రక్షణ మంత్రిత్వ శాఖ
లక్షద్వీప్ లో ఒకసూపర్-స్పెశలిస్ట్ మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేయడం లో సాయపడ్డ భారతీయ కోస్తా తీరరక్షక దళం
Posted On:
30 APR 2024 4:32PM by PIB Hyderabad
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ లోని మారుమూల ద్వీపాలు కవరత్తి లోను, అంద్రోత్ లోను 2024 ఏప్రిల్ 29 వ తేదీ మరియు 30 వ తేదీ లలో ఒక వైద్య చికిత్స శిబిరాన్ని ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ యొక్క సహకారం తో మరియు ఆ కేంద్ర పాలిత ప్రాంతాని కి చెందిన పాలన యంత్రాంగం యొక్క సమర్థన తో భారతీయ కోస్తా తీర రక్షక దళం (ఐసిజి) నిర్వహించింది. ఈ శిబిరం లో ఒక్కొక్క దీవి కి చెందిన సుమారు 1,500 మంది పౌరుల కు నిపుణుల సంప్రదింపుల ను అందించడం తో పాటుగా అవసరమైనటువంటి మందుల ను కూడా ఉచితం గా సమకూర్చడమైంది.
స్త్రీ రోగ శాస్త్రం, శిశు వైద్యం, నాడీశాస్త్రం, చర్మ సంబంధి వైద్య శాస్త్రం, ఎముకల సంబంధి వైద్యం లతో పాటు మరిన్ని విభాగాల కు చెందిన 15 మంది వైద్య నిపుణుల తో కూడినటువంటి వైద్య చికిత్స జట్టు కు ఎఐఐఎమ్ఎస్ దిల్లీ యొక్క సంచాలకుడు డాక్టర్ శ్రీ ఎమ్. శ్రీనివాస్ నేతృత్వం వహించారు. మారుమూల ద్వీపాల లో ప్రజల కు సూపర్ స్పెశలిస్ట్ మెడికల్ కవరేజి ని అందజేయడం తో పాటు ఆయా రంగాల నిపుణుల తో వారికి అవసరమైన సూచనల ను, సలహాల ను ఇవ్వడం పై ఈ వైద్య శిబిరం శ్రద్ధ వహించింది. ఆ ప్రాంతాల లో వైద్య సంబంధి మౌలిక సదుపాయాల తాలూకు ప్రమాణాల ను పెంపొందించడం కోసం స్థానిక వైద్య వృత్తి నిపుణుల కు మౌలిక ప్రాణాధార (బిఎల్ఎస్) సంబంధి ఉపన్యాసాల ను కూడా వారు ఇచ్చారు.
ఈ శిబిరాన్ని కమాండర్ కోస్ట్ గార్డ్ రీజియన్ (వెస్ట్) యొక్క ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ భీషమ్ శర్మ, సర్జన్ కమోడోర్ దివ్య గౌతమ్ గారు, విఎస్ఎమ్, ప్రిన్సిపల్ డైరెక్టర్ (మెడికల్ సర్వీసెస్), సిజిహెచ్‌క్యు లతో పాటు కేంద్ర పాలిత ప్రాంత పాలన యంత్రాంగం యొక్క ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ అవినాశ్ కుమార్, ఐఎఎస్ ల సమక్షం లో డాక్టర్ శ్రీ ఎమ్. శ్రీనివాస్ ప్రారంభించారు.
**
(Release ID: 2019250)