వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్‌రా లో జరిగిన ఇండియా-ఘనా జాయింట్ ట్రేడ్ కమిటీయొక్క నాలుగో సమావేశం


ఘనా ఇంటర్ బ్యాంక్ పేమెంట్ ఎండ్ సెటిల్‌మెంట్సిస్టమ్స్ లో యుపిఐ ని ఆరు నెలల లోపల పని చేయించేందుకు అంగీకరించిన భారతదేశం మరియుఘనా

డిజిటల్ ట్రాన్స్‌ఫర్ మేశన్స్ సాల్యూశన్స్ మరియులోకల్ కరెన్సి సెటిల్‌మెంట్ సిస్టమ్ లపై ఎమ్ఒయు లను కుదుర్చుకొనేందుకు గల అవకాశాలను అన్వేషించిన ఇరు పక్షాలు;  ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ పరిధి లో అవకాశాల ను గురించి కూడచర్చించడమైంది

డిజిటల్ ఇకానమి, వస్త్రాలు, నవీకరణ యోగ్యశక్తి మరియు ఆరోగ్య సంరక్షణ రంగాల ను కీలక రంగాలు గా గుర్తించడమైంది

Posted On: 06 MAY 2024 1:46PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం లో వాణిజ్యం మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ వాణిజ్య విభాగ అడిశనల్ సెక్రట్రి శ్రీ అమర్ దీప్ సింహ్ భాటియా నాయకత్వం లో ఏడుగురు సభ్యుల ప్రతినిధి వర్గం, ఘనా గణతంత్రం లో భారతదేశ హై కమిశనర్ శ్రీ మనీష్ గుప్త, వాణిజ్య విభాగం లో ఆర్థిక సలహాదారు ప్రియ పి. నాయర్ గారు లతో కలసి 2024 మే నెల 2 వ తేదీ మరియు 3 వ తేదీల లో అక్‌రా లో వారి కోవ కు చెందిన అధికారుల తో ఒక సంయుక్త వ్యాపార సంఘం (జెటిసి) సమావేశం లో పాల్గొన్నారు. జెటిసి కి సహ అధ్యక్షత ను ఘనా గణతంత్రం లో వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ డిప్యూటీ మినిస్టర్ శ్రీ మైకేల్ ఓకరె-బాఫీ మరియు వాణిజ్య విభాగం అడిశనల్ సెక్రట్రి శ్రీ అమర్ దీప్ సింహ్ భాటియా లు వహించారు.

 

 

 

 

ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాల లో ఇటీవల చోటు చేసుకొన్న ఘటనల క్రమాన్ని రెండు పక్షాలు క్షుణ్ణం గా సమీక్షించాయి; మరింత గా విస్తరణ కు గల అవకాశాల ను వినియోగించుకోవాలి అని గుర్తించడమైంది. నేశనల్ పేమెంట్స్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) కు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) ని ఘనా లో గల ఘనా ఇంటర్ బ్యాంక్ పేమెంట్ ఎండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ (జిహెచ్ఐపిఎస్ఎస్) లో పని చేయించే దిశ గా సంబంధి కార్యాల ను శీఘ్ర గతి న చేపట్టాలని ఇరు పక్షాలు సమ్మతి ని వ్యక్తం చేశాయి. డిజిటల్ ట్రాన్స్‌ ఫర్ మేశన్ సాల్యూశన్స్ మరియు లోకల్ కరెన్సి సెటిల్‌మెంట్ సిస్టమ్ లపై అవగాహన పూర్వక ఒప్పంద పత్రాల (ఎమ్ఒయు స్) ను కుదుర్చుకొనేందుకు గల అవకాశాల పై ఉభయ పక్షాలు చర్చలు జరిపాయి. అలాగే ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ (ఎఎఫ్‌సిఎఫ్‌టిఎ) ప్రసాదిస్తున్న అవకాశాల విషయం లోను చర్చోపచర్చలు జరిగాయి.

 

 

ద్వైపాక్షిక వ్యాపారాన్ని మరియు పరస్పరం లాభదాయకం కాగల పెట్టుబడుల ను వృద్ధి చెందింప చేసుకోవడం కోసం శ్రద్ధ వహించవలసిన అనేక రంగాల ను రెండు పక్షాలు గుర్తించాయి. ఈ తరహా రంగాల లో ఔషధ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, ఇన్‌ఫర్ మేశన్ ఎండ్ కమ్యూనికేశన్ టెక్నాలజీ, వ్యవసాయం, ఫూడ్ ప్రాసెసింగ్, నవీకరణ యోగ్య శక్తి, విద్యుత్తు రంగం, డిజటల్ ఇకానమి, ఇంకా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ మినరల్స్, వస్త్రాలు మరియు దుస్తులు మొదలైనవి ఉన్నాయి.

 

భారతదేశం నుండి ఆధికారిక ప్రతినిధి వర్గం లో సభ్యులు గా భారతీయ భూ వైజ్ఞానిక సర్వేక్షణ (జిఎస్ఐ), ఎక్జిమ్ బ్యాంక్ మరియు ఇండియన్ ఫార్మాకోపియా కమిశన్ లకు చెందిన అధికారులు ఉన్నారు. జెటిసి లో జరిగిన చర్చల లో భారతదేశాని కి మరియు ఘనా కు చెందిన అధికారులు చురుకు గా పాలుపంచుకొన్నారు.

 

 

 

 

 

 

ఆధికారిక ప్రతినిధి వర్గం వెంట భారతదేశ పరిశ్రమ సమాఖ్య (సిఐఐ) నాయకత్వం లోని ఒక వ్యాపారుల ప్రతినిధి వర్గం కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంది. సిఐఐ ప్రతినిధి వర్గం లో విద్యుత్తు, ఫిన్ టెక్, టెలికమ్యూనికేశన్స్, ఎలక్ట్రికల్ మశీనరి, ఔషధ నిర్మాణ రంగాల వంటి పలు రంగాల కు చెందిన ప్రతినిధులు ఉన్నారు. వ్యాపారుల ప్రతినిధి వర్గం సభ్యులు ఎఎఫ్‌సిఎఫ్‌టిఎ సెక్రట్రి జనరల్ తో మరియు ఆయన బృందం లోని అధికారుల తో భేటీ అయ్యారు. ఈ సందర్భం లో ఒక ఎమ్ఒయు పై సంతకాలు, ప్రమాణాల నిర్దేశం, పెట్టుబడులు, భారతదేశం లో ఏర్పాటయ్యే వ్యాపార సంబంధి కార్యక్రమాల లో పాలుపంచుకోవడం, ఎఎఫ్‌సిఎఫ్‌టిఎ కు మరియు భారతదేశాని కి మధ్య అనుబంధాన్ని విస్తృత పరచుకోవడం గురించి చర్చించడమైంది. చర్చల ను ముందుకు తీసుకు పోయేందుకు నోడల్ ఆఫిసర్ ల పేర్ల జాబితా ను కూడా ఒక పక్షాని కి మరొక పక్షం ఇచ్చిపుచ్చుకొన్నది.

 

 

ఆఫ్రికా ప్రాంతం లో భారతదేశాని కి ఒక ముఖ్యమైన వ్యాపార భాగస్వామి గా ఘనా ఉంది. భారతదేశాని కి మరియు ఘనా కు మధ్య ద్వైపాక్షిక వ్యాపారం 2022-23 లో 2.87 బిలియన్ యుఎస్ డాలర్ స్థాయి లో నమోదైంది. ఘనా లో భారతదేశం ఒక ప్రముఖ పెట్టుబడిదారు గా మరియు మూడో అతి పెద్ద పెట్టుబడిదారు గా ఉంది. ఈ పెట్టుబడులు ఔషధ నిర్మాణం, నిర్మాణ రంగం, తయారీ రంగం, వ్యాపార సేవల రంగం, వ్యవసాయ రంగం, పర్యటన రంగం, ఇంకా అనేక రంగాల లో విస్తరించి ఉన్నాయి.

 

 

ఇండియా-ఘనా జెటిసి యొక్క నాలుగో సమావేశం తాలూకు చర్చోపచర్చలు సౌహార్దభరిత వాతావరణం లో జరిగాయి. దూరదర్శి దృక్పథం తో రెండు దేశాల మధ్య గల మైత్రీపూర్వకమైనటువంటి మరియు విశిష్టమైనటువంటి సంబంధాల కు ప్రతీక గా కూడ ఈ చర్చలు సాగాయి. పెండింగ్ పడ్డ అంశాల పరిష్కారం విషయం లో, వ్యాపారాన్ని మరియు పెట్టుబడి ని పెంపొందింప చేసుకోవడం లో మరియు రెండు దేశాల ప్రజల కు మధ్య పరస్పర సంబంధాల ను ఇప్పటి కంటే అధికం గా మలచుకోవడం లో సహకారం పట్ల ఉత్సాహజనక ప్రతిస్పందన వ్యక్తం అయింది.

 

 

***


(Release ID: 2019814) Visitor Counter : 119