ఆర్థిక మంత్రిత్వ శాఖ
2024 లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 24×7 కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ మొబైల్ నంబర్ 9868168682 ఏర్పాటు చేసిన ఢిల్లీ ఆదాయం పన్నుడైరెక్టరేట్ (ఇన్వెస్టిగేషన్)
కంట్రోల్ రూమ్ ద్వారా ఢిల్లీ ఎన్‌సిటి పరిధిలో నగదు, బంగారం,, విలువైన వస్తువుల అనుమానాస్పద కదలికలు / పంపిణీపై నిఘా, తనిఖీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఢిల్లీలో పనిచేయనున్న కంట్రోల్ రూమ్
Posted On:
20 MAR 2024 5:25PM by PIB Hyderabad
ఎన్నికల్లో నల్లధనం పాత్రను అరికట్టేందుకు భారత ఎన్నికల సంఘం చేస్తున్న కృషికి సహాయపడటానికి ఆదాయపు పన్ను శాఖ చర్యలు ప్రారంభించింది. 2024 లోక్ సభ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికమైన జరిగేలా జరుగుతున్న ప్రయత్నాలకు ప్రజలు తమ వంతు సహకారం అందించేలా చూసేందుకు ఆదాయం పన్ను శాఖ చర్యలు ప్రారంభించింది.
ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో లెక్కలు చూపని నగదు, బంగారం ఇతర విలువైన వస్తువుల కదలికలపై నిఘా ఉంచడానికి ఢిల్లీ ఆదాయం పన్నుడైరెక్టరేట్ (ఇన్వెస్టిగేషన్) పలు ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ ఎన్ సిటి పరిధిలో నగదు, బంగారం,, విలువైన వస్తువుల అనుమానాస్పద కదలికలు / పంపిణీపై నిఘా ఉంచి తనిఖీ నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి.
దీనిలో భాగంగా 24×7 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసిన ఆదాయం పన్ను శాఖ , టోల్ ఫ్రీ మొబైల్ నంబర్ 9868168682 ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సౌకర్యాల ద్వారా అనుమానాస్పద నగదు తరలింపు/పంపిణీకి సంబంధించిన సమాచారం, వివరాలను ఎవ్వరైనా ఆదాయపు పన్ను శాఖకు అందించవచ్చు. కంట్రోల్ రూమ్ వివరాలు:
గది నం. 17, గ్రౌండ్ ఫ్లోర్, C- బ్లాక్, సివిక్ సెంటర్, న్యూఢిల్లీ-110002 టోల్ ఫ్రీ నెంబర్: 1800112300
ల్యాండ్‌లైన్ నంబర్‌లు: 011-23232312/31/67/76 టోల్-ఫ్రీ మొబైల్ నంబర్: 9868168682
నివాసితులు టోల్-ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసేవారు పేరు లేదా ఇతర గుర్తింపు వివరాలు వంటి ఏ వ్యక్తిగత వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉండదు. అందించిన సమాచారం విశ్వసనీయంగా చర్య తీసుకోదగిన సమాచారంగా ఉండాలి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నంత కాలం అంటే 2024 సార్వత్రిక ఎన్నికల ప్రకటన తేదీ నుంచి, ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కంట్రోల్ రూమ్ పని చేస్తుంది. ఢిల్లీ ఎన్‌సిటి పరిధిలో ఎన్నికలు స్వేచ్ఛాగా,సజావుగా జరిగేలా చూసేందుకుప్రజలు తమ వద్ద ఉన్న విశ్వసనీయ సమాచారాన్ని పైన పేర్కొన్న నంబర్‌ల ద్వారా అందించి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని డైరెక్టరేట్ కోరింది. సమాచారం ఇచ్చే వ్యక్తి గుర్తింపు రహస్యంగా ఉంటుంది.
***
(Release ID: 2015815)
Visitor Counter : 93