రక్షణ మంత్రిత్వ శాఖ
స్వదేశీ సాంకేతికపరిజ్ఞానం తో రూపొందించిన క్రూజ్ క్షిఫణి ని ఒడిశా కోస్తాతీరాని కి ఆవల విజయవంతంగాపరీక్షించిన డిఆర్ డిఒ
Posted On:
18 APR 2024 3:38PM by PIB Hyderabad
దేశీయ సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన క్రూజ్ మిసైల్ (ఐటిసిఎమ్) ప్రయోగ పరీక్ష ను రక్షణ రంగ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఒ) ఒడిశా తీరప్రాంతాని కి ఆవల ఉన్న చాందీపుర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుండి 2024 ఏప్రిల్ 18వ తేదీ నాడు విజయవంతం గా నిర్వహించింది. ఈ పరీక్ష లో భాగం గా, క్షిపణి లోని ఉప వ్యవస్థ లు అన్నీ కూడాను వాటి విధుల ను అంచనా ల మేరకు నెరవేర్చాయి. క్షిపణి పనితీరు ను రేడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రేకింగ్ సిస్టమ్ (ఇఒటిఎస్)లతో పాటు ప్రయోగ పథాన్ని పూర్తి గా పర్యవేక్షించడం కోసమని వేరు వేరు ప్రదేశాల లో టెలిమెట్రీ (రిమోట్ సోర్సెస్ నుండి డేటా మాపనం మరియు తంత్రిరహిత పద్ధతి లో ట్రాన్స్ మిశన్) ని ఐటిఆర్ చేత మోహరింప చేయడం, ఇంకా మరికొన్ని రేంజ్ సెన్సర్ ల ద్వారా పర్యవేక్షించడమైంది. ఈ క్షిపణి పయనించిన మార్గాన్ని భారతీయ వాయు సేన కు చెందిన ఎస్ యు-30-ఎమ్ కె-I యుద్ధ విమానం లో నుండి సైతం పర్యవేక్షించడమైంది.
నిర్దిష్ట బిందువుల ను అనుసరిస్తూ పోయి, క్షిపణి తనకు ఆజ్ఞాపించిన మార్గం లో సముద్ర ఉపరితలం మీద చాలా తక్కువ ఎత్తు లో ప్రయాణం చేసింది. బెంగళూరు కు చెందిన గేస్ టర్బయిన్ రిసర్చ్ ఎస్టాబ్లిశ్ మెంట్ (జిటిఆర్ఇ) అభివృద్ధి పరచిన ఎగదోసే వ్యవస్థ ను క్షిపణి లో అమర్చారు. ఈ వ్యవస్థ కూడాను పరీక్షపూర్వక విన్యాసం లో నమ్మదగిన రీతి లో పనిచేసింది.
మెరుగైనటువంటి మరియు ఆధారపడదగినటువంటి పనితీరు ను ఈ క్షిపణి కనబరచేటట్టుగా ఆధునిక ఎలక్ట్రానిక్ సామగ్రి ని కూడా క్షిపణి కి జతపరచడమైంది. క్షిపణి ని బెంగళూరు కేంద్రం గా కార్యకలాపాల ను నిర్వహిస్తున్నటువంటి డిఆర్ డిఒ లబారటరి లోని ఎయర్ నాటికల్ డివెలప్ మెంట్ ఎస్టాబ్లిశ్ మెంట్ (ఎడిఇ) ఇతర ప్రయోగశాల ల యొక్క మరియు భారతదేశం లోని పరిశ్రమల యొక్క తోడ్పాటు ను తీసుకొని అభివృద్ధి పరచింది. ఈ పరీక్ష ప్రక్రియ ను వివిధ డిఆర్ డిఒ లబారటరి ల సీనియర్ శాస్త్రవేత్తలు, ఇంకా ఉత్పత్తి ప్రక్రియ లో భాగస్వామిగా ఉన్న సంస్థ ప్రతినిధులు వీక్షించారు.
ఐటిసిఎమ్ ప్రయోగ పరీక్ష ను ఫలప్రదం గా నిర్వహించినందుకు గాను డిఆర్ డిఒ కు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ అభినందనల ను తెలియ జేశారు. దేశవాళీ ఎగదోత వ్యవస్థ యొక్క అండ దండల తో దూర ప్రాంత సబ్ సానిక్ క్రూజ్ మిసైల్ ను అభివృద్ధి పరచడం భారతదేశం లో రక్షణ రంగ పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ ఎండ్ డి) ల పరం గా చూసినప్పుడు ఒక ప్రధాన మైన మైలురాయి వంటి పరిణామం అని మంత్రి స్పష్టం చేశారు.
ఐటిసిఎమ్ సఫల పరీక్ష కార్యక్రమానికి గాను డిఆర్ డిఒ కు చెందిన యావత్తు జట్టు సభ్యుల ను రక్షణ రంగ పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ ఎండ్ డి) విభాగం కార్యదర్శి , డిఆర్ డిఒ చెయర్ మన్ డాక్టర్ శ్రీ సమీర్ వి. కామత్ అభినందించారు.
***
(Release ID: 2018183)
Visitor Counter : 327