రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఎల్ బి ఎస్ ఎన్ ఎ ఎ లో 125వ సివిల్ సర్వీసెస్ ఆరంభ శిక్షణ కార్యక్రమానికి హాజరైన అధికారులు రాష్ట్రపతిని కలిశారు

Posted On: 18 MAR 2024 7:23PM by PIB Hyderabad

ఎల్ బి ఎస్ ఎన్ ఎ ఎ లో 125వ ఆరంభ శిక్షణ కార్యక్రమానికి హాజరైన సివిల్ సర్వీసెస్ అధికారులు ఈరోజు (మార్చి 18, 2024) రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముని కలిశారు.

 

అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ వారు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే స్థితిలో ఉన్నారన్నారు. వారు వేసే ప్రతి అడుగు వారి చుట్టూ ఉన్న వారిని డిపార్ట్‌మెంట్ లేదా సంస్థ పురోగతికి తమ వంతు కృషి  సేవను అందించడానికి ప్రేరేపించగలదు. ఐ ఏ ఎస్ అధికారులుగా, వారు తమ పరిపాలనా పనితీరు మరియు ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలపై అఖిల భారత దృక్పథాన్ని కలిగి ఉండేలా అభివృద్ధి చేయాలి.

 

ఈ రోజుల్లో, సాంకేతిక ఆధారిత మరియు అవగాహన కలిగిన పౌరులు  పబ్లిక్ లేదా ప్రైవేట్ అందించే ప్రతి సేవ యొక్క బట్వాడాను అనుక్షణం నిఘా వేస్తారని రాష్ట్రపతి చెప్పారు. ఇది తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు పరిష్కారాల సంసిద్ధత మరియు సర్వీస్ ప్రొవైడర్లు ప్రశ్నలకు ముందుగానే సమాధానం ఇస్తూ కస్టమర్లను సంతృప్తి పరచడానికి తమ వంతు ప్రయత్నం చేసే రోజులు. మారుతున్న  ప్రపంచానికి అనుగుణంగా అధికారులు తమ డిజిటల్ పాలనా సామర్థ్యాలను పెంచుకోవాలని ఆమె పేర్కొన్నారు. సమర్థవంతమైన మరియు తెలివైన సుపరిపాలన కోసం ఏఐ, బ్లాక్‌చెయిన్ మరియు బిగ్ డేటా అనలిటిక్స్ వంటి తాజా సాంకేతికతలను ఉపయోగించుకోవాలని ఆమె వారిని కోరారు.

 

సహకారం మరియు సమ్మిళితం ఈ సమయంలో అవసరమని రాష్ట్రపతి అన్నారు. సంస్థాగత, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వివిధ వాటాదారుల మధ్య సహకారంతో తక్కువ వ్యవధిలో ఆశించిన ఫలితాలను పొందడం అవసరం. అదేవిధంగా, కొత్త ఆలోచనలు మరియు కొత్త సాంకేతికతలను గొప్ప మరియు వైవిధ్యమైన అనుభవాలతో సమ్మిళితంగా కలపడం అనేది ఊహించలేని విధంగా ప్రభావవంతమైన మార్పులను తీసుకురాగలదు.

 

అధికారులు ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు సుస్థిరత మరియు సమ్మిళితతను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచం వాతావరణ వేడిమి మరియు వాతావరణ మార్పుల సమస్యలను ఎదుర్కొంటున్నందున, పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించడానికి మరియు సుస్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి వారు వినూత్న చర్యలు తీసుకోవడం చాలా అవసరం. భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాలతో సహా అందరి పురోగతిని నిర్ధారించడం సమ్మిళిత అభివృద్ధి యొక్క మరొక ప్రధాన అంశం 

 

రాష్ట్రపతి ప్రసంగాన్ని చూడటానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

***


(Release ID: 2015620) Visitor Counter : 104