సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీనగర్‌లో ఆర్కైవిస్ట్‌ల జాతీయ కమిటీ 47వ సమావేశం


ఆర్కైవ్‌లను పునరుజ్జీవింపజేయడానికి మరియు సులభంగా యాక్సెస్ చేయడానికి డిజిటల్ మరియు ఏఐ టెక్నాలజీల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఇది తెలిపింది.

Posted On: 20 MAR 2024 12:53PM by PIB Hyderabad

రెండురోజులపాటు జరిగిన నేషనల్ కమిటీ ఆఫ్ ఆర్కైవిస్ట్స్ (ఎన్‌సిఏ) 47వ సమావేశం 19 మార్చి 2024న శ్రీనగర్‌లోని షేర్-ఇ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఎస్‌కెఐసీసీ)లో ముగిసింది. సదస్సుకు ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ నుండి ప్రతినిధులు వ్యక్తిగతంగా పాల్గొన్నారు. హర్యానా మరియు పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు వర్చువల్ మోడ్‌లో హాజరయ్యారు.

ఈ రెండు రోజుల సమావేశంలో ప్రతినిధులు తమ రాష్ట్రాలు/యూటీలలో ఆర్కైవ్స్ అడ్మినిస్ట్రేషన్ మరియు రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను పునరుద్ధరించడానికి అవసరమైన వివిధ అంశాలపై చర్చించారు మరియు ఈ ప్రయోజనం కోసం డిజిటల్ మరియు ఏఐ టెక్నాలజీల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశ గొప్ప డాక్యుమెంటరీ వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి మరియు వారి ఆర్కైవల్ వనరులను వెబ్-పోర్టల్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయడానికి కేంద్రీకృత మరియు ఏకీకృత విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు.

ప్రతినిధులు రికార్డుల డిజిటలైజేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలు మరియు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపిలు) రూపొందించడంలో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా మార్గదర్శకత్వాన్ని కూడా కోరారు.

రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పబ్లిక్ ఆర్కైవ్‌లలో ఓరల్ ఆర్కైవ్స్ మరియు నాన్-ట్రెడిషనల్‌ ఆర్కైవ్ సోర్స్‌ల ఏకీకరణ వంటి కొత్త రంగాలను కూడా ఎన్‌సిఏ అన్వేషించాలని కూడా సదస్సు అభిప్రాయపడింది.

ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ మరియు ఎన్‌సిఏ ఛైర్మన్ మరియు కన్వీనర్ అయిన శ్రీ అరుణ్ సింఘాల్ తన ప్రసంగంలో..భారతదేశం అంతటా వివిధ రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్కైవ్‌లలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ రికార్డులలో ఉన్న విలువైన సమాచారాన్ని వినియోగదారులు ఇంటర్నెట్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయగలిగేలా చూడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.  ఏదైనా అంశంపై ఏకీకృత శోధన ఫలితాలను అందించడానికి భారతదేశంలోని ఆర్కైవల్ సంస్థల మధ్య సహకారం చాలా ముఖ్యమైనదని, వివిధ రిపోజిటరీలలో ఆర్కైవల్ మెటీరియల్ అందుబాటులో ఉండవచ్చని ఆయన తెలిపారు.

 
image.png


దేశంలోని ఆర్కైవ్‌ల అభివృద్ధికి 10 పాయింట్ల రోడ్‌మ్యాప్‌ను శ్రీ సింఘాల్ సూచించారు. అవి.

(1) మీ వద్ద ఏం ఉందో తెలుసుకోండి

(2) మీ వద్ద ఉన్నది ప్రపంచానికి చెప్పండి,

(3) జాగ్రత్తగా ఉంచండి,

(4) అందుబాటును సులభతరం చేయండి,

(5) మీ సేకరణను డిజిటైజ్ చేయండి,

(6) అవసరమైన చోట మరమ్మతులు మరియు పరిరక్షణ చేయడం

(7) వెబ్ పోర్టల్ కలిగి ఉండండి,

(8) ప్రజలకు చేరువగా ఉండండి

(9) ఆపరేటింగ్ విధానాలను ప్రామాణీకరించండి మరియు

(10) కనుగొనండి మరియు సహకరించండి

ఎన్‌సిఏ తదుపరి సమావేశం ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో జరగనుంది.

 
***

(Release ID: 2015805) Visitor Counter : 84