మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

వెట‌ర్న‌రీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు 11మంది స‌భ్యుల ఎన్నిక‌కు తేదీల‌ను ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

Posted On: 20 APR 2024 2:01PM by PIB Hyderabad

ఇండియ‌న్ వెట‌ర్న‌రీ కౌన్సిల్ రూల్స్ (భార‌తీయ ప‌శువైద్య మండ‌లి నిబంధ‌న‌లు) 1985లోని 10&11 నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇండియ‌న్ వెట‌ర్న‌రీ కౌన్సిల్ చ‌ట్టం, 1984 లోని (52 ఆఫ్ 1984)లోని సెక్ష‌న్‌ (3)లోని క్లాజ్ (జి)తో చ‌దివే సెక్ష‌న్ 4 ద్వారా వెట‌రిన‌రీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు 11మంది స‌భ్యుల ఎన్నిక‌ల‌ను 25 అక్టోబ‌ర్ 2023న ఎస్ఒ 4701 (ఇ) నోటిఫికేష‌న్ ద్వారా ప్ర‌క‌టించింది.
 ఇప్పుడు గౌర‌వ ఢిల్లీ హైకోర్టు రిట‌ర్నింగ్ అధికారిని నియ‌మించ‌డంతోచ ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట‌ర్‌లో  న‌మోదు చేసుకున్న భార‌తీయ వెట‌ర్న‌రీ ప్రాక్టిష‌న‌ర్ల నుంచి అభ్య‌ర్ధులను ఎన్నిక చేసుకునేందుకు దిగువ‌న పేర్కొన్న తేదీల‌ను ప్ర‌క‌టించారు.

కార్య‌క్ర‌మం                                      తేదీ, స‌మ‌యం  

నామినేష‌న్ల‌కు తేదీ           20.04.2024 (శ‌నివారం) - 26.04.2024 (శుక్ర‌వారం)  
                                                                      ఉ.10.00 -     సా. 5.00

నామినేష‌న్ల స్క్రూటినీ      01.05.2024   (బుధ‌వారం)   ఉ.10.00 -    సా. 5.00

నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ     03.05.2024 (శుక్ర‌వారం)  సా. 5.00 వ‌ర‌కు

పోలింగ్ తేదీ                     08.06.2024  (శ‌నివారం)  ఉ.7.00 -     సా. 7.00

ఓట్ల కౌంటింగ్‌,  ఫ‌లితాల ప్ర‌క‌ట‌న   09.06.2024 (ఆదివారం) ఉ. 10.30 నుంచి

వెట‌ర్న‌రీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్నిక‌ల‌లో పోటీ చేసేందుకు అర్హులైన అభ్య‌ర్ధులు త‌మ నామినేష‌న్ల‌ను సూచించిన ఫార‌మ్ ప్ర‌కారం ఆషా మీన‌న్ (రిటైర్డ్‌)కు,  న్యూఢిల్లీలోని జ‌న్‌ప‌థ్ రోడ్డులోని చంద్ర‌లోక్ బిల్డింగ్‌, కేబిన్ నెం.5లో గ‌ల  మ‌త్స‌, ప‌శు సంవ‌ర్ధ‌క, పాడి మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ప‌శుసంవ‌ర్ధ‌క‌, పాడి శాఖ విభాగానికి  రిట‌ర్నింగ్ అధికారికి సూచించిన తేదీ, స‌మ‌యంలో రోజున లేదా అంత‌క‌న్నా ముందే పంప‌వ‌చ్చు లేదా బ‌ట్వాడా చేయ‌వ‌చ్చు. 
అర్హులైన అభ్య‌ర్ధులు త‌మ నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆన్‌లైన్ ( అభ్య‌ర్ధి, స‌మ‌ర్ధించేవారు/  సెకెండ‌ర్ స్ప‌ష్ట‌మైన సంత‌కం క‌లిగిన స్కాన్డ్ కాపీ)ని రిట‌ర్నింగ్ అధికారికి ro.vcielection[at]gmail[dot]com అన్న ఇమెయిల్ అధికారికి నామినేష‌న్ల ఆఖ‌రితేదీన సాయంత్రం 5.00 గంట‌ల‌క‌ల్లా పంప‌వ‌చ్చు. అయితే, 26.04.2024న సాయంత్రం 5.00 గం.ల త‌ర్వాత వ‌చ్చిన ఏ నామినేష‌న్‌నూ స్వీక‌రించ‌డం జ‌రుగ‌దు.
ఈ విష‌య‌మై గెజెడ్ నోటిఫికేష‌న్ త్వ‌ర‌లో జారీ కానుంది. ప‌శుసంవ‌ర్ధ‌క‌, పాడి విభాగం వెబ్‌సైట్‌లోనూ, ఎక్ట్రార్డిన‌రీ గెజెట్ ఆఫ్ ఇండియాలోనూ ప్ర‌చురితం కానున్న నోటిఫికేష‌న్‌ను అంద‌రూ చూడ‌వ‌ల‌సిందిగా విజ్ఞ‌ప్తి. 


***



(Release ID: 2018554) Visitor Counter : 58