కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఐ టీ యూ/ ఎఫ్ ఏ ఓ వర్క్‌షాప్ టీ ఈ సీ మరియు ఐకార్ నిర్వహణ లో విజయవంతంగా ముగిసింది


వ్యవసాయ విలువ వ్యవస్థ అంతటా ఏ ఐ, ఐ ఓ టీ, యూ ఏ వీ లు మరియు ఇతర అత్యాధునిక సాంకేతికతల అమలు పై విస్తృత చర్చలు

“విప్లవాత్మక వ్యవసాయం: వ్యవసాయం యొక్క డిజిటల్ పరివర్తన”పై టీ ఈ సీ (డీ ఓ టీ), ఐకార్ సంయుక్తంగా సాంకేతిక నివేదికను విడుదల చేసింది.

Posted On: 20 MAR 2024 5:16PM by PIB Hyderabad

ఐక్యరాజ్యసమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ ఏ ఓ) సహకారంతో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ టీ యూ) భాగస్వామ్యంతో “రేపటి సాగు: ఐ ఓ టీ మరియు ఏ ఐ ద్వారా డిజిటల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం”పై వర్క్‌షాప్ మార్చి 18, 2024న ముగిసింది.ఐకార్ సహకారంతో నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (ఎన్ ఎ ఎస్ సీ), ఐకార్, న్యూఢిల్లీలో  టీ ఈ సీ (డీ ఓ టీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

 

వర్క్‌షాప్‌లో కృత్రిమ మేధ (ఏ ఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ ఓ టీ), మానవరహిత వైమానిక వాహనాలు (యూ ఏ వీ లు) మరియు వ్యవసాయ విలువ గొలుసు అంతటా ఇతర అత్యాధునిక సాంకేతికతలకు సంబంధించిన అమలుపై విస్తృత చర్చలు జరిగాయి. ఉత్పత్తి నుండి వినియోగం వరకు, పంట అనంతర నిర్వహణ మరియు మార్కెటింగ్‌తో సహా పలు అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సాంకేతికతలు నిజసమయ డేటా, పరిణామ అంచనా విశ్లేషణ  తద్వారా ప్రపంచ జనాభా పెరుగుదల మరియు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎలా పరిష్కరించవచ్చు క్రియాత్మక అంతర్దృష్టులతో రైతులను ఎలా శక్తివంతం చేయగలవని పాల్గొనేవారు అన్వేషించారు. 

 

వర్క్‌షాప్ సందర్భంగా, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ (టీ ఈ సీ), టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీ ఓ టీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (డీ ఏ ఆర్ ఈ), వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో "విప్లవాత్మక వ్యవసాయం: వ్యవసాయం యొక్క డిజిటల్ పరివర్తన"పై ఒక సాంకేతిక నివేదికను కూడా సంయుక్తంగా విడుదల చేసింది. ఈ నివేదిక వ్యవసాయ రంగంలోని వాటాదారులకు మంచి సూచనసమాచారం గా ఉపయోగపడుతుంది. ఆహార ఉత్పత్తిలో సుస్థిరత, సామర్థ్యం మరియు సుదృడత కోసం సాంకేతికత యొక్క శక్తిని ఉపయోగించుకోవడంపై నిర్ణయాధికారులకు మార్గనిర్దేశం చేస్తుంది.

 

{మరింత సమాచారం మరియు సాంకేతిక నివేదిక  కోసం, దయచేసి టీ ఈ సీ వెబ్‌సైట్ (https://www.tec.gov.in/) మరియు ఐకార్ వెబ్‌సైట్ (https://www.icar.org.in) సందర్శించండి.}

 

వర్క్‌షాప్ తర్వాత 19 మార్చి 2024న అదే వేదికపై “కృత్రిమ మేధ (ఏ ఐ) మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ ఓ టీ)  డిజిటల్ సాగు ” పై ఐ టీ యూ/ఎఫ్ ఏ ఓ ఫోకస్ గ్రూప్ తొమ్మిదవ సమావేశం జరిగింది.

 

శ్రీ అజయ్ కుమార్ సాహు, సభ్యుడు (సర్వీసెస్) & అదనపు కార్యదర్శి (టీ), డిజిటల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో మరియు గ్రామీణ-పట్టణ డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో టెలికమ్యూనికేషన్స్ కీలక పాత్రను హైలైట్ చేశారు. డిజిటల్ అనుసంధానం, వినూత్న సాధనాలు మరియు నిజ-సమయ మార్కెట్ అందుబాటుతో రైతులకు సాధికారత కల్పించడం, వ్యవసాయ రంగంలో సమ్మిళిత వృద్ధి మరియు సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం భారతదేశం లక్ష్యం అని ఆయన అన్నారు.

 

ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ టీ యూ)  స్టాండర్డైజేషన్ డైరెక్టర్  సీజో ఒనో, ఐ టీ యూతో భారతదేశం యొక్క పెరిగిన అనుబంధం మరియు డిజిటల్ వ్యవసాయం కోసం ప్రభావవంతమైన అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి   వివిధ  నైపుణ్య రంగాల మధ్య వంతెనలను నిర్మించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.

 

శ్రీమతి త్రిప్తి సక్సేనా, సీనియర్ డీ డీ జీ  & హెడ్, టీ ఈ సీ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు ఐ ఓ టీ మరియు ఏ ఐ వంటి సాంకేతికతల సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. సెన్సర్లు మరియు డ్రోన్‌ల వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు ఐ ఓ టీ పరిష్కారాలను ఉపయోగించుకోవడం ద్వారా, రైతులు భూసార పరిస్థితులను పర్యవేక్షించవచ్చు, వనరుల  సద్వినియోగం చేయవచ్చు మరియు పంట దిగుబడిని పెంచుకోవచ్చు, వ్యవసాయంలో సుస్థిరమైన మరియు. అధిక ఉత్పాదకతకు మార్గం సుగమం చేయవచ్చని ఆమె వివరించారు.

 

డాక్టర్ ఎస్ కే చౌదరి, డీ డీ జీ  (ఎన్ ఆర్ ఎం),  ఐకార్  శతాబ్దికి అనుగుణంగా ఈ సంవత్సరం డిజిటల్ సాంకేతికతపై దృష్టి సారించి, ఐ ఓ టీ మరియు ఏ ఐ ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఐకార్ భారతీయ వ్యవసాయ పరిశోధన కోసం నిర్వహిస్తున్న వర్క్‌షాప్ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.

 

వర్క్ షాప్ అనంతరం ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.   ఎగ్జిబిషన్ స్టాల్స్, వ్యవసాయ రంగంలోని వివిధ స్టార్ట్-అప్‌ల ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల యొక్క అమలును ప్రత్యక్షం గా ప్రదర్శించాయి.

 

వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగం 4.0 గురించిన విలువైన అంతర్దృష్టులు మరియు అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం కోసం ఐ టీ యూ సభ్య దేశాలు, సెక్టార్ సభ్యులు, అసోసియేట్స్, ఐ టీ యూ అకాడెమియా, అలాగే ఐ టీ యూ సభ్య దేశాలకు చెందిన వ్యక్తులతో పాటు వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు జాతీయ సంస్థల ప్రతినిధులతో సహా దాదాపు 250 మంది ప్రతినిధులు ప్రత్యక్షంగా మరియు పరోక్షం గా పాల్గొన్నారు. 

 

ఐ ఓ టీ క్షేత్ర సందర్శన మరియు సెన్సార్ లతో నిర్వహించబడే గ్రీన్‌హౌస్ వర్టికల్ ఫామ్, ప్లాంట్ ఫినోమిక్స్ సెంటర్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ డ్రోన్స్ ప్రదర్శన వ్యవసాయం యొక్క భవిష్యత్తును రూపొందించే వినూత్న సాంకేతికతలపై అమూల్యమైన అంతర్దృష్టులను అందించింది. పొలం స్థల సామర్థ్యాన్ని పెంచే నిలువు వ్యవసాయ పద్ధతులను చూడటం నుండి పంట పర్యవేక్షణ మరియు నిర్వహణలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరివర్తన సామర్థ్యాన్ని అనుభవించడం వరకు, ఈ పురోగతి వ్యవసాయ పద్ధతులను ఎలా విప్లవాత్మకంగా మారుస్తుందనే దానిపై ప్రతినిధులు లోతైన అవగాహన పొందారు.

 

***



(Release ID: 2015811) Visitor Counter : 78


Read this release in: English , Urdu , Hindi , Tamil