భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పిఎల్ఐ ఎసిసి పథకం లో భాగం గా పది గీగావాట్ అవరర్ సామర్థ్యాన్నికలిగివుండే అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) తయారీ సదుపాయాల ను నెలకొల్పడానికి వేలందారు ల ఎంపిక కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక గ్లోబల్ టెండర్ ను పిలవగా, ఏడు బిడ్ లు వచ్చాయి
పది జిడబ్ల్యుహెచ్ సామర్థ్యం కోసం అంతకు ఏడు రెట్లసామర్థ్యం స్థాపనకై బిడ్ లు వచ్చాయి, అంటే పరిశ్రమ నుండి ఈ పథకాని కి ఇదివరకు ఎరుగనంత ప్రతిస్పందన వచ్చినట్లన్నమాట
భారతదేశం లో టెక్నాలజీ ఎగ్నోస్టిక్ అడ్వాన్స్ డ్కెమిస్ట్రీ సెల్స్ తయారీ ని పిఎల్ఐ ఎసిసి పథకం ప్రోత్సహిస్తుంది
Posted On:
23 APR 2024 1:32PM by PIB Hyderabad
పది గీగా వాట్ అవర్స్ (జిడబ్ల్యుహెచ్) ఉత్పాదన సామర్థ్యాన్ని కలిగివుండేటటువంటి అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) తయారీ కై ఉత్పాదన తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల (పిఎల్ఐ) యొక్క రీబిడ్డింగ్ కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్ఐ) 2024 జనవరి 24 వ తేదీ నాడు ప్రకటించిన గ్లోబల్ టెండర్ కు ఏడు వేలందారు సంస్థ ల వద్ద నుండి బిడ్స్ అందాయి. ప్రీ-బిడ్ మీటింగ్ ను 2024 ఫిబ్రవరి 12 వ తేదీ నాడు నిర్వహించడమైంది. సిపిపి పోర్టల్ లో దరఖాస్తుల స్వీకరణ కు చివరి తేదీ 2024 ఏప్రిల్ 22 కాగా టెక్నికల్ బిడ్స్ ను 2024 ఏప్రిల్ 23 వ తేదీ న తెరవడమైంది.
ఈ టెండరు కు స్పందించి బిడ్ లను దాఖలు చేసిన బిడ్డర్ ల జాబితా లో (ఇంగ్లీషు అక్షరమాల ప్రకారం చూస్తే) ఎసిఎమ్ఇ క్లీన్ టెక్ సాల్యూశన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమర రాజా అడ్వాన్స్ డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, అన్వి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, జెఎస్‌డబ్ల్యు నియో ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లుకాస్ టివిఎస్ లిమిటెడ్ లతో పాటు, వారీ ఎనర్జీస్ లిమిటెడ్ లు 70 జిడబ్ల్యుహెచ్ ఉత్పాదన సామర్థ్యం కలిగి ఉండే యూనిట్ లను ఏర్పాటు చేస్తామంటూ ముందుకు వచ్చాయి.
మొత్తం 18,100 కోట్ల రూపాయల వ్యయం తో ఏభై జిడబ్ల్యుహెచ్ ఉత్పాదన సామర్థ్యాన్ని సాధించడం కోసం ఉద్దేశించినటువంటి ‘నేశనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్’ కు సంబంధించి ఒక ఎగ్నోస్టిక్ పిఎల్ఐ స్కీము కు 2021 వ సంవత్సరం మే నెల లో మంత్రిమండలి ఆమోదాన్ని తెలిపింది. ఎసిసి పిఎల్ఐ బిడ్డింగ్ లో ఒకటో విడత ప్రక్రియ 2022 మార్చి నెల లో ముగిసింది. మూడు లబ్ధిదారు సంస్థల కు మొత్తం ముప్ఫై జిడబ్ల్యుహెచ్ ఉత్పదన సామర్థ్యాన్ని కేటాయించడమైంది. ఎంపిక చేసిన సంస్థల తో 2022 జులై నెల లో ఒప్పందాన్ని కుదుర్చుకోవడమైంది.
దీనికి అదనం గా, మొత్తం పది జిడబ్ల్యుహెచ్ ఉత్పాదన సామర్థ్యాన్ని కలిగి ఉండే ఎసిసి తయారీ యూనిట్టు ల ఏర్పాటు కు గరిష్ఠం గా 3,620 కోట్ల బడ్జెటరీ అవుట్ లే ను ప్రతిపాదిస్తూ భారత ప్రభుత్వం లోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘నేశనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్’ లో భాగం గా బిడ్డర్ ల తాత్కాలిక ఎంపిక కోసం 2024 జనవరి 24 వ తేదీ నాడు ఒక రిక్వెస్ట్ ఫార్ ప్రపోజల్ (ఆర్ఎఫ్‌పి) ను విడుదల చేసింది.
***
(Release ID: 2018600)
Visitor Counter : 158