సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒక క్రొత్త గుర్తింపు చిహ్నాన్ని మరియు ఆదర్శ  వాక్యాన్ని స్వీకరించిన ఇండియన్ హిస్టారికల్ రికార్డ్ ‌స్కమిశన్ (ఐహెచ్ఆర్‌సి)


ఐహెచ్ఆర్‌సి కి గుర్తింపు చిహ్నాన్ని మరియు ఆదర్శవాక్యాన్ని రూపొందించేందుకు పెట్టిన పోటీ లో విజేత ల పేరుల ను ప్రకటించడమైంది

Posted On: 25 APR 2024 2:41PM by PIB Hyderabad

పాత దస్తావేజు ల సంబంధి వ్యవహారాల లో సలహాల ను ఇచ్చేటటువంటి అత్యున్నత సంస్థ ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిశన్ (ఐహెచ్ఆర్‌సి). ఈ సంస్థ ప్రాచీన ప్రతుల సంరక్షణ మరియు చారిత్రిక పరిశోధన కోసం వాటిని ఉపయోగించే విషయం లో భారత ప్రభుత్వానికి సలహాల ను సూచనల ను ఇవ్వడం కోసం రచయితలు, సంరక్షకులు మరియు ప్రాచీన దస్తావేజుల ను ఉపయోగించుకొనే వారి కి ఉద్దేశించిన ఒక అఖిల భారతీయ స్థాయి వేదిక వలె పనిచేస్తూ ఉంది. ఈ సంస్థ ను 1919 వ సంవత్సరం లో ఏర్పాటు చేయడమైంది. ఐహెచ్ఆర్‌సి కి సంస్కృతి మంత్రిత్వ శాఖ నాయకత్వాన్ని వహిస్తోంది.

 

 

ఐహెచ్ఆర్‌సి యొక్క విశిష్టమైన గుర్తింపు ను మరియు ఆ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యత ను గురించిన అవగాహన ను ప్రజల లో వ్యాప్తి చేయడం కోసం ఒక గుర్తింపు చిహ్నాన్ని మరియు ఒక ఆదర్శ వాక్యాన్ని పంపండంటూ పిలుపు ను ఇవ్వడమైంది. ఇందుకోసం 2023 వ సంవత్సరం లో మైగవ్ పోర్టల్ (MyGov portal) లో ఒక ఆన్ లైన్ పోటీ ని ప్రారంభించడమైంది. ఈ ఆహ్వానాని కి ప్రతిస్పందన గా మొత్తం 436 దరఖాస్తు లు అందాయి.

 

 

ఈ పోటీ లో దిల్లీ కి చెందిన శ్రీ శౌర్య ప్రతాప్ సింహ్ దాఖలు చేసిన ఈ క్రింది గుర్తింపు చిహ్నం మరియు ఆదర్శ వాక్యం లతో కూడిన ఎంట్రీ ని విజేత గా ఎంపిక చేయడమైంది :

 

 

 

 

ఈ గుర్తింపు చిహ్నం ఐహెచ్ఆర్‌సి యొక్క ప్రధాన ఉద్దేశ్యాన్ని మరియు విశిష్ఠత ను పూర్తి గా ప్రస్ఫుటం చేస్తున్నది. తామర పూవు రేకుల ఆకృతి లో ఉన్న పుట లు ఐహెచ్ఆర్‌సి చారిత్రక రికార్డుల నిర్వహణ లో ఎదురయ్యే ఆటుపోటుల ను తట్టుకొని నిలబడగలిగే నోడల్ సంస్థ గా చాటి చెబుతున్నాయి. మధ్య లో చిత్రించిన సారనాథ్ స్తంభం భారతదేశం యొక్క వైభవోపేతమైన గత కాలాని కి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ బొమ్మ కు ఎంచుకొన్న గోధుమ వన్నె సంస్థ యొక్క ధ్యేయం అయినటువంటి భారతదేశ చారిత్రక రికార్డుల ను సంరక్షించడం, అధ్యయనం చేయడం మరియు గౌరవించడం అనే టటువంటి కమిశన్ యొక్క మిశను ను సుదృఢం చేస్తోంది.

 

 

ఆదర్శ వాక్యం యొక్క అనువాదాన్ని చూశామంటే ‘‘ఎక్కడైతే చరిత్ర భవిష్యత్తు కోసం పదిలం గా ఉందో.’’ అనే భావం దీనిలో వ్యక్తమవుతున్నది. ఈ ఆదర్శ వాక్యం ఐహెచ్ఆర్‌సి అన్నా, ఐహెచ్ఆర్‌సి యొక్క కృషి అన్నా గొప్ప ప్రాధాన్యం కలిగిందిగా ఉందని చాటుతోంది. ఐహెచ్ఆర్‌సి చారిత్రిక దస్తావేజు లు, లిఖిత ప్రతులు మరియు చారిత్రిక సమాచారం యొక్క ఇతర సాధనాల ను గుర్తించడం, సేకరించడం, వాటిని పట్టికీకరించడం లతో పాటు సంబాళించడం లో కీలకమైన భూమిక ను పోసిస్తున్నది. ఈ విధుల ను నిర్వర్తించడం ద్వారా కమిశన్ భావి తరాల వారి కోసం విలువైన చారిత్రిక జ్ఞానాన్ని సంరక్షించేందుకు పూచీ పడుతున్నది. ఈ కారణం గా ఈ యొక్క ఆదర్శ వాక్యం చారిత్రిక దస్తావేజు పత్రాల ను సురక్షితం గా ఉంచడం మరియు వాటిని వర్తమాన తరం, ఇంకా భవిష్యత్తు తరం లకు చెందిన ప్రజల ప్రయోజనం కోసం అందుబాటు లో ఉండేటట్లుగా చూడాలన్న కమిశన్ యొక్క నిబద్ధత ను తెలియజేస్తున్నది.

 

 

గుర్తింపు చిహ్నం మరియు ఆదర్శ వాక్యం లకు గాను ఈ క్రింద ప్రస్తావించిన ఎంట్రీల కు చెరొక విభాగం లోను నాలుగేసి కన్సొలేశన్ బహుమతుల ను ప్రకటించడమైంది:

 

గుర్తింపు చిహ్నం విభాగం లో విజేతలు:

1. మనస్వీ చంద్ వాస్కర్ గారు (ఇందౌర్, మధ్య ప్రదేశ్))

2. దీపిక మండల్ గారు (బెంగళూరు, కర్నాటక)

3. నోనంద వర్మ గారు (జోధ్‌పుర్, రాజస్థాన్)

4. శివాంశీ చౌహాన్ గారు (చుట్టమల్ పుర్, ఉత్తరాఖండ్)

 

ఆదర్శ వాక్యం విభాగం లో విజేతలు:

 

1. జస్‌నీత్ కౌర్ గారు (ఎస్ఎఎస్ నగర్, పంజాబ్)

2. శ్రీ నరేశ్ అగ్రవాల్ (ఇందౌర్, మధ్య ప్రదేశ్)

3. శ్రీ రాజు చటర్జీ (కోల్ కాతా, పశ్చిమ బంగాల్)

4. శ్రీ రింకల్ (భరూచ్, గుజరాత్)

 

విజేత గా ఎంపిక అయిన ఎంట్రీ కి 50,000 రూపాయల బహుమతి సొమ్ము ను ఇవ్వడం జరుగుతుంది. అధికార చిహ్నం మరియు ఆదర్శ వాక్యం విభాగాల లో తాత్కాలికం గా ఎంపిక చేసిన ఎంట్రీల కు ప్రతి ఒక్క ఎంట్రీ కి 5,000 రూపాయల వంతు న కన్సొలేశన్ బహుమతుల ను ఇవ్వడం జరుగుతుంది.

***


(Release ID: 2018940) Visitor Counter : 148