరఫరా చేస్తున్నది. దేశం లో గనుల రంగం యొక్క అభివృద్ధి లో రాష్ట్రాలు ఒక కీలకమైన పాత్ర ను పోషించవలసి ఉంది. గనుల రంగం కోసం విభిన్న దృష్టికోణాన్ని రూపొందించడమైంది. వీటిలో సమానత్వం, మన్నిక మరియు బాధ్యతల తో పాటు గా వనరుల వినియోగం లో సామర్థ్యానికి పెద్ద పీట ను వేయడం, భారతదేశం యొక్క భూమి లో అన్వేషణ పై శ్రద్ధ ను కలిగి ఉండే ఆవశ్యకత, రాబోయే కాలం లో ఖనిజాల ఉత్పాదన ను సులభతరం గా మార్చడం కోసం దోహద పడేటటువంటి చర్యల ను తీసుకోవడం మరియు గనుల త్రవ్వకానికి సంబంధించిన కార్యకలాపాల వల్ల ప్రభావితం అయ్యే వ్యక్తుల మరియు ప్రాంతాల హితం కోసం, ప్రయోజనం కోసం కృషి చేయడం వంటివి చేరి ఉన్నాయి. ఈ తరహా జాతీయ ప్రయాస లో ఏ రాష్ట్రం యొక్క సాపేక్ష తోడ్పాటు అయినా ముఖ్యమైందే; మరి దీనిని ప్రతిబింబించవలసినటువంటి అవసరమూ ఉన్నది. అ విధమైన గనుల రంగం యొక్క పనితీరు తో పాటు గనుల త్రవ్వకం కార్యకలాపాల లో రాష్ట్రాల తరఫున భావి సన్నాహాల ను నమోదు చేయడం కోసం ఒక స్టేట్ మైనింగ్ ఇండెక్స్ ను రూపొందించాలని లక్షించడమైంది. ఈ ఇండెక్స్ పరిధి లోకి ఇంధనేతర ప్రముఖ ఖనిజాలు, లఘు ఖనిజాలు కూడా చేరుతాయి. ఈ ఇండెక్స్ స్వరూపాన్ని రూపొందించడం, డేటా ను సేకరించడం మరియు ఇండెక్స్ ను సిద్ధం చేసేందుకు ఒక అధ్యయనాన్ని నిర్వహించే బాధ్యతల ను ధన్ బాద్ లో గల ఐఐటి-ఐఎస్ఎమ్ కు గనుల మంత్రిత్వ శాఖ అప్పగించింది.

 

ఈ ప్రక్రియ ను పారదర్శకం గా విషయనిష్ఠం గా తీర్చిదిద్దడం కోసం ఇండెక్స్ ను అభివృద్ధి పరచే ప్రతి ఒక్క దశ లో రాష్ట్రాల తో సంప్రదించడం జరుగుతున్నది. దిల్లీ లో ఏర్పాటు చేసిన ఒక రోజు వర్క్ శాపు ఈ ప్రయాస లో ఓ భాగం గా ఉంది. ఈ కార్యశాల లో రాష్ట్రాల నుండి అందే ప్రతిస్పందన లు రూపురేఖల ను ఖరారు చేయడం లో దోహద పడనున్నాయి.

 

 

**

 


(Release ID: 2020022) Visitor Counter : 125