పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో మిషన్ లైఫ్ పై మారథాన్, అవగాహన, ప్రదర్శన ,చర్చా కార్యక్రమం నిర్వహించిన పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఈఐఏసీపీ కేంద్రాలు

Posted On: 18 MAR 2024 8:02PM by PIB Hyderabad

హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో ఈ రోజు  మిషన్ లైఫ్ పై పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఈఐఏసిపి కేంద్రాలు  ఏర్పాటు చేసిన  మారథాన్, అవగాహన,  ప్రదర్శన ,చర్చా కార్యక్రమాన్ని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి  ప్రొఫెసర్ సోమ్ నాథ్ సచ్ దేవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లర్ కురుక్షేత్ర విశ్వవిద్యాలయం ఎకో క్లబ్ కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించి, కార్యక్రమానికి హాజరైన వారితో మిషన్ లైఫ్  ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ సోమ్ నాథ్ సచ్ దేవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం  యువత మరింత కృషి చేయాలన్నారు.పర్యావరణహిత, స్వావలంబన  భారతదేశాన్నిఅభివృద్ధి చేయడానికి  మిషన్ లైఫ్ ఒక ప్రజా ఉద్యమంగా అమలు జరగాలని ఆయన అన్నారు. 2021లో ఐక్యరాజ్యసమితి వేదిక నుంచి పర్యావరణహిత  జీవనశైలి మంత్రాన్ని భారత్ ప్రపంచానికి అందించిందని ఆయన గుర్తు చేశారు.  

వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా, కురుక్షేత్ర విశ్వవిద్యాలయం సహకారంతో  పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఈఐఏసీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.  మార్చి 23న ప్రపంచవ్యాప్తంగా  జరిగే  ఎర్త్ అవర్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొంటారు. 

****



(Release ID: 2015618) Visitor Counter : 164


Read this release in: English , Urdu , Hindi , Punjabi