రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతిని కలిసిన సీపీడబ్ల్యూ డీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల బృందం

Posted On: 28 MAR 2024 2:55PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతి భవన్ లో సిపిడబ్ల్యుడి (2022, 2023 బ్యాచ్) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల బృందం ఈ రోజు (మార్చి 28, 2024) కలిసింది.  సందర్భాగం  ఇంజనీర్ల బృందాన్ని ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి  వాతావరణ మార్పులు, భూతాపం వల్ల కలిగే  ముప్పు గుర్తించి  ఇంధన సమర్థ పరిష్కార మార్గాలను యువ ఇంజినీర్లు అవలంబించి పని చేయాలని సూచించారు. ఎక్కువ కాలం మన్నే విధంగా  ఇంధన సమర్థత కలిగిన, పర్యావరణ అనుకూల పటిష్టమైన భవనాలు, రహదారులు  ఇతర మౌలిక సదుపాయాలు రూపొందించడానికి కుర్షి జరగాలన్నారు. వినూత్నంగా ఆలోచించి  సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోడానికి కృషి చేయాలన్నారు.  త్రీడీ ప్రింటింగ్ యుగంలో బిల్డింగ్ టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయని రాష్ట్రపతి అన్నారు.పర్యావరణహిత, ఇంధన సామర్థ్యం కలిగిన  మౌలిక సదుపాయాలు, నిర్మాణ ప్రాజెక్టులను నిర్మించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్న రాష్ట్రపతి  హరిత నిర్మాణం నేటి అవసరం అని స్పష్టం చేశారు. నిర్మాణంలో వినూత్న పద్ధతులు అనుసరించి నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలని ఆమె  ఇంజనీర్ల బృందం సభ్యులకు హితవు పలికారు. 

 కచ్చితత్వంతో డిజైన్లు రూపొందించడం ద్వారా సంప్రదాయ నిర్మాణ పద్ధతులకు బిన్నంగా నిర్మాణ కార్యక్రమాలు జరగాలని రాష్ట్రపతి అన్నారు. దీనివల్ల   నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి,  కాకుండా,వ్యర్థాలను తగ్గించి గరిష్ట వనరుల వినియోగం కోసం ఇంజనీర్లు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి అన్నారు. 

ఒంటరిగా కాకుండా  సహకార, ముందుచూపు, టెక్నాలజీ ఆధారిత విధానాన్ని అవలంబించాలని ఇంజనీర్లకు రాష్ట్రపతి సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోలు, డ్రోన్ వంటి కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల   సంప్రదాయ ఆలోచనలకు విఘాతం కలుగుతోందని  ఆమె అన్నారు. అయితే,  సామర్థ్యాన్ని పెంచడానికి, మెరుగుపరచడానికి, ప్రక్రియల యాంత్రీకరణ, వనరుల వినియోగ సామర్ధ్యం పెంపొందించి,   ఉత్పాదకతను పెంచడానికి, వనరుల నిర్వహణను మెరుగుపరచడానికి నూతన  సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని రాష్ట్రపతి అన్నారు. . మెరుగైన, పచ్చని, సుస్థిర భవిష్యత్తును సృష్టించడానికి అర్థవంతమైన సహకారం అందించాలని ఇంజనీర్లకు రాష్ట్రపతి సలహా ఇచ్చారు. 

రాష్ట్రపతి ప్రసంగం కోసం

***



(Release ID: 2016568) Visitor Counter : 122