బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏప్రిల్ లో బొగ్గు ఉత్పత్తి లో గత సంవత్సరం తో పోల్చి చూస్తే 7.41 శాతం వృద్ధి నమోదు అయింది

प्रविष्टि तिथि: 02 MAY 2024 4:53PM by PIB Hyderabad

భారతదేశం లో బొగ్గు ఉత్పత్తి 2024 వ సంవత్సరం ఏప్రిల్ లో 78.69 మెట్రిక్ టన్నుల (ఎమ్‌టి) కు (తాత్కాలికం) చేరుకొన్నది; అంత క్రితం సంవత్సరం ఏప్రిల్ లో ఇది 73.26 ఎమ్‌టి గా ఉంది. అంటే గత ఏడాది తో పోల్చి చూసినప్పుడు బొగ్గు ఉత్పత్తి లో 7.41 శాతం మేరకు వృద్ధి రేటు నమోదు అయిందన్న మాట. 2024 ఏప్రిల్ మాసం లో కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) 61.78 ఎమ్‌టి ల (తాత్కాలికం) బొగ్గు ఉత్పాదన ను సాధించింది. నిరుడు అదే కాలం లో నమోదు చేసిన 57.57 ఎమ్‌టి తో పోల్చినప్పుడు సిఐఎల్ బొగ్గు ఉత్పాదన లో 7.31 శాతం మేరకు వృద్ధి ఉంది. దీనికి అదనం గా, కేప్టివ్/ఇతరత్రా మాధ్యాల ద్వారా బొగ్గు ఉత్పాదన 2024 ఏప్రిల్ నెల లో 11.43 ఎమ్‌టి (తాత్కాలిక అంచనా) గా ఉంది. అది అంతకు ముందు సంవత్సరం లోని 10.12 ఎమ్‌టి కంటే 12.99 శాతం వృద్ధి ని సూచిస్తున్నది.

 

 

ఏప్రిల్ 2024 లో భారతదేశం యొక్క బొగ్గు తరలింపు 85.10 ఎమ్‌టి (తాత్కాలికం) వరకు చేరుకొంది; అది అంతక్రితం సంవత్సరం అదే కాలం తో పోల్చినప్పుడు 6.07 శాతం ఎక్కువగా ఉంది; గత సంవత్సరం ఏప్రిల్ లో 80.23 ఎమ్‌టి గా నమోదు అయింది. సిఐఎల్ 2024 ఏప్రిల్ మాసం లో 64.26 ఎమ్‌టి (తాత్కాలికం) బొగ్గు ను డిస్పాచ్ చేసింది. అది అంతక్రితం సంవత్సరం లో ఇదే కాలం తో పోల్చినప్పుడు వృద్ధి 3.18 శాతం ఉంది. మరి ఇది అప్పట్లో 62.28 ఎమ్‌టి మేరకు ఉండింది. ఏప్రిల్ లో కేప్టివ్/ఇతరత్రా మాధ్యాల ద్వారా బొగ్గు తరలింపు 15.16 ఎమ్‌టి (తాత్కాలికం) స్థాయి లో ఉంటే, అది పూర్వపు సంవత్సరం లో నమోదు అయిన 11.95 ఎమ్‌టి స్థాయి కంటే 26.90 శాతం వృద్ధి ని సూచిస్తున్నది.

 

 

 

***


(रिलीज़ आईडी: 2019701) आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil