కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

పేరోల్ డేటా: 2024 జనవరి లో ఈపీఎఫ్ఓ లో కొత్తగా చేరిన 16.02 లక్షల నికర చందాదారులు


2024 జనవరి నెలలో ఈపీఎఫ్ఓ సభ్యత్వం పొందిన 8.08 లక్షల మంది

Posted On: 24 MAR 2024 8:15PM by PIB Hyderabad

ఈపీఎఫ్ఓ తాత్కాలిక పేరోల్ వివరాలు 2024 మార్చి 24న విడుదల అయ్యాయి. తాజా వివరాల ప్రకారం 2024 జనవరి నెలలో ఈపీఎఫ్ఓ లో 16.02 లక్షల నికర చందాదారులు   చేరారు. 2024 జనవరి నెలలో 8.08 లక్షల మంది  ఈపీఎఫ్ఓ సభ్యత్వం పొందారు. సభ్యత్వం పొందిన వారిలో 18-25 మధ్య వయస్సు ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 2024 జనవరి లో  ఈపీఎఫ్ఓ సభ్యత్వం తీసుకున్న వారిలో 18-25 మధ్య వయస్సు ఉన్న వారి సంఖ్య 56.41%గా ఉంది. ఈ వివరాలు పరిశీలిస్తే యువత పెద్ద సంఖ్యలో ఉపాధి పొంది సంఘటిత ఉపాధి రంగంలో ప్రవేశించారు అని  వెల్లడి అవుతుంది. 

సుమారు 12.17  లక్షల మంది సభ్యులు నిష్క్రమించి తిరిగి ఈపీఎఫ్ఓలో చేరారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగాలు మారిన వారు ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థలో చేరి తుది పరిష్కారంగా నిధులు వెనక్కి తీసుకోకుండా తమ సభ్యత్వాన్ని కొనసాగిస్తూ తమ పిఎఫ్ ఖాతాలను వాటిలో ఉన్న మొత్తాన్ని ఇదివరకటి పిఎఫ్   ఖాతా నుంచి ప్రస్తుత పిఎఫ్ ఖాతాకు మళ్ళించు కొనేందుకు ఆసక్తి కనబరిచారు. దీర్ఘ కాల ప్రయోజనాలు, సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి అవుతోంది.   

చందాదారుల సంఖ్యను   లింగాల వారీగా విశ్లేషిస్తే   కొత్త నమోదు అయిన సభ్యుల సంఖ్యలో  మహిళల సంఖ్య 2.05 లక్షలుగా ఉంది. నెలలో చేరిన మొత్తం మహిళల నికర సంఖ్య 3.03 లక్షలుగా ఉంది. పెరిగిన మహిళల సంఖ్య సమీకృత, విభిన్న కార్మిక శక్తిని సూచిస్తుంది. 

పరిశ్రమ వారీగా నెలవారి చేరికలను విశ్లేషించినప్పుడు ఆర్థిక సంస్థలు,ఉత్పత్తి, మార్కెటింగ్, కంప్యూటర్ల వినియోగం, ఆసుపత్రులు లాంటి రంగాల్లో ఉపాధి పొందిన వారి సంఖ్య పెరిగిందని వెల్లడి అవుతుంది. చేరిన మొత్తం నికర సభ్యుల్లో 40.71% మంది నైపుణ్య సేవల ( మానవ వనరులు, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సేవలు, ఇతర సేవలు) రంగంలో ఉన్నారు. 

పేరోల్ వివరాలు తాత్కాలిక ప్రాతిపదికన రూపొందించడం జరుగుతుంది. ఉద్యోగుల రికార్డులను ఎప్పటికప్పుడు నవీనీకరణ చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో పేరోల్ వివరాలు మారుతుంటాయి. 2018 ఏప్రిల్ నుంచి 2017 సెప్టెంబర్ తదుపరి కాలానికి సంబంధించి  పేరోల్ వివరాలను ఈపీఎఫ్ఓ విడుదల చేస్తోంది. ఆధార్ ఆధారంగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) ద్వారా తొలిసారి  ఈపీఎఫ్ఓ సభ్యత్వం పొందిన వారి వివరాలు, ఈపీఎఫ్ఓ నుంచి నిష్క్రమించి తిరిగి చేరిన  వారి వివరాలు ఆధారంగా నెలవారి ఈపీఎఫ్ఓ పేరోల్ సిద్దమవుతుంది. 

 

***



(Release ID: 2016318) Visitor Counter : 93