ప్రధాన మంత్రి కార్యాలయం

నవీ ముంబయి లో అటల్ బిహారి వాజ్ పేయి సేవ్‌రీ-నావ శేవ అటల్ సేతు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


సుమారు 17,840 కోట్ల రూపాయల ఖర్చు తోనిర్మించిన అటల్ సేతు భారతదేశం లో అతి పొడవైన వంతెన యే కాకుండా దేశం లో అతిపొడవైన సముద్రపు సేతువు కూడా

Posted On: 12 JAN 2024 7:19PM by PIB Hyderabad

అటల్ బిహారి వాజ్‌పేయి సేవ్‌రీ-నావ శేవ అటల్ సేతు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవీ ముంబయి లో ఈ రోజు న ప్రారంభించారు. ఒక ఛాయాచిత్ర ప్రదర్శనశాల ను మరియు అటల్ సేతు యొక్క నమూనా ను శ్రీ నరేంద్ర మోదీ పరిశీలించారు.

ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ (ఎమ్‌ టిహెచ్ఎల్) అటల్ సేతు ను 17,840 కోట్ల రూపాయల కు పై చిలుకు ఖర్చు తో నిర్మించడమైంది. ఇది సుమారు 21.8 కిలో మీటర్ ల పొడవైన 6 దోవల తో కూడిన వంతెన. ఈ వంతెన లో దాదాపు 16.5 కి.మీ. మేర సముద్రం మీద మరియు సుమారు 5.5 కి.మీ. నేల పైన ఉంది.

ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘అటల్ సేతు ను ప్రారంభిస్తున్నందుకు సంతోషం కలుగుతోంది, ఇది మన పౌరుల కు జీవన సౌలభ్యాన్ని పెంచే దిశ లో ఒక ముఖ్యమైనటువంటి చర్య అని చెప్పాలి. ఈ వంతెన ప్రయాణ కాలాన్ని తగ్గించడం తో పాటు కనెక్టివిటీ ని ప్రోత్సహించే వాగ్దానాన్ని ఇస్తున్నది. దీనితో రోజు వారీ రాక పోక లు సులభతరం గా మారుతాయి.’’ అని పేర్కొన్నారు.

 

 

 

ప్రధాన మంత్రి వెంట మహారాష్ట్ర యొక్క గవర్నరు శ్రీ రమేశ్ బైస్, మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర యొక్క ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్‌ నవీస్ మరియు శ్రీ అజిత్ పవార్ లు ఉన్నారు.

 

 

అటల్ బిహారి వాజ్‌పేయి సేవ్‌రీ - నావ శేవ అటల్సేతు ను గురించి

పట్టణ ప్రాంతాల లో రవాణా రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల ను మరియు కనెక్టివిటీ ని బలోపేతం చేయడం ద్వారా పౌరుల కు రాకపోకల ను సులభతరం చేయాలి అనేది ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణం గా ఉంది. ఈ దార్శనికత కు అనుగుణం గా, ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ (ఎమ్‌ టిహెచ్ఎల్) ను ప్రస్తుతం ‘అటల్ బిహారి వాజ్‌పేయి సేవ్‌రీ - నావ శేవ అటల్ సేతుపేరు పెట్టి నిర్మించడమైంది. ఈ వారిధి కి ప్రధాన మంత్రి 2016 వ సంవత్సరం డిసెంబరు లో శంకుస్థాపన జరిపారు.

 

 

అటల్ సేతు ను మొత్తం 17,840 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో నిర్మించడమైంది. ఇది సుమారు 21.8 కి.మీ. పొడవైన 6 దోవల తో కూడిన వంతెన. దీనిలో 16.5 కి.మీ. మేరకు సముద్రం మీద మరియు 5.5 కి.మీ. మేర నేల పైన ఉంది. ఇది భారతదేశం లోని అతి పొడవైన మరియు సముద్ర ఉపరితలం మీద ఏర్పాటు చేసిన అతి పొడవైన వంతెన . ఇది ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాని కి మరియు నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాని కి వేగవంతమైన కనెక్టివిటీ ని సమకూర్చడం తో పాటు ముంబయి నుండి పుణె, గోవా మరియు భారతదేశం లోని దక్షిణ ప్రాంతాల కు ప్రయాణించేందుకు పట్టే కాలాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ వంతెన ముంబయి నౌకాశ్రయాని కి మరియు జవాహర్ లాల్ నెహ్‌రూ నౌకాశ్రయానికి మధ్య జరిగే రాక పోక ల ను సైతం మెరుగు పరుస్తుంది.

 

***



(Release ID: 2015740) Visitor Counter : 42