ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి కి ‘ద ఆర్డర్ ఆఫ్ ద డ్రుక్ గ్యాల్ పో’ ను ప్రదానం చేయడమైంది

Posted On: 22 MAR 2024 6:33PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి భూటాన్ లో అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ద డ్రుక్ గ్యాల్ పోను భూటాన్ యొక్క రాజు గారు థిమ్పూ లోని టెండ్రెల్‌థాంగ్ లో జరిగిన ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని భూటాన్ కట్టబెట్టినటువంటి మొట్టమొదటి విదేశీ నేత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

 

భూటాన్ యొక్క రాజు గారు 2021 వ సంవత్సరం డిసెంబరు లో థిమ్పూ లోని తాశీఛోడ్‌జోంగ్ లో భూటాన్ యొక్క 114 వ జాతీయ దినోత్సవం జరిగిన సందర్భం లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్న సంగతి ని ప్రకటించారు. ఈ పురస్కారం భారతదేశం-భూటాన్ మైత్రి ని సుదృఢం చేయడం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించినటువంటి తోడ్పాటు తో పాటు, ఆయన ప్రజల కు ప్రాముఖ్యాన్ని కట్టబెడుతూ అందించినటువంటి నాయకత్వాని కి మాన్యత ను కట్టబెడుతోంది. ఈ పురస్కారం యొక్క ప్రశస్తి పత్రం లో ఈ పురస్కారాన్ని ప్రధాన మంత్రి యొక్క నాయకత్వం లో భారతదేశం ఒక ప్రపంచ శక్తి గా ఎదిగిన పరిణామాన్ని సమ్మానిస్తోంది అని, అంతేకాకుండా భారతదేశం తో భూటాన్ కు ఉన్న విశిష్ట బంధాన్ని జ్ఞప్తి కి తెచ్చేదిగా కూడ ఈ పురస్కారం నిలుస్తోంది అని పేర్కొనడమైంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క నాయకత్వం భారతదేశాన్ని పరివర్తన బాట లో ముందుకు తీసుకు పోవడం తో పాటు గా భారతదేశం యొక్క నైతిక ఆధిపత్యం మరియు ప్రపంచం లో భారతదేశం ప్రసరిస్తున్న ప్రభావాన్ని కూడా పెంచివేసింది.

 

ఈ పురస్కారం భారతదేశం లోని 1.4 బిలియన్ మంది ప్రజల కు కట్టబెట్టిన గౌరవం, అంతేకాకుండా రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి విశిష్టమైన మరియు అద్వితీయమైన సంబంధాల కు ఒక ప్రమాణం గా కూడాను ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

ఇదివరకు స్థాపించినటువంటి రేంకింగు ను మరియు పరంపర ను అనసరించి, ద ఆర్డర్ ఆఫ్ ద డ్రుక్ గ్యాల్ పోను జీవనకాల సాఫల్యం తాలూకు ఒక అలంకరణ గా నెలకొల్పడమైంది. ఇది భూటాన్ లో ఇచ్చేటటువంటి శిఖర సమానమైనటువంటి సమ్మానం; భూటాన్ లో అన్ని గౌరవాలు, అలంకరణ లు మరియు పతకాల లో ఈ పురస్కారానిదే అగ్ర స్థానం అని చెప్పాలి.

 

***



(Release ID: 2016315) Visitor Counter : 106