విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రిడ్– ఇండియా ఇక మినీ రత్న కంపెనీ

Posted On: 20 MAR 2024 7:21PM by PIB Hyderabad

గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గ్రిడ్ ఇండియా) చెప్పుకోదగిన మైలు రాయిని సాధించింది. ఈ సంస్థ మినీ రత్న1 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజ్ (సిపిఎస్ఇ) గుర్తింపును పొందింది. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖ ఈ గుర్తింపునిచ్చింది. దీనితో దేశ విద్యుత్ రంగంలో గ్రిడ్ ఇండియా కీలకపాత్రను ఇది తెలియజేస్తోంది.

గ్రిడ్ – ఇండియాను 2009 లో ఏర్పాటు చేశారు . భారత విద్యుత్ రంగం నిరంతరాయంగా విద్యుత్ సరఫరాచేసలా పర్యవేక్షించడానికి దీనిని ఏర్పాటు చేశారు. అలాగే వివిధ ప్రాంతాల మధ్య విద్యుత్ను సమర్ధంగా బదిలీ చేయడానికి,  ఇది వీలుకల్పిస్తుంది. నమ్మకమైన విద్యుత్ సరఫరావిద్యుత్ పొదుపుసుస్థిర సరఫరాకు ఇది ఉపకరిస్తుంది.

 ఇది పోటీతత్వంతో కూడినసమర్దమైన విద్యుత్ టోకుమార్కెట్కు  వీలుకల్పించడంతోపాటుసమర్థ పరిష్కార వ్యవస్థను కలిగి ఉంటుంది. దీనికి ఐదు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లు (ఆర్.ఎల్.డి.సిలు) నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్.ఎల్.డి.సి) ఉన్నాయి. ఆలిండియా గ్రిడ్ను నిర్వహించే బాధ్యత గ్రిడ్ – ఇండియా స్వీకరిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద,సంక్లిష్టమైన వ్యవస్థ ఇది.

 

గత కొన్ని సంవత్సరాలుగా గ్రిడ్ –ఇండియా కార్యకలాపాలువిద్యుత్ వ్యవస్థల సమీకృతం కావడంవిద్యుత్ డిమాండ్ పెరుగుదలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరులుఆర్థిక ప్రగతి సాంకేతిక పురోగతి, విద్యుత్ రంగంలో నియంత్రణలుమార్కెట్ తీరుతెన్నులకు అనుగుణంగా విస్తరిస్తూ వస్తున్నాయి.

 

విజ్ఞాన ఆధారిత సంస్థ కావడంతో గ్రిడ్ ఇండియా ,భారత ప్రభుత్వం తనకు అప్పగించిన వివిధ కార్యకలాపాలను సమర్ధంగా నిర్వహిస్తోంది. విద్యుత్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ ఈ సంస్థ ముందుకు పోతున్నది. ప్రాంతీయజాతీయ స్థాయిలో విద్యుత్ వ్యవస్థ కార్యకలాపాలను అనుసంధానం చేయడానికి ఇది కట్టుబడి ఉంది.తద్వారా అత్యంత నమ్మకమైనవిశ్వసనీయమైన రీతిలోపొదుపుగానిరంతరాయ విద్యుత్ సరఫరాకు ఇది వీలుకల్పిస్తున్నది. దీనికి తోడు గ్రిడ్ – ఇండియా స్వతంత్ర కార్యకలాపాల నిర్వహణను చేపట్టడంతో పాటు దీనితో ముడిపడిన అన్ని సంస్థలూ సమాంతరంగా ఎదిగేందుకు ఇది వీలు కల్పిస్తోంది.

****


(Release ID: 2016061) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi , Punjabi