రక్షణ మంత్రిత్వ శాఖ
కారవార కు ఆవల నిస్సహాయస్థితి ని ఎదుర్కొన్న ఒక చేపలు పట్టే నావ ను కాపాడిన భారతీయ కోస్తా తీర రక్షక దళం
प्रविष्टि तिथि:
16 APR 2024 4:21PM by PIB Hyderabad
కర్నాటక లోని కారవార కు ఆవల సముద్రం లో సుమారు 215 మైళ్ళ దూరాన ఇంజను పాడైపోయి పనిచేయని స్థితి లో చిక్కుకున్న ఇండియన్ ఫిశింగ్ బోట్ (ఐఎఫ్‌బి) రోజరీ ని ఇండియన్ కోస్ట్ గార్డు (ఐసిజి) 2024 ఏప్రిల్ 16 వ తేదీ నాడు విజయవంతం గా రక్షించింది. ఐఎఫ్‌బి రోజరీ లో ఉన్న వారు 2024 ఏప్రిల్ 13 వ తేదీ నాడు తమను ఆదుకోవాలంటూ పంపించిన సందేశాని కి భారతీయ తీర రక్షకదళానికి చెందిన సావిత్రిబాయి ఫులే నౌక లోని సిబ్బంది వెనువెంటనే ప్రతిస్పందించి, సముద్రం లో ప్రతికూల పరిస్థితి నడుమ నావ లోని వారి తో సమాచార సంబంధాన్ని శీఘ్రం గా ఏర్పరచుకోగలిగింది.
నిర్దిష్ట ప్రాంతాని కి ఐసిజి సావిత్రిబాయి ఫులే నౌక చేరుకోవడం తో, ఆ నౌక కు చెందిన బోర్డింగ్ టీము సభ్యులు నావ లో ఇంజను యొక్క వైఫల్యాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే, వారి ప్రయాస లు ఫలించలేదు; నావ కదలడానికి మొరాయించింది. తదనంతరం, ఆ చేపలు పట్టే నావ ను కోస్ట్ గార్డ్ జిల్లా ప్రధాన కేంద్రం (కర్నాటక) కు చెందిన మత్స్య పాలన విభాగం సహకారం తో నావ ను తాడు తో లాగుతూ కారవార కు తీసుకు పోయి ఐఎఫ్‌బి శ్రీ లక్ష్మీ నారాయణ్ కు అప్పగించడమైంది. అది కాస్తా వారిని భద్రం గా కార్‌వార్ నౌకాశ్రయాని కి చేర్చింది.
***
(रिलीज़ आईडी: 2018055)
आगंतुक पटल : 228